BiggBoss: ఈ వారం నామినేషన్‌లో ఎనిమిది మంది.. అందరి టార్గెట్ ‘గీతూ’నే
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తొలివారమే వేడి పుట్టించింది. గలాటా గీతూ, రేవంత్, మెరీనా- రోహిత్‌ల పర్మార్మెన్స్‌కి తోడు సీపీఐ జాతీయ నేత నారాయణ వ్యాఖ్యలతో బిగ్‌బాస్‌కి ఎక్కడా లేని హైప్ వచ్చింది. వివాదాలకు దూరంగా వుండే నాగార్జున కూడా తగ్గేదేలే అన్నట్లు నారాయణను ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు. దీనికి మళ్లీ నాగన్నా .. నాగన్నా.. అంటూ నాగ్‌ను కెలికాడు పెద్దాయన. ఇలాంటి పరిణామాల మధ్య బిగ్‌బాస్ సెకండ్ వీక్‌లోకి ఎంటరైంది. సోమవారం కావడంతో ఎప్పటిలాగే నామినేషన్స్‌కి తెరలేచింది. దీంతో కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇప్పటికే అలకలు, గొడవలతో ఆడియన్స్‌కి కావాల్సినంత వినోదం పంచిన ఇంటి సభ్యులు.. ఈరోజు ఇంకా రచ్చ చేసి జనాల్ని ఎంటర్‌టైన్ చేశారు.
ఈసారి కంటెస్టెంట్లకు ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే పవర్ ఇచ్చారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను కుండపై అతికించి పక్కనే వున్న బావిలో వేసి పగులగొట్టాలి. కెప్టెన్ కావడంతో బాలాదిత్య నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. అలా ఆరోహి... ఆదిరెడ్డిని, శ్రీహాన్....గీతూని, ఫైమా....రేవంత్‌ని, ఆదిరెడ్డి... మెరీనా, రోహిత్‌ని, గీతూ.. రేవంత్‌ని, అర్జున్... రేవంత్‌ని, నేహా.. గీతూని, చలాకీ చంటి... గీతూని, రోహిత్- మెరీనాలు... ఆదిరెడ్డిని, శ్రీసత్య... షానీని, అభినయశ్రీ.... షానీని, సుదీప... గీతూని, రేవంత్ గీతూని, ఇనయా... ఆదిరెడ్డిని, షానీ.. అభినయశ్రీని, వాసంతి... ఫైమాని, రాజశేఖర్... రేవంత్‌ని నామినేట్ చేశారు. ఇక కెప్టెన్‌గా బాలాదిత్యకి ఇద్దరిని నామినేట్ చేసే పవర్ వుంది. దీంతో ఆయన రాజశేఖర్ , షానీలను నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం రాజశేఖర్,రేవంత్, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ, షానీ, రోహిత్, మెరీనా, ఫైమాలు నామినేట్ అయ్యారు.
అయితే అందరి నామినేషన్లను పక్కనబెడితే.. ఇంటి సభ్యులపై నోరేసుకుని పడిపోయే గీతూ- రేవంత్ మధ్య జరిగిన గొడవ ఈరోజు హైలైట్‌గా నిలిచింది. ఛీ ఛీ నీతో మాట్లాడటమే అసహ్యంగా వుందంటూ .. గీతూ మీద రేవంత్ ఫైరయ్యాడు. అసలు నేనేంటి ఈ పిల్లని నామినేట్ చేసేది అనుకున్నా అని రేవంత్ అంటాడు. దీనితో గీతూ ఎగస్ట్రాలు వద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది. అశుద్ధం మీద రాయేస్తే , అది మన మీదే పడుతుంది, నువ్వు అలాంటిదానివే అంటూ రేవంత్ ఓ రేంజ్‌లో వేసుకున్నాడు. అంతకుముందే కార్తీకదీపం ఫేమ్ కీర్తి భట్‌తో వాదనకు దిగాడు రేవంత్. నేను సాఫ్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా సాఫ్ట్‌గా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చింది కీర్తి. రేవంత్
ఇకపోతే.. ఈవారం నామినేషన్స్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎలిమినేట్ అయ్యేది ఎవరో అంచనా వేయడం కష్టంగానే వుంది. ముఖ్యంగా అందరి మీద పడిపోతున్న గలాటా గీతూ మీద ఇంటి జనాలకున్న కసి కనిపించింది. ఆమెను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేద్దామా అన్నట్లుగా వుంది పరిస్ధితి. తొలి వారం తప్పించుకున్నా.. ఈసారి మాత్రం ఎలిమినేషన్ పక్కా. మరి చూద్దాం ఎవరో ఎలిమినేట్ అవుతారో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout