బిగ్‌బాస్-4కి ముహూర్తం ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
‘బిగ్‌బాస్’ సీజన్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూసే ప్రేక్షకులకు షో యాజమాన్యం తేదీని ప్రకటించేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. సీజన్ 3లా కాకుండా అందిరికీ బాగా తెలిసిన సెలబ్రిటీస్‌తో ఈ షోను నడపనున్నారు. ఈ షోలో ఈ సారి ఒకరు కాకుండా రెండు జంటలు పాల్గొననున్నాయని సమాచారం. అయితే ప్రేక్షకుల ఎదురు చూపులకు బిగ్‌బాస్ నిర్వాహకులు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఈ షో సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ‘స్టార్ మా’లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ షో నిర్వాహకులు ఓ కొత్త ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోను సైతం నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునే ఈ నాలుగో సీజన్‌ను కూడా నడిపించనున్నారు. ఈ సీజన్లో పాల్గొనబోతున్నవారికి ముందుగానే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి వారందరినీ ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉంచినట్టు సమారం.
14 రోజుల గడువు ముగియగానే మరోసారి పరీక్షలు నిర్వహించి అందరికీ నెగిటివ్ అని తేలితేనే.. వారిని బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. హౌస్‌లో కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ సారి సీజన్ కాల వ్యవధిని కూడా తగ్గించారని సమాచారం. ఈ సీజన్ 10 వారాలు మాత్రమే ఉంటుందని.. దానికి తగ్గట్టే ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీల వంటివేమీ ఉండవని సమాచారం. మొత్తానికి ఈ సీజన్ కాల వ్యవధి తక్కువైనా మరింత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments