ముగ్గురే అయినా హౌస్‌ను వణికించేశారు..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి మనుషులు.. కొంటె రాక్షసులు టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్‌లో బస్తాలను వేయనీయకుండా మంచి మనుషులు చూడాలి. కొంటె రాక్షసులు బస్తాలను సర్కిల్‌లో వేయాలి. బయట ఉన్న బ్యాగును మంచి మనుషులే తీసుకున్నారు. ఇంతలోనే దానిని లాక్కొనేందుకు రాక్షసులు కూడా సర్కిల్‌లోకి వెళ్లడంతో బజర్ మోగింది. బిగ్‌బాస్ ఇచ్చిన మూడో టాస్క్‌లో కొంటె రాక్షసులు విజయం సాధించారని బిగ్‌బాస్ చెప్పారు. పవర్ స్టార్ సాంగ్‌తో డే స్టార్ట్ అయింది. కొందరు కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడంతో బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే కాస్టూమ్స్ చేంజ్ చేసుకుని టాస్క్ స్టార్ట్ చేయాలని చెప్పారు. వెంటనే అరియానా టాస్క్ స్టార్ట్ చేసేసింది. అఖిల్ వస్తువులన్నింటినీ రాక్షసిగా ఉన్న అరియానా.. చిందర వందర చేసేసింది.
అరియానాను అందాల రాక్షసి అని అవినాష్ కామెంట్. ఆ తరువాత అవినాష్ తన కామెడీతో బాగా నవ్వించాడు. అవినాష్ పక్కన మోనాల్ వచ్చి కూర్చోవడంతో అరియానా నేను ఇక్కడ ఉండలేనని వెళ్లిపోయింది. అవినాష్ ఇటు మోనాల్‌తో పులిహోర కలుపుతూనే అటు అరియానాను పిలుస్తూ బాగా కామెడీ చేశాడు. సొహైల్‌ను మెహబూబ్ బాగా ఇరిటేట్ చేశాడు. మోనాల్ మాత్రం తెలుగును బాగా ఇంప్రూవ్ చేసుకుంది. ఇక కొంటె రాక్షసులను మనుషులుగా మార్చేందుకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. కుండలతో డ్రమ్ములను నింపాలి. ఇక రాక్షసులు కుండలను పగులగొట్టారు. ఈ క్రమంలో మెహబూబ్‌కి అఖిల్‌కి మధ్య చిన్న గొడవ జరిగింది. ఇంక గొడవ స్విమ్మింగ్ పూల్‌కి మారింది. అమ్మో గూస్ బంప్స్ వచ్చేలా ఫైటింగ్.. చివరకు డ్రమ్మును తీసుకెళ్లి మనుషులు స్విమ్మింగ్ పూల్‌లో వేశారు. మళ్లీ అఖిల్‌కి మెహబూబ్‌కి మధ్య గొడవ. డ్రమ్ములు నింపేశామని మనుషులు.. లేదని రాక్షసులు.. చివరకు బిగ్‌బాస్ మనుషులు గెలిచినట్టుగా ప్రకటించారు. దీంతో మనుషులు.. అవినాష్‌ని మనిషిగా మార్చేశారు.
ఇక రాక్షసులను మంచి మనుషులుగా మార్చేందుకు తదుపరి టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. బజర్ మోగిన సమయానికి ఒక కొంటె రాక్షసుడిని ఎత్తుకుని తదుపరి బజర్ మోగేవరకూ కిందకు దింపకూడదు. దివి మెహబూబ్‌ని ఎత్తుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. తరువాత దివి, మెహబూబ్‌ల మధ్య గదా యుద్ధం జరిగింది. తరువాత బజర్ మోగే వరకూ కూడా మంచి మనుషులు రాక్షసిని ఎత్తుకునే ఉండటంతో టాస్క్‌ను మంచి మనుషులు విన్ అయ్యారు. చివరకు మెహబూబ్ కూడా మంచి మనిషిగా మారాడు. మైక్ వేసుకోకుండా వస్తే బిగ్‌బాస్ వార్న్ చేయడంతో ఇతర కంటెస్టెంట్లంతా చాలా కామెడీ చేశారు. ఈ టాస్క్‌ను విజయవంతం పూర్తి చేసినందున అందరినీ బిగ్‌బాస్ అభినందించారు. ఈ టాస్క్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన ఇద్దరిని.. వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన ఇద్దరిని నిర్ణయించి చెప్పాలనడంతో కంటెస్టెంట్లంతా బిగ్‌బాస్ చేతిలోనే నిర్ణయాన్ని పెట్టారు.
అయితే బిగ్‌బాస్.. బెస్ట్, వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్లెవరో చెప్పాలని కెప్టెన్ నోయెల్‌కు అప్పగించారు. చెప్పకుంటే అందరినీ నామినేట్ చేస్తానని చెప్పడంతో నోయెల్.. బెస్ట్ పెర్ఫార్మర్స్‌గా అవినాష్, సొహైల్ పేర్లు చెప్పాడు. వరస్ట్ పెర్ఫార్మెన్స్ పేర్లు చెప్పకపోవడంతో అవినాష్, అరియానా మినహా మిగిలిన సభ్యులందరూ కలిసి ఇంటిని యథావిధిగా క్లీన్ చేయాలని చెప్పారు. వెంటనే అరియానా క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. సొహైల్, అఖిల్ దగ్గరకు వెళ్లి కెప్టెన్సీ టాస్క్‌లో తనను సపోర్ట్ చేయాలని అడిగింది. తరువాత అమ్మ రాజశేఖర్ నీకు సపోర్ట్ చేస్తానని అరియానాకు చెప్పారు. అవినాష్ కూడా దీనిని స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు. నా ఫ్రెండ్‌కి ఎవరూ సపోర్ట్ చేసినా హ్యాపీగా ఫీలవుతానని అవినాష్ చెప్పాడు. నెక్ట్స్ ఒప్పో ఎఫ్ 17 ఫోన్ వివరాలను అభి చదివి వినిపించాడు. తరువాత అంతా కలిసి సెల్ఫీ తీసుకున్నారు. లగ్జరీ బడ్జెట్ ఐటెమ్స్‌ను బిగ్‌బాస్ పంపించారు. మొత్తానికి ఇవాళ షో మొత్తం మీద కొంటె రాక్షసులు అదరగొట్టేశారు. ముగ్గురున్నప్పటికీ హౌస్‌ను వణికించేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments