పోర్న్ సైట్‌లో బిగ్‌బాస్ బ్యూటీ ఫొటోలు
Send us your feedback to audioarticles@vaarta.com
టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో దీన్ని పనికొచ్చే పనులకు కాకుండా.. ఏ మాత్రం ప్రయోజనం లేని పనులకు వాడే వారే ఎక్కువయ్యారు. ఎవరో ఒకర్ని టార్గెట్ చేయడం.. వారిని వేధించి సొమ్ము చేసుకోవడం.. వార్తల్లో నిలవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఈ విషయంలో సెలబ్రిటీలు మరీ దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలను వేధించిన.. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసిన వార్తలు చాలనే చూసుంటాం. అయితే తాజాగా.. బిగ్‌బాస్ బ్యూటీ, వివాదాస్పద నటి మీరా మిథున్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
ఎవరీ మిథున్!
పూర్తి వివరాల్లోకెళితే.. మీరా మిథున్ ఈ పేరును తమిళ సినీ ప్రియులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. బిగ్‌బాస్ ప్రియులకు అయితే అస్సలే పరిచయం అక్కర్లేదు. అంతేకాదు.. తెలుగువారికి చాలా మందికి తెలుసు. ఎందుకంటే.. సూపర్ మోడల్.. ‘మిస్ సౌత్ ఇండియా’, ‘మిస్ తమిళనాడు’, ‘మిస్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా’ కిరీటాలు గెలుచుకున్న ఈ హాట్ మోడల్.. ప్రస్తుతం ‘మిస్ తమిళనాడు’ అనే సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ‘8 తుటాక్కల్’, ‘తానా సేందకూటం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది కూడా. మరీ ముఖ్యంగా వివాదాస్పందగానే ఎక్కువగానే ఈ బ్యూటీ వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ షాకింగ్ అనుభవం చవి చూడాల్సి వచ్చింది.
అసలేం జరిగింది..!?
ఈ వివాదస్పద నటి, హాట్ బ్యూటీకి సంబంధించిన కొన్ని మార్ఫింగ్ ఫొటోలు ఫోర్న్ సైట్‌లో దర్శనమిచ్చాయి. అంతేకాదు.. ఆమె ఫోన్ నంబర్ కూడా వివరాలను ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. బ్యూటీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని.. దీని వెనుక ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మిథున్ చెప్పుకొచ్చింది. అయితే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎప్పుడు ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందో..? ఆ ఫొటోలు అప్‌లోడ్ చేసిందెవరో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com