BiggBoss: బిగ్‌బాస్‌లో ‘‘బెడ్ రూమ్’’ కామెంట్స్...ఇనయాపై శ్రీహాన్- శ్రీసత్య ఫైర్, ఆదికి సీక్రెట్ టాస్క్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్‌లో ఇంట్రెస్టింగ్ టాస్క్‌లతో ఆడియన్స్‌కి అసలు సిసలు మజాను పంచుతున్నారు నిర్వాహకులు. ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీదారులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించాడు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తిలు రెడ్ టీమ్‌లో ... బాలాదిత్య, ఇనయా, మెరీనా, రోహిత్, వాసంతి, ఆదిరెడ్డిలు బ్లూటీమ్‌లో వున్నారు. అయితే రాజ్ కోసం రెండు జట్లు కొట్టుకున్నాయి. చివరికి బ్లూటీమ్ అతన్ని సొంతం చేసుకుంది.
మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ‘‘క్యాప్చర్ ద వార్’’ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఇరు జట్ల సభ్యులు రెండు వాల్స్‌పై నిలబడతారు. వారికి ఇచ్చిన కర్రలతో ప్రత్యర్ధులతో పోరాడాల్సి వుంటుంది. వాల్ నుంచి కిందపడితే వారు ఔట్. చివరి వరకు వాల్‌పై ఏ టీం సభ్యులు వుంటే ఆ జట్టు విజయం సాధించినట్లు. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాడ్ దగ్గర వుండటంతో.. సంచాలక్‌గా ఎవరు వుండాలనే అవకాశం వాళ్లకి ఇచ్చాడు. దీంతో గీతూ సంచాలక్‌గా మారింది. ఇక ఎవరితో పోటీపడాలో నిర్ణయించుకునే ఛాన్స్ కూడా రెడ్ టీమ్‌కే ఇవ్వడంతో బ్లూ టీమ్‌లోని ఇనయా, వాసంతి, మెరీనాలతో ....రేవంత్, శ్రీహాన్, ఫైమాలు ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇక సంచాలక్‌గా అవకాశం రావడంతో గీతూ పాప తన స్ట్రాటజీ మొదలుపెట్టింది. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే ఔట్ అని చెప్పింది. ఆట ప్రారంభమైన వెంటనే వీక్ కంటెస్టెంట్స్ అనుకున్న ఇనయా, మెరీనా, వాసంతిలు పులుల్లా పోరాడారు. పోటుగాళ్లు అనుకున్న శ్రీహాన్, రేవంత్‌లు వీళ్ల ధాటికి ఓడిపోయారు. నాగార్జున అన్నట్లు రేవంత్ ఉన్మాదిలా ఆడాడు. ఆడాళ్లను ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ బీహేవ్ చేశాడు. ఈ ఫస్ట్ మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవడంతో వారు బ్లూటీమ్‌లో వున్న రోహిత్‌ను చంపేశారు.
ఈ రోజు శ్రీహాన్, శ్రీసత్యలతో ఇనయా గొడవ హైలెట్‌గా నిలిచింది. ఫిజికల్‌గా గెలవలేమని భావించిన శ్రీహాన్.. ఇనయాను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. నామినేషన్‌లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని కామెంట్ చేశాడు. దీనికి ఇనయా ధీటుగా బదులిచ్చింది. నువ్వు ఈ మధ్య ఎక్కడ పడుకుంటున్నావో చూస్తున్నా వ్యాఖ్యానించింది. శ్రీహాన్, శ్రీసత్యలు కలిసి పడుకుంటున్నారనే అర్ధంలో ఆమె మాట వుండటంతో వీరిద్దరూ ఇనయాపై రెచ్చిపోయారు. ఏం వాగుతున్నావ్.. ముఖం పగిలిపోద్ది అంటూ ఇనయా మీదకి దూసుకెళ్లాడు శ్రీహాన్. అటు శ్రీసత్య కూడా .. నువ్వు బయట ఏం చేశావో, ఇక్కడ ఎలాంటి పనులు చేశావో మాకు తెలుసు.. నీలా ముద్దులు పెట్టించుకోలేదు, ఒళ్లో తల పెట్టుకుని పడుకోలేదంటూ సూర్యతో ఇనయా ఎలా వుండేదో చెప్పింది.
మరోవైపు సిగరెట్లు లేక బాలాదిత్యలు అల్లాడిపోయాడు. గీతూ దగ్గరకెళ్లి చేతులెత్తి దండం పెట్టి క్షమాపణలు కోరాడు. బాధలో, చెల్లిగా ఆ మాట అన్నాను అంటూ చెప్పాడు. నా స్టూడెంట్స్‌కి నేను సిగరెట్లు తాగడం తెలియకూడదని అనుకున్నాను, కానీ తెలిసిపోయిందని బాలాదిత్య కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత జరిగినా గీతూ మాత్రం సిగరెట్లు ఇవ్వనని తేల్చిచెప్పింది. మధ్యలో ఆదిరెడ్డి కలగజేసుకుంటూ.. ఆయన దండం పెట్టి చెప్పినా చాల్లేదా నీకు అని మండిపడ్డాడు. చెంపదెబ్బ కొట్టి దండం పెడితే సరిపోతుందా అని గీతూ ఆన్సర్ ఇచ్చింది. అయితే ఇంటి సభ్యులంతా నచ్చజెప్పడంతో బాలాదిత్యకు సిగరెట్లు ఇచ్చింది. ఎపిసోడ్ చివరిలో ఆదిరెడ్డిని బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ని చెత్త చెత్తగా చేసి ఆ నిందని రెడ్ స్క్వాడ్‌లో వున్న ఒకరి మీద వేయాలని ఆదేశించాడు. ఇందుకోసం మీ టీమ్ సభ్యుల సాయం తీసుకోవచ్చని చెప్పాడు. దీనిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే మీ టీంలో మరణించిన సభ్యుడిని బతికించే ఛాన్స్ వుంటుందని బిగ్‌బాస్ తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com