BiggBoss: నేహా ఔట్... రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యానంటూ కామెంట్స్

  • IndiaGlitz, [Monday,September 26 2022]

ఆదివారం పూట ఎలిమినేషన్ రౌండ్ వచ్చిందంటే చాలు షాకివ్వడానికి బిగ్‌బాస్ రెడీగా వుంటాడు. జనం ఎక్స్‌పెక్టేషన్స్‌కి విరుద్ధంగా ఇంకేవరినో హౌస్ నుంచి పంపేస్తూ ఆడియన్స్‌కి షాకిస్తారు. ఈసారి కూడా ఎప్పటిలాగే నామినేషన్స్‌లో తక్కువ ఓట్లు వచ్చిన వాసంతి, కీర్తిలను కాకుండా నేహా చౌదరిని బయటకు పంపేశారు.

ఆదివారం వచ్చిరాగానే కంటెస్టెంట్స్‌తో ‘సుత్తి దెబ్బ’ పేరుతో గేమ్ ఆడించాడు నాగార్జున. దీనిలో భాగంగా ఇంటి సభ్యుల మనస్తత్వాలు చెప్పాల్సి వుంటుంది. వారు చెప్పిన అభిప్రాయంతో ఇంటిలోని ఆడియెన్స్ సైతం తమ ఓపీనియన్ చెబుతారు. రెండూ మ్యాచ్ అయితేనే దానిని నిజంగా లేదంటే తప్పుగా పరిగణిస్తారు. తప్పు చెప్పిన ఇంటి సభ్యుడిని సుత్తితో దెబ్బ కొట్టాల్సి వుంటుంది. ఎవరికి నోటిదూల ఎక్కువ.. హౌస్‌లో బ్రెయిన్ లెస్ ఎవరు..? యూజ్‌లెస్ ఎవరు..? యారగెంట్ ఎవరు..? గుడ్డి ఎద్దు ఎవరు..? అటెన్షన్ స్పీకరు ఎవరు..? అని నాగార్జున ప్రశ్నించారు. వీటన్నింటిలో గలాటా గీతూకి నోటిదూల ఎక్కువ ఎవరన్న దానికే ఆడియన్స్ నుంచి ఎస్ అనే బోర్డ్ కనిపించింది. మిగిలిన అందరికీ నో వచ్చింది.

ఆ తర్వాత నామినేషన్స్‌లో వున్న తొమ్మిది మందికి ఎన్వలప్స్ ఇచ్చారు బిగ్‌బాస్. అందులో ఎక్కువ డబ్బులు వున్నవారు సేఫ్ అవుతారని చెప్పాడు. శ్రీహాన్, గీతూ కవర్స్‌లో ఎక్కువ డబ్బులు వుండటంతో వారిద్దరూ సేఫ్ అయ్యారు. తర్వాత నామినేషన్స్‌లో వున్న మిగిలిన ఏడుగురికి పౌచ్‌లు ఇచ్చి ఆకులు వచ్చిన వారు సేఫ్ అని నాగ్ చెప్పారు. ఇనయా,రేవంత్ పౌచ్‌లలో ఆకులు రావడంతో వారిద్దరూ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

అనంతరం నామినేషన్స్‌లో వున్న వారికి పేపర్ రోల్స్ ఇచ్చి గ్రీన్ బ్లాక్ వచ్చిన వాళ్లు సేఫ్ అవుతారని ప్రకటించాడు నాగ్. బాలాదిత్య, ఆరోహికి గ్రీన్ బ్లాక్ రావడంతో వారిద్దరు సేవ్ అయ్యారు. తర్వాత మొక్క టాస్క్ ఇచ్చి చంటి సేఫ్ అయినట్లు నాగ్ చెప్పారు. చివరికి నామినేషన్స్‌లో నేహా, వాసంతి మాత్రమే మిగిలారు. ఓ తులాభారం ఏర్పాటు చేసిన నాగ్ వీరిద్దరి ఫోటోలను వుంచి, ఎవరి బరువు తక్కువగా వుంటే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. నేహాకు తక్కువ వెయిట్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు.

తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన నేహా చౌదరికి ఆమె జర్నీని చూపించాడు నాగ్. అనంతరం ఆమెకు ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో దమ్మున్న వారు ఎవరు ... దుమ్ము ఎవరు..? అని అడిగారు. ఇనయ, రేవంత్, ఆరోహి, గీతూ, వాసంతిలను దుమ్ముగా సెలక్ట్ చేసింది నేహా. చంటి, శ్రీసత్య, రాజ్, సుదీప, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డిలను దమ్మున్న కంటెస్టెంట్స్‌గా తేల్చింది. అనంతరం రేవంత్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యానని చెప్పింది. ఇక రాజ్‌తో తన ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పింది. అతనితో తొలి నుంచి మంచి బాండింగ్ వుందని... తన జీవితంలోకి ఏ అబ్బాయిని రానివ్వలేదని, కానీ రాజ్ మంచి ఫ్రెండ్ అని నేహా తెలిపింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా మా ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుందని చెప్పి అందరికీ వీడ్కోలు పలికింది నేహా.