BiggBoss Telugu 7:గ్రాండ్‌గా లాంచైన ‘‘బిగ్‌బాస్-7’’ : టెస్టెంట్స్ వీరే, లిస్ట్‌లో శివాజీ, షకీలా.. ఈసారి మామూలుగా వుండదట

  • IndiaGlitz, [Monday,September 04 2023]

తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 7 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా అంటూ ఇన్ని రోజులు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన నాగార్జున బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ సీజన్‌లో పాల్గొననున్న కంటెస్టెంట్‌లను ఒక్కొక్కరిగా పరిచయం చేశారు. తమ కొత్త చిత్రాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో విజయ్ దేవరకొండ (ఖుషి), నవీన్ పొలిశెట్టి (మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి)లు స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.

రోటీన్‌కు భిన్నంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక జరిగింది. గడిచిన ఆరు సీజన్ల వరకు 21 మంది పాల్గొనగా.. ఈ సీజన్‌లో మాత్రం కేవలం 14 మంది సభ్యులు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వచ్చే వారం మరో ఏడుగురిని హౌస్‌లోకి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఐదుగురు కంటెస్టెంట్స్‌కి నాగ్ బంపరాఫర్ ఇచ్చారు. సూట్‌కేసులో రూ.20 లక్షలు పెట్టి వెళ్లిపోవాలనుకున్న వారు ఆ సొమ్ము తీసుకుని ఇప్పుడే వెళ్లిపోవచ్చని చెప్పారు. దీనికి ఎవరూ అంగీకరించలేదు. దీంతో నాగ్ మరో రూ.5 లక్షలు చొప్పున పెంచుకుంటూ రూ.35 లక్షల వరకు వెళ్లారు. తొలుత శివాజీ టెంప్ట్ అయినా , చివరి నిమిషంలో మాత్రం ఆయన మనసు మార్చుకున్నారు.

కంటెస్టెంట్స్ వీరే :

1.ప్రియాంక జైన్ (సీరియల్ నటి)

2. శివాజీ (హీరో)

3. దామిని భట్ల (సింగర్)

4. షకీలా (సీనియర్ నటి)

5. ప్రిన్స్ యువార్ (సీరియల్ నటుడు)

6. శుభశ్రీ (లాయర్ , నటి)

7. సందీప్ (కొరియోగ్రాఫర్)

8. శోభా శెట్టి (సీరియల్ నటి)

9. టేస్జీ తేజ (జబర్తస్త్ కమెడియన్)

10. రతిక రోజ్ (నటి)

11. డాక్టర్ గౌతమ్ కృష్ణ (నటుడు)

12. కిరణ్ రాథోడ్ (నటి)

13. పల్లవి ప్రశాంత్ (రైతు)

14. అమర్‌దీప్ చౌదరి (సీరియల్ నటుడు)

More News

Chandrababu Naidu:చెప్పినంత ఇవ్వకుంటే .. బెదిరింపులు, చంద్రబాబు 'ముడుపుల' దందా ఇలా..?

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, నిప్పులా బతికానని చెప్పుకునే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి దశాబ్ధాలుగా ఎందరో విమర్శలు చేస్తూనే వున్నారు.

ఏడో సీజన్ తో బిగ్ బాస్ వస్తున్నాడు !!

అనుక్షణం ఉత్కంఠ.. ప్రతి క్షణం ఉత్సాహం.. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని థ్రిల్.. కలగలిసిన ఒక సంచలనానికి “స్టార్ మా” సెప్టెంబర్ 3 న తెరతీయబోతోంది.

ISRO Aditya L1:అగ్రరాజ్యాలకు మరో సవాల్ విసిరిన ఇస్రో.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1

చంద్రయాన్ 3 సక్సెస్‌తో ప్రస్తుతం ఇస్రో మంచి ఊపులో వుంది. దీనిలో భాగంగా సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైంది.

AP Govt:ఏపీలో ఇవాళ్టీ నుంచి అందుబాటులోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం .. 20 నిమిషాల్లోనే పూర్తి, ఏంటీ కార్డ్ 2.0

తన హయాంలో ఎన్నో పాలనా సంస్కరణలను తెచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వార్డు, గ్రామ వాలంటీర్ల విధానంతో పాలనను ఇంటింటికి చేరువ చేశారు.

Chandrababu Naidu:చంద్రబాబుపై ఐటీ 'ఐ' : అమరావతిలో నిర్మాణాలు, షెల్ కంపెనీలతో కోట్లు జేబులోకి.. రట్టు చేసిన సీబీఐ

దొంగ దొరికే వరకు దొరేనంటారు. అలాగే ఏ వ్యక్తి  చేసిన నేరానికైనా శిక్ష పడాలంటే పాపం పండాలంటారు.