నామినేషన్ పర్వం.. మంటలు తెప్పించారు..

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

ఇవాళంతా నామినేషన్ పర్వం నడిచింది. అమ్మో చూస్తుంటే రాజకీయాల్లో కూడా ఈ రేంజ్ హీట్ కనిపించదేమో అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్స్ క్లియర్‌గా కనిపించాయి. కోల్డ్ వార్ కాస్తా బ్లాస్ట్ అయింది. ఇప్పటి వరకూ హారిక యాటిట్యూడ్‌ని అయితే అంతలా చూడలేకపోయాం. కానీ ఇవాళ అది కూడా చూశాం. మొత్తానికి మంట తెప్పించారు. పిలగాడు ఇరగ ఇరగ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఇక క్షణం కూడా లేటు లేకుండా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్. కుమార్ సాయి కెప్టెన్ అయినందున అతడిని నామినేట్ చేయడానికి వీల్లేదు. ఇక అఖిల్ నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశాడు. అభిని నామినేట్ చేశాడు. గత వారానికి ముందు కుమార్ సాయి చెప్పిన పాయింట్‌ని బేస్ చేసుకుని నామినేట్ చేశాడు. నేను పర్మిషన్ తీసుకుని మాత్రమే అరేయ్ అన్నానని అఖిల్.. కానీ నువ్వు దూరం నుంచి అరేయ్ అని పిలిచావు కాబట్టి నాకు నచ్చలేదని అభి చెప్పాడు. ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు. అయితే పర్మిషన్ తీసుకున్న తరువాత దూరం నుంచి పిలిస్తే ఏంటి? దగ్గర నుంచి పిలిస్తే ఏంటి? ఏంటో అభి లెక్కేంటో అర్థం కాలేదు. నెక్ట్స్ అమ్మ రాజశేఖర్‌ని అఖిల్ నామినేట్ చేశాడు. అరియానా అఖిల్, అమ్మ రాజశేఖర్‌ని నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో అమ్మ రాజశేఖర్, అరియానాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.

లాస్య.. దివి, నోయెల్‌ని నామినేట్ చేసింది. అవినాష్.. అఖిల్‌, మోనాల్‌ని నామినేట్ చేశాడు. సుజాత కూడా అఖిల్‌, అరియానాను సుజాత నామినేట్ చేసింది. కుమార్ సాయి.. నోయెల్‌, సుజాతను నామినేట్ చేశాడు. సొహైల్.. అభి, నోయెల్‌ను నామినేట్ చేశాడు. మెహబూబ్.. సుజాత, లాస్యలను నామినేట్ చేశాడు. గంగవ్వ.. నోయెల్, అభిలను నామినేట్ చేసింది. అమ్మ రాజశేఖర్.. అఖిల్‌, అరియానాలను నామినేట్ చేశారు. ఇక మీదట సేఫ్ గేమ్ ఆడబోనని అమ్మ రాజశేఖర్ ఈ సందర్భంగా శపథం చేశారు. హారిక అఖిల్‌ను నామినేట్ చేసింది. ఈ సందర్భంగా హారిక మళ్లీ ఇంగ్లీషుకి పదును పెట్టింది. ఈ క్రమంలోనే హారిక, అఖిల్‌కి మధ్య చిన్నపాటి వాగ్యుద్ధం జరిగింది. ఆల్రెడీ ఒక సందర్భంలో హారిక, అభి.. అఖిల్‌ని నామినేట్ చేయాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత మోనాల్‌ని నామినేట్ చేసింది. దివి వచ్చి లాస్యను నామినేట్ చేసింది. మీరు చేసిన పప్పు తినడం వల్లే హౌస్‌లో అందరికీ మోషన్స్ అవుతున్నాయని కారణం చెప్పింది. దీంతో లాస్య ఫైర్ అయింది. ఆ తరువాత సొహైల్‌ని నామినేట్ చేసింది.

మోనాల్ వచ్చి హారికను నామినేట్ చేసింది. ఇవ్వాళ హారిక చాలా యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. నెక్ట్స్ మోనాల్.. అవినాష్‌ను నామినేట్ చేసింది. ఆ తరువాత అభి... సొహైల్‌ను నామినేట్ చేశాడు. తరువాత అఖిల్‌ని నామినేట్ చేశాడు. పచ్చి అబద్ధం ఆడతావని నాకు ఇప్పుడే తెలిసిందంటూ అభి స్టార్ట్ చేశాడు. అభి బాగా యాటిట్యూడ్ చూపించాడు. కళ్లు ఇలా చేసి చూస్తే ఎవరూ భయపడడు అని అభి అనడంతో విషయం మరింత రేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో అఖిల్.. మోనాల్ విషయం తీయడం ఇక గొడవ తీవ్ర స్థాయికి వెళ్లిపోయింది. ఇప్పటి వరకూ జరిగిన కోల్డ్ వార్.. ఇవాళ బ్లాస్ట్ అయింది. ఇక సొహైల్, అభిల మధ్య గొడవ.. మళ్లీ దివి వైపుకు తిరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ అఖిల్ కల్పించుకోవడం మోనాల్ పేరు తీయడంతో మోనాల్ కల్పించుకుని వారించే ప్రయత్నం చేసింది. మీ ఇద్దరూ మాట్లాడుకోండి నా పేరు తీయవద్దని చెప్పింది. ఈ గొడవలో మోనాల్ బాగా హర్ట్ అయ్యింది. ఎవరి మధ్యైనా గొడవ అయితే మీరు మీరు చూసుకోండి నా పేరు తీసుకు రాకండి అంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. నోయెల్.. అమ్మ రాజశేఖర్‌ని స్వాతిని నామినేట్ చేసినందుకు చేశాడు. అమ్మ రాజశేఖర్‌కు చెప్పిన కారణంపై సొహైల్ మాట్లాడాడు. దీంతో సొహైల్‌ని కూడా నోయెల్ నామినేట్ చేశాడు. ఫైనల్‌గా.. అఖిల్, నోయెల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నామినేట్ అయ్యారు.