close
Choose your channels

Bigg Boss 7 Telugu : ఆ క్యారెక్టర్లు ఎలా వేశారు.. షకీలాను కెలికిన టేస్టీ తేజ, ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది

Tuesday, September 5, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 7 సీజన్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్‌లో ఇంట్లో అడుగుపెట్టారు. గత సీజన్‌‌కు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. రూల్స్ కూడా సమూలంగా మార్చారని టాక్. అన్ని సీజన్‌ల మాదిరిగానే సోమవారం కావడంతో నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. ఈ వారం గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యువార్, కిరణ్ రాథోడ్, శోభా శెట్టి, షకీలా, రతికలు నామినేషన్స్‌లో వున్నారు. వీరందరిలోకి గౌతమ్‌కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి.

కంటెస్టెంట్స్ ఒకరినొకరు పరిచయం చేసుకునే పని ప్రారంభించారు. అమర్‌దీప్ చౌదరి, ఆట సందీప్‌లు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, రతికాలు కూడా పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మన కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ మోనిత (శోభాశెట్టి) అర్ధరాత్రి మేకప్ లేకుండా భయపెట్టింది. ఆట సందీప్, గౌతమ్, అమర్‌దీప్‌లు గరిటపట్టి తమ పాకశాస్త్ర ప్రావీణ్యం చూపగా.. అమ్మాయిలు మాత్రం కిచెన్ వంక చూడలేదు. పైగా అది బాలేదు, ఇది బాలేదు అంటూ వంకలు పెట్టారు.

ప్రతి సీజన్‌లోనూ అదిరిపోయే లుక్‌లో కనిపించే బిగ్‌బాస్ హౌస్‌లో ఈసారి కంటెస్టెంట్స్ కనీసం కూర్చోవడానికి సోఫాలు, బెడ్స్ లేకపోవడంతో ఈసారి పెద్దటాస్క్ ఏదో ఇచ్చి వుంటాడులే అనుకున్నారంతా. దీనికి తగ్గట్లుగానే ఇవాళ్టీ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరిని ఓ గదిలోకి పంపి .. కావాల్సిన సామాన్లను ఇచ్చి పంపించాడు. సీనియర్ హీరో శివాజీ ఆదివారం నాడు నాగార్జున ఇచ్చిన రూ.35 లక్షల ఆఫర్ గుర్తుచేసుకుని ఫీల్ అయ్యాడు. అనవసరంగా 35 లక్షలు వదులుకున్నానంటూ సరదాగా కామెంట్ చేశాడు.

ఇక యూట్యూబర్, జబర్తస్త్ కమెడియన్ టేస్టీ తేజ.. తన య్యూటూబర్ లక్షణాలను ఇక్కడా కొనసాగించాడు. షకీలాని కెలికాడు. మీకు అవకాశాలు లేక ఆ టైపు సినిమాలు చేశారా... ఇష్టంతో చేశారా, ఇష్టం లేకుండా..? ఆ క్యారెక్టర్లు వేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటీ..? ఫ్యామిలీ ఏమి అనలేదా అంటూ షకీలాపై ప్రశ్నల వర్షం కురిపించాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన షకీలా.. మళ్లీ మాట్లాడకుండా వార్నింగ్ ఇచ్చింది. నాకు ఆ టైప్ క్యారెక్టర్లు వచ్చాయి కాబట్టే చేశా.. గ్లామర్ సాంగ్స్ చేస్తే లేని తప్పు గ్లామర్ రోల్స్ చేస్తే వచ్చిందా అంటూ మండిపడింది. ఫ్యామిలీకి డబ్బులు వస్తున్నప్పుడు వాళ్లు నన్ను ఏమంటారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ షురూ చేశాడు బిగ్‌బాస్. నరకం సెట్‌కి ఒక్కొక్కరిని పిలిపించి, వారితో ఫోటోలు చింపి మంటల్లో వేయాలని కోరాడు. అలా హీరో శివాజీ... దామిని, గౌతంలను, ప్రియాంక జైన్.. పల్లవి ప్రశాంత్, రతికలను నామినేట్ చేశారు.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment