హీరో సూర్యకు ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్..!

  • IndiaGlitz, [Friday,May 31 2019]

ఎన్నికల సీజన్ వచ్చినా.. సినిమా రిలీజ్‌ అయినా అభిమానులు, కార్యకర్తలు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్స్ దర్శనమిస్తుంటాయ్. మరీ ముఖ్యంగా.. సినిమాలు రిలీజ్ అయితే తమిళనాడులోని పరిస్థితుల గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా సెల్వ రాఘవన్ తెరకెక్కించిన సినిమా ‘ఎన్‌జీకే’.  మే 31, 2019 థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. 

కాగా.. సూర్య సినిమా రిలీజ్‌తో చెన్నైవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు వెలిశాయి. సూర్యకు ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 215 అడుగుల క‌టౌట్ పెట్టేశారు ఫ్యాన్స్. తిరుత్తనిలో ఈ భారీ కటౌట్ వెలిసింది. ఈ భారీ కటౌట్ ఇప్పుడు ఈ కటౌట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. చేతిలో నిప్పు పట్టుకుని ఉన్న సూర్యను చూసి ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. ఈ కటౌట్ కోసం ఏకంగా ఆరున్న‌ర ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. 2017 లో మద్రాస్ హైకోర్టు బతికి ఉన్న వారి కటౌట్స్ ఏర్పాటు చేయకూడదంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సినిమాలు రిలీజ్ టైమ్‌లో ఇలాంటి భారీ కటౌట్స్ ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. కాగా.. గతంలో కూడా విజయ్ నటించిన ‘కత్తి’ సినిమాకు సంబంధించి ఫాన్స్ పాలాభిషేకం నిర్వహిస్తుండగా కటౌట్ నుండి ప్రమాదవశాత్తు కిందపడ్డ కొందరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు.. అజిత్ సినిమా విడుదల సందర్భంగా కూడా కటౌట్ కింద పడడంతో అభిమానులు గాయపడ్డారు. అయితే తాజా ఈ కటౌట్స్ వ్యవహారంపై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

'కెప్టెన్ రాణా ప్రతాప్‌' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌.

మహేశ్‌కు హిట్ ఇస్తా.. రాములమ్మకు థ్యాంక్స్!

సూపర్‌ స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.

ఎన్టీఆర్.. వెంటనే టీడీపీ పగ్గాలు తీసుకో!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఎక్కువ సార్లు.. ఎవరి నోట విన్నా ‘ఎన్టీఆర్.. ఎన్టీఆర్’ అనే పేరే వినపడుతోంది. ఎన్నికల ఫలితాలు చూసిన తెలుగు రాష్ట్రాల టీడీపీ కార్యకర్తలు

ప్రణయ్ హత్య తర్వాత పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను అతి కిరాతకంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది.

మోదీ 2.0 కేబినెట్‌లో శాఖల కేటాయింపు

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం గురువారం నాడు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గురువారం కేవలం మంత్రులుగా ప్రమాణం చేయగా.. ఇవాళ వారందరికీ శాఖలను కేటాయించడం జరిగింది.