క్లారిటీ లేని టాస్క్‌లతో బోర్ కొట్టించిన బిగ్‌బాస్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో షో స్టార్ట్ అవడంతో... ఇంకేముంది ఇవాళ బిగ్‌బాస్ ఫుల్లు ఎంటర్‌టైనింగ్‌గా ఉండొచ్చు అనిపించింది. చూస్తున్నా కొద్దీ విసుగు తప్ప ఆసక్తికరమనేదే లేదు. ఇచ్చిన టాస్క్‌లో క్లారిటీ లేదు.. కంటెస్టెంట్లలో హుషారు లేదు. మొనాల్ యథావిధిగా కొళాయి విప్పేసి బోర్ కొట్టించింది. అసలు ఎందుకు ఏడుస్తుందనే విషయం కూడా అర్థం కాకపోవడం విశేషం. గంగవ్వ పంచ్‌లు.. సూర్య కిరణ్ పాట.. కాస్త హుషారు తెప్పించాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. సూర్యకిరణ్‌లో ఓ మంచి డైరెక్టర్‌తో పాటు సింగర్ కూడా ఉన్నాడనిపించింది ఆయన పాట వింటే.. మొత్తమ్మీద బిగ్‌బాస్ ఈ బోరింగ్ టాస్క్‌లకు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందేమో అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా తావు లేకుండా కంటెస్టెంట్‌లు ఎవరి పాత్ర వారు బాగా పోషించినట్టు అనిపించింది.
బిగ్‌బాస్ సీజన్ 4లో మంగళవారం మంచి జోష్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఐ వాన్నా.. ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు’ సాంగ్‌తో ప్రారంభమైంది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా.. ఇంటి నియమాలను కరాటే కల్యాణి టీచర్‌గా మారి వివరించారు. ఈ టాస్క్‌లో గంగవ్వ తన పంచ్‌లతో నవ్వులు పువ్వులు పూయించింది. రెండు రోజున బిగ్‌బాస్ మీ 14 మందిలో ఒక కట్టప్ప ఉన్నారని.. మీ పనులకు ఆ కట్టప్ప అవరోధం కల్పిస్తారని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై లాస్య, కరాటే కల్యాణి మధ్య కాస్త చర్చ నడిచింది. ఇంతలోనే సూర్యకిరణ్ ‘ప్రేమికుడు’ చిత్రంలోని సాంగ్ పాడి హుషారు తెప్పించారు. అనంతరం సీక్రెట్ హౌస్‌లో ఉన్న అరియానా కాల్ చేసింది. నిన్న ఫుడ్ ఎవరికి పంపించారనే దాని గురించి చర్చ స్టార్ట్ చేసింది. దీని గురించి అరియానాకు, అఖిల్‌కు మధ్య కాసేపు చర్చ నడిచింది. ఇంతలోనే నోయెల్ వచ్చి ఫోన్ తీసి కాన్వర్సేషన్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
కట్టప్ప ఎవర సీక్రెట్ బ్యాలెట్ బాక్సు ద్వారా తెలుసుకునే అవకాశం ఇచ్చారు బిగ్‌బాస్. దానిలో కట్టప్ప ఎవరని భావిస్తున్నారో వారి పేరు రాసి బ్యాలెట్ బాక్సులో వేయాలి. కంటెస్టెంట్‌లంతా తాము ఎవరు కట్టప్ప అని భావిస్తున్నారో వారి పేర్లను రాసి బ్యాలెట్ బాక్సులో వేశారు. కరాటే కల్యాణి, అభిజిత్‌ల మధ్య చిన్న అభిప్రాయ బేధం వచ్చినా.. అభి వచ్చి ప్రాబ్లమ్‌ని సార్టవుట్ చేయడం బాగా అనిపించింది. మొనాల్ మాత్రం ఇవాళ కూడా ఎమోషనల్ అయి విసుగు తెప్పించింది. అనంతరం బిగ్‌బాస్ మొదటి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. కట్టప్పను ఒక కంట కనిపెడుతూ టాస్క్‌ను కొనసాగించాలని బిగ్‌బాస్ సూచించారు. అనంతరం లాస్యను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి ఓ లేఖ ఇచ్చి ఆ లేఖను ఇంటి సభ్యులకు చదివి వినిపించాలని కోరారు. మొదటి బడ్జెట్ టాస్క్ పేరు ‘చిత్రం ఎవరిది?’.. ఈ టాస్క్ కూడా ఇన్ టైమ్‌లో కంటెస్టెంట్‌లంతా పూర్తి చేశారు.
ఇక బిగ్‌బాస్.. సీక్రెట్ రూమ్‌లో ఉన్న అరియానా, సొహైల్‌లను హౌస్‌లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. పొరుగింటి వారెవరూ మిమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి వెళ్లి తేల్చుకోవాలని ఇద్దరికీ ఆదేశాలిచ్చారు. బిగ్‌బాస్ పెట్టిన ముహూర్తానికి అర్ధరాత్రి 12 గంటలకు హౌస్‌లోకి అరియానా, సొహైల్ ఎంట్రీ ఇచ్చేశారు. మొత్తానికి ఎలాంటి రచ్చ లేకుండా.. గ్లిజరిన్ అవసరం పెద్దగా రాకుండా కంటెస్టెంట్లంతా చూసుకోవడం గుడ్డిలో మెల్లలా అనిపించింది. బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తంగా రేపు పెద్ద రచ్చే జరగనుందని ప్రోమోను బట్టి తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments