BiggBoss: మన రేవంత్ కెప్టెన్ అయ్యాడోచ్... సూర్యకి ఇనయా షాక్, బాలాదిత్య ఉగ్రరూపం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్‌లో ఎట్టకేలకు సింగర్ రేవంత్ కోరిక తీరింది. కెప్టెన్ అవ్వాలనే తన కోరికను ఆయన నెరవేర్చుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్ రేసులో బాలాదిత్య, రేవంత్, ఆర్జే సూర్య నిలిచిన సంగతి తెలిసిందే. మైండ్ గేమ్ టాస్కులో అద్భుతంగా రాణించిన వీరు ముగ్గురికి కెప్టెన్ అవ్వాలంటే ... ఇంటి సభ్యులను మెప్పించి పూల దండలు మెడలో వేయించుకోవాలి. తొలుత సూర్యే కెప్టెన్‌గా గెలుస్తాడని అనుకున్నారు. తర్వాత బాలాదిత్యకు రెండోసారి ఛాన్స్ ఇవ్వాలని మిగిలిన కొందరు భావించారు. కానీ చివరిలో రేవంత్‌కి ఎక్కువ మంది ఓటేయ్యడంతో అతను కెప్టెన్‌గా గెలిచి తన పంతం నెగ్గించుకున్నాడు. కెప్టెన్‌గా ఒక బాధ్యత వస్తుందని అందుకే రేవంత్‌కి మద్ధతు పలికినట్లు చాలా మంది చెప్పారు.
ఇక...చెప్పుకోవాల్సిన మరో ఇష్యూ ఇనయా- సూర్యలది. తను రోజు రోజుకు నచ్చేస్తున్నాడని, క్రష్ వుందంటూ సూర్యపై ఇనయా తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. దీంతో కెప్టెన్ ఎంపిక సమయంలో అంతా సూర్య మెడలో ఆమె దండ వేస్తుందని అంతా భావించారు. కానీ... అందరికీ షాకిస్తూ ఇనయా బిహేవ్ చేసింది. ఈ ఓటు మనదేనని తల కిందకి వంచి రెడీగా వున్నాడు సూర్య.. ఇనయా కూడా దండ వేస్తున్నట్లే వేసి పక్కనే వున్న రేవంత్ మెడలో వేసింది. అంతే దగా.. దగా.. మోసం అంటూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రావడం హైలైట్‌గా నిలిచింది. కానీ ఆమె సూర్యని హగ్ చేసుకుంది. ఆ వెంటనే రేవంత్‌కు ఓటేయ్యడానికి గల కారణాలను వివరించింది ఇనయా. ఇంటి సభ్యుల్లో ఎక్కువ మంది రేవంత్‌ను కార్నర్ చేశారని.. అందుకే అతని మెడలో దండ వేశానని చెప్పింది.
తర్వాత ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌కి రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడు. అయితే ఈ టాస్క్‌లో గీతూ బాలాదిత్యల మధ్య గొడవ హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడూ లేనిది మన మిస్టర్ కూల్ బాలాదిత్య ఉగ్రరూపం చూపించాడు. చంటి - రేవంత్ గొడవ మధ్యలో మాట్లాడానికి వచ్చిన బాలాదిత్యను గీతూ రెచ్చగొట్టింది. గొడవ మధ్యలోకి వచ్చి లాయర్ పాయింట్లు తీస్తున్నాడు అంది. గతంలో ఓ వెబ్ సీరిస్‌లో లాయర్‌గా నటించాడు బాలాదిత్య. దీంతో తన చదువుని తక్కువ చేసి మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు... గీతూ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా తప్పంటూ వార్నింగ్ ఇచ్చాడు. గీతూ కూడా వాయిస్ రైజ్ చేయడంతో గొంతుని లేపడం గొప్ప కాదు సరదాకైనా ఓ లిమిట్ వుంటుంది అది దాటితే బాగోదని బాలాదిత్య ఫైరయ్యాడు. మొత్తం మీద ఇప్పటి వరకు ఇంటికి పెద్దలా వున్న బాలాదిత్యలో ఈ కోణం చూసి జనం జడుసుకున్నారో.. లేక మెచ్చుకున్నారో ఓట్ల రూపంలో బయటకు రానుంది.
ఈ వారం ఎలిమినేషన్ లో చంటి, ఫైమా, ఇనయా, ఆదిరెడ్డి, మెరీనా, బాలాదిత్య, వాసంతి, అర్జున్ ఉన్నారు. ఇప్పటివరకు షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు ఎలిమినేటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రేపు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎవరికి క్లాస్ పీకుతారో, ఎవరికి కాంప్లిమెంట్ ఇస్తారోనని కంటెస్టెంట్స్, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments