BiggBoss: ఇనయాపై మూకుమ్మడి దాడి... ఈ వారం నామినేషన్స్‌లో వీరే

  • IndiaGlitz, [Tuesday,November 08 2022]

గలాటా గీతూ హౌస్‌ను వీడటంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషనలైన సంగతి తెలిసిందే. కానీ ఏం చేస్తాం బిగ్‌బాస్ ఆదేశాన్ని పాటించాల్సిందే. కాకపోతే.. ఆమె ఎలిమినేషన్ ఇంటి సభ్యులకు హెచ్చరిక వంటిదే. సీరియస్‌గా లేకుంటే ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా ఇంటిదారి పట్టాల్సిందేనని అలర్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఎంత ఇష్టమైన వ్యక్తయినా సరే .. నాగార్జున కూడా ఏం చేయలేరని తేలిపోయింది. మరి మన గీతూ పాప లేకుండా హౌస్ ఎలా వుంది..? ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగాయో చూస్తే:

సోమవారం కావడంతో నామినేషన్స్‌కి శ్రీకారం చుట్టాడు బిగ్‌బాస్. ఎవరినైతే నామినేట్ చేయాలనుంటారో వారి ముఖాన ఎరుపు రంగు నీళ్లు కొట్టి.. రీజన్ చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఎప్పటిలాగే ఇంటి సభ్యులంతా ఇనయాను టార్గెట్ చేశారు. అత్యధికంగా ఓట్లు ఆమెకే పడ్డాయి. ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఆమెనే నామినేట్ చేశారు. మొత్తం మీద బాలాదిత్య, మెరీనా, ఫైమా, వాసంతి, కీర్తి, ఇనయా, శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్‌లు ఈ వారం నామినేషన్స్‌లో వుండగా.. శ్రీసత్య, వాసంతి, రోహిత్‌లు సేఫ్ సైడ్ వున్నారు.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే

శ్రీసత్య : బాలాదిత్య, ఇనయా
వాసంతి : ఇనయా , ఆదిరెడ్డి
ఆదిరెడ్డి : ఇనయా, రేవంత్
కీర్తి : శ్రీహాన్, ఇనయా
బాలాదిత్య : శ్రీహాన్, ఇనయా
మెరీనా : ఆదిరెడ్డి, ఇనయా
రాజ్ : ఇనయా , శ్రీహన్
శ్రీహాన్ : కీర్తి, ఇనయా
ఇనయా : ఫైమా, శ్రీహాన్
రేవంత్ : వాసంతి, ఆదిరెడ్డి
ఫైమా : వాసంతి, మెరీనా
రోహిత్ : రేవంత్, ఆదిరెడ్డి

ఈరోజు రేవంత్‌కి సైలెంట్‌గా వుండే ఇనయాకి మధ్య గొడవ జరిగింది. నేను అగ్రెసివ్‌గా వుంటానని రెండు వారాలు నామినేట్ చేశారని వాసంతిపై ఫైర్ అయ్యాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఇది నిజమే కదా నేను కొత్తగా చెప్పేదేముందని ధీటుగా బదులిచ్చింది. రేవంత్‌ను మీరు అంటే మర్యాదగా మాట్లాడే వాసంతి... నువ్వు అని పిలవడం మొదలుపెట్టింది. దీంతో రేవంత్‌కు చిర్రెత్తుకొచ్చింది. తనతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి వాసంతి కూడా .. నువ్వు కూడా జాగ్రత్తగా మాట్లాడాలంటూ ధీటుగా బదులిచ్చింది.

ఇక ఇంటిలో వెటకారానికి, వెకిలి చేష్టలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మన శ్రీహాన్‌కి కీర్తికి ఈవారం పడింది. హౌస్‌లో రకరకాల ఎక్స్‌ప్రెషెన్స్ పెడుతున్నాడని చెబుతూ అతనిని నామినేట్ చేసింది. తర్వాత రేవంత్- ఆదిరెడ్డిల ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్‌నే వుంది. రేవంత్‌ కోపంపై ఆదిరెడ్డి సెటైరికల్‌గా మాట్లాడాడు. ఇక రండి అంటే కోపంగా అంటావ్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి రేవంత్ అది నా గ్లేమ్ ప్లాన్, నువ్వు రాలేవా అని ప్రశ్నించాడు. దానికి ఆదిరెడ్డి.. నువ్వు ఎంత తోపైనా , నేను బక్కపలచగా వున్నా.. తాను తగ్గనని ఫైర్ అయ్యాడు.

More News

క‌ళ్యాణ్ రామ్ 'అమిగోస్' రిలీజ్ డేట్

టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. రీసెంట్‌గా ‘బింబిసార’ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించారు.

Vishwak Sen- Arjun Sarja: ఇష్టంలేని కాపురం చేయలేం ..నా తప్పుంటే క్షమించండి సర్: విశ్వక్‌సేన్

సీనియర్ నటుడు అర్జున్ సర్జా, యువ హీరో విశ్వక్ సేన్ మధ్య చోటు చేసుకున్న వివాదం టాలీవుడ్‌లో పెను దుమారానికి కారణమైంది. అతను కమిట్‌మెంట్ లేని నటుడని...

గీతూ ఎలిమినేషన్.. హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం, నాగార్జున సైతం కంటతడి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ప్రేక్షకులను , కంటెస్టెంట్స్‌ను చివరికి హోస్ట్‌ నాగార్జునను కూడా కంటతడి పెట్టించింది ఈ రోజు ఎపిసోడ్. స్ట్రాటజీ అనుకోండి, కన్నింగ్‌నెస్ అనుకోండి

Munugode Bypoll : హోరాహోరీ పోరులో టీఆర్ఎస్‌దే విజయం, బీజేపీకి సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి

Alia Bhatt Ranbir Kapoor: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా... కపూర్ ఇంట సంబరాలు

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు