బిగ్‌బాస్‌లో అభి వర్సెస్ మొనాల్ వర్సెస్ అఖిల్.. ఇంట్రెస్టింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్‌లో ఇవాళ ప్రేక్షకులకు కావల్సినంత స్టఫ్ దొరికేసింది. ఇవాళ నర్మదా అదేనండీ.. మన మొనాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది. ఇవాళ మొనాల్, అఖిల్‌లు చపాతీలు చేస్తుండగా షో స్టార్ట్ అవుతుంది. మొనాల్‌ని పిలిచి తనతో ఎందుకు మాట్లాడటం లేదని అభిజిత్ అడగటం.. తనకు సమయం లేనందు వల్లే మాట్లాడలేదని మొనాల్ చెప్పడం.. ఈ ఆన్సర్‌కి పెద్దగా అభి సంతృప్తి చెందినట్టు అనిపించలేదు. ఉదయం 4 గంటలకు కుమార్ హౌస్‌లోకి ఎంటరై పోయి.. ఒక సోఫాలో బ్లాంకెట్ కప్పుకుని పడుకున్నాడు. ఉదయం 6:45 నిమిషాలకు దేవి లేచి కాఫీ మగ్ పట్టుకుని వస్తుంది. దేవిని పిలిచి.. హౌస్‌మేట్స్ అందరినీ తీసుకు రమ్మని చెప్పాడు. మాట విని వచ్చిన దివి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని కనిపెట్టేసింది. ఏదో చేద్దామనుకున్న కుమార్‌కు అప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలాంటి ఛాన్సూ ఇవ్వలేదు.
కాటుకెట్టిన కళ్లను చూస్తే సాంగ్‌కి గంగవ్వతో సహా అంతా స్టెప్పులేశారు. మొనాల్, అభిల మధ్య జరిగిన సీన్.. అఖిల్, మొనాల్‌ల మధ్య రిపీట్. అయితే అక్కడ నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు అని అభి అడిగితే.. మొనాల్ వచ్చి అఖిల్‌ని నువ్వెందుకు మాట్లాడట్లేదని అడిగింది. ఈ క్రమంలో నర్మదా నది మొనాల్ కళ్లల్లో ఉప్పొంగింది. తనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తోందని ఇగ్నోర్ చేస్తున్నానని మొనాల్ గురించి అఖిల్.. లాస్యకు చెప్పాడు. తరువాత మొనాల్‌ను పిలిచి అఖిల్ మాట్లాడటంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నాకు నీతో స్పెండ్ చేయడం ఇష్టమని అఖిల్‌కు మొనాల్ చెప్పేసింది. మొత్తానికి అభి వర్సెస్ మొనాల్ వర్సెస్ అఖిల్.. స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంది.
అఖిల్, అభిల మధ్య కాన్వర్సేషన్. ఎవ్వరినీ మాట్లాడమని ఫోర్స్ చేయవద్దని అఖిల్ చెప్పడం.. నేను అలాగే చేస్తున్నానని అఖిల్ తెలిపాడు. వీరిద్దరి మధ్య మొనాల్ గురించి డిస్కషన్ నడిచింది. ఆ తరువాత నామినేషన్ టాస్క్. అంతా పడవలోకి ఎక్కాలి. దాని నుంచి దిగిపోయిన 9 మంది నామినేషన్‌లో ఉంటారని బిగ్‌బాస్ తెలిపారు. గంగవ్వను దింపాలని అఖిల్ సూచించాడు. దానికి నోయెల్ వంత పాడటం.. చాలా చెత్తగా అనిపించింది. మొదట గంగవ్వ.. ఆ తరువాత నోయెల్.. అనంతరం మొనాల్.. వీరు బోటు నుంచి దిగిపోయాక.. కుమార్‌ని దింపడంపై రచ్చ జరిగింది. ఆ తరువాత సొహైల్ బోటు నుంచి దిగిపోయాడు. అనంతరం వరుసగా.. కరాటే కల్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, అభిజిత్ బోటు నుంచి దిగిపోవడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. ఈ తొమ్మది మందిని బిగ్‌బాస్ నామినేట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments