BiggBoss: ఇనయాపై మూకుమ్మడి దాడి... ఈ వారం నామినేషన్స్‌లో వీరే
Send us your feedback to audioarticles@vaarta.com
గలాటా గీతూ హౌస్‌ను వీడటంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషనలైన సంగతి తెలిసిందే. కానీ ఏం చేస్తాం బిగ్‌బాస్ ఆదేశాన్ని పాటించాల్సిందే. కాకపోతే.. ఆమె ఎలిమినేషన్ ఇంటి సభ్యులకు హెచ్చరిక వంటిదే. సీరియస్‌గా లేకుంటే ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా ఇంటిదారి పట్టాల్సిందేనని అలర్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఎంత ఇష్టమైన వ్యక్తయినా సరే .. నాగార్జున కూడా ఏం చేయలేరని తేలిపోయింది. మరి మన గీతూ పాప లేకుండా హౌస్ ఎలా వుంది..? ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగాయో చూస్తే:
సోమవారం కావడంతో నామినేషన్స్‌కి శ్రీకారం చుట్టాడు బిగ్‌బాస్. ఎవరినైతే నామినేట్ చేయాలనుంటారో వారి ముఖాన ఎరుపు రంగు నీళ్లు కొట్టి.. రీజన్ చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఎప్పటిలాగే ఇంటి సభ్యులంతా ఇనయాను టార్గెట్ చేశారు. అత్యధికంగా ఓట్లు ఆమెకే పడ్డాయి. ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఆమెనే నామినేట్ చేశారు. మొత్తం మీద బాలాదిత్య, మెరీనా, ఫైమా, వాసంతి, కీర్తి, ఇనయా, శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్‌లు ఈ వారం నామినేషన్స్‌లో వుండగా.. శ్రీసత్య, వాసంతి, రోహిత్‌లు సేఫ్ సైడ్ వున్నారు.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే
శ్రీసత్య : బాలాదిత్య, ఇనయా
వాసంతి : ఇనయా , ఆదిరెడ్డి
ఆదిరెడ్డి : ఇనయా, రేవంత్
కీర్తి : శ్రీహాన్, ఇనయా
బాలాదిత్య : శ్రీహాన్, ఇనయా
మెరీనా : ఆదిరెడ్డి, ఇనయా
రాజ్ : ఇనయా , శ్రీహన్
శ్రీహాన్ : కీర్తి, ఇనయా
ఇనయా : ఫైమా, శ్రీహాన్
రేవంత్ : వాసంతి, ఆదిరెడ్డి
ఫైమా : వాసంతి, మెరీనా
రోహిత్ : రేవంత్, ఆదిరెడ్డి
ఈరోజు రేవంత్‌కి సైలెంట్‌గా వుండే ఇనయాకి మధ్య గొడవ జరిగింది. నేను అగ్రెసివ్‌గా వుంటానని రెండు వారాలు నామినేట్ చేశారని వాసంతిపై ఫైర్ అయ్యాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఇది నిజమే కదా నేను కొత్తగా చెప్పేదేముందని ధీటుగా బదులిచ్చింది. రేవంత్‌ను మీరు అంటే మర్యాదగా మాట్లాడే వాసంతి... నువ్వు అని పిలవడం మొదలుపెట్టింది. దీంతో రేవంత్‌కు చిర్రెత్తుకొచ్చింది. తనతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి వాసంతి కూడా .. నువ్వు కూడా జాగ్రత్తగా మాట్లాడాలంటూ ధీటుగా బదులిచ్చింది.
ఇక ఇంటిలో వెటకారానికి, వెకిలి చేష్టలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మన శ్రీహాన్‌కి కీర్తికి ఈవారం పడింది. హౌస్‌లో రకరకాల ఎక్స్‌ప్రెషెన్స్ పెడుతున్నాడని చెబుతూ అతనిని నామినేట్ చేసింది. తర్వాత రేవంత్- ఆదిరెడ్డిల ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్‌నే వుంది. రేవంత్ కోపంపై ఆదిరెడ్డి సెటైరికల్‌గా మాట్లాడాడు. ఇక రండి అంటే కోపంగా అంటావ్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి రేవంత్ అది నా గ్లేమ్ ప్లాన్, నువ్వు రాలేవా అని ప్రశ్నించాడు. దానికి ఆదిరెడ్డి.. నువ్వు ఎంత తోపైనా , నేను బక్కపలచగా వున్నా.. తాను తగ్గనని ఫైర్ అయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com