Bigg Boss Faima: బిగ్‌బాస్‌లో వున్నందుకు ఫైమా రెమ్యూనరేషన్ ఎంతంటే.. వామ్మో అంత..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగు రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. 13 వారాలను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని, 14వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్దిరోజుల్లో విజేత ఎవరో తేలిపోనుంది. ఎప్పటిలాగే గత వారం కూడా ఎలిమినేషన్ జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫైమా హౌస్‌ను వీడింది. నిజానికి గత వారమే ఆమె ఎలిమినేషన్ అవ్వాల్సింది.. కానీ అప్పుడు ఆమెను ఫ్రీ ఎవిక్షన్ పాస్ కాపాడటంతో రాజ్ బలయ్యాడు. కానీ ఈ వారం మాత్రం తప్పించుకోలేకపోయింది. భారమైన గుండెతో కంటతడితో ఫైమా ఇంటిని వీడింది. వెళుతూ వెళ్తూ నాగ్ ఆమె చేతిని ముద్దాడి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన ఫైమా:
అయితే గత వారం నామినేషన్స్‌లో ఫైమా అస్సలు వుండాల్సింది కాదు.. రేవంత్ ఆమెను నామినేట్ చేయడం శాపంగా మారింది. ఫ్రీ ఎవిక్షన్ పాస్‌ను అటు తిరిగి ఇటు తిరిగి తానే వాడుకోవడమే ఆమె కొంపముంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీజన్‌లో తొలి 5 వారాలు గేమ్ బాగా ఆడింది.. కానీ ఎప్పుడైతే సుదీపతో, మెరీనాతో వెటకారం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే ఫైమాకు ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఇక నామినేషన్స్‌లో ఫైమాను మించిన స్ట్రాంగ్ ప్లేయర్స్ నామినేషన్స్‌లో వుండటంతో ఆమెకు ఓట్లు పడలేదు. దీంతో ఫైమా ఎలిమినేషన్ అవ్వక తప్పలేదు.
వారానికి పాతిక వేల చొప్పున రెమ్యూనరేషన్:
ఇకపోతే.. 13 వారాలు ఇంట్లో వున్నందుకు ఫైమాకు పారితోషికంగా ఎంత ముట్టిందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రెమ్యూనరేషన్ విషయాన్ని బయట పెట్టొద్దంటూ బిగ్‌బాస్ చెప్పినప్పటికీ.. కంటెస్టెంట్స్‌కు చెందిన బంధువులు, స్నేహితుల ద్వారా ఈ మ్యాటర్ క్షణాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి 13 వారాలకు గాను ఫైమాకు వారానికి రూ.25,000 చొప్పున.. రూ.3,25,000 పారితోషికంగా అందుకున్నట్లుగా సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com