Bigg Boss Telugu 7 : నో నామినేషన్స్, ఓన్లీ ఎమోషనల్.. అమర్, అర్జున్‌లకు బుక్ ఆఫ్ మెమొరీస్ చూపిన బిగ్‌బాస్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ముగింపుకు చేరుకుంది. మరో ఏడు రోజుల్లో సీజన్ ముగిసి.. కొత్త విజేత ఆవతరించనున్నాడు. గత వారం శోభాశెట్టి ఎలిమినేషన్ కావడంతో అర్జున్ అంబటి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్దీప్, పల్లవి ప్రశాంత్‌లు ఫినాలే వీక్‌లోకి అడుగుపెట్టినట్లుగా నాగార్జున ప్రకటించారు. మరి వీరిలో టైటిల్ విజేత కానున్నారోనని ఉత్కంఠ నెలకొంది. గ్రాండ్ ఫినాలే కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చివరి వారం కావడంతో ఎలాంటి నామినేషన్లు, టాస్కులు వుండవు. కేవలం హౌస్‌లో వున్న కంటెస్టెంట్స్ కలిసి వుండేలా.. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చూస్తారు. అలాగే ఇంటి సభ్యుల జర్నీని, వారి జ్ఞాపకాలను గుర్తుచేస్తారు బిగ్‌బాస్.
దీనిలో భాగంగా అమర్‌దీప్‌ను గార్డెన్ ఏరియాలోకి పిలిచిన బిగ్‌బాస్ అతనికి సంబంధించిన ఫోటోలను ఏర్పాటు చేశారు మీ పేరుకు అర్ధం ఎప్పటికీ వెలిగే జ్యోతి. అదే మీ జర్నీలో కనిపించింది. ప్రతీ గేమ్‌లో ఎలాగైనా గెలిచి చివరి వరకు చేరాలనే తపన మీ ప్రమాణాన్ని మలిచింది అని బిగ్‌బాస్ చెప్పాడు. మీ అల్లరిని, వెటకారాన్ని , మీ మనసుని మీ స్నేహతులే అర్ధం చేసుకుని ఇతరుల నుంచి మిమ్మల్ని రక్షించారని శోభాశెట్టి, ప్రియాంకల గురించి ప్రస్తావించారు. చేసిన పొరపాట్లు తెలుసుకుని ముందుకు కదలాలంటూ అమర్దీప్ జర్నీని వివరించారు బిగ్‌బాస్.
తర్వాత తాను వాడిన వస్తువులు, ఫోటోలను మొత్తం చూసుకున్న అమర్‌దీప్‌ను బ్రిక్స్ టాస్క్ గుర్తొచ్చి కాసేపు అలాగే ఆగిపోయాడు. ఆ టాస్కు సమయంలో కెప్టెన్సీ రాకపోవడంతో తాను ఎంతగానో ఏడ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. మొత్తం 16 నిమిషాల వీడియోతో అమర్దీప్ ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరిగా థ్యాంక్స్ బిగ్‌బాస్ అని చెప్పి బయటికి వెళ్లాడు.
ఇక వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో సీజన్ మధ్యలో అడుగుపెట్టి.. ఎవ్వరూ సాయం చేయకపోయినా తనదైన ఆటతీరుతో ఈ సీజన్లో తొలి ఫైనలిస్టుగా నిలిచారు అర్జున్. ఆయనను ఓ గదిలోకి పిలిచి బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూపించాడు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోల్ని చూసి మురిసిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లి తన 14 నిమిషాల జర్నీ వీడియో చూసుకున్నాడు. ముఖ్యంగా తన భార్య బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చినప్పటి వీడియోను చూసి అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. మొదటి రోజు నుంచి మీ ఆటతీరు ఆసక్తికరంగా వుందని, ఫోకస్ మొత్తం ఆటపైనే పెట్టి అలరించారని బిగ్‌బాస్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓపిక, ఆటపట్ల చూపిన శ్రద్ధ తనను ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. అనంతరం బిగ్‌బాస్‌కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాడు అర్జున్.
కాగా.. ఈ సీజన్లో టైటిల్ ఫేవరేట్‌గా అమర్దీప్ కనిపిస్తున్నాడు. అటు పల్లవి ప్రశాంత్ కూడా సామాన్యుడి కోటాలో బాగానే ఓట్లు సంపాదించి తానూ రేసులో వున్నానని చెబుతున్నాడు. అటు ఇంటికి పెద్దాయన శివాజీని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. సీనియర్ నటుడు కావడంతో ఆయనకున్న ఫాలోయింగ్ సామాన్యమైనది కాదు. మరి వీరు ముగ్గురిలో ఎవరిని టైటిల్ వరిస్తుందో మరికొద్దిరోజుల్లో తేలిపోతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments