Bigg Boss Telugu 7 : రతిక ప్లాన్, బకరా అయిన టేస్టీ తేజా.. యాటిట్యూడ్ చూపిస్తోన్న శివాజీ

  • IndiaGlitz, [Wednesday,September 06 2023]

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా మంగళవారం బిగ్‌బాస్ అసలు గేమ్ షురూ అయ్యింది. సోమవారం శివాజీ, ప్రియాంక జైన్‌లు మాత్రమే నానినేషన్స్ పూర్తి చేయగా.. ఈరోజు మిగిలిన వారు ఆ పనిచేశారు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగింది. శోభాశెట్టి.. గౌతమ్, కిరణ్ రాథోడ్‌లను నామినేట్ చేసింది. దామిని.. రతిక, శోభాశెట్టిని. ప్రిన్స్.. షకీలా, గౌతమ్‌ని. ఆట సందీప్.. రతిక, ప్రిన్స్‌ని. షకీలా.. ప్రిన్స్, పల్లవి ప్రశాంత్‌ని. శుభశ్రీ.. రతిక, శోభాశెట్టిని. పల్లవి ప్రశాంత్.. షకీలా, కిరణ్ రాథోడ్‌ని. అమర్‌దీప్.. ప్రిన్స్, తేజని. కిరణ్ రాథోడ్.. ప్రశాంత్, శోభాశెట్టిని. టేస్టీ తేజ.. ప్రశాంత్, కిరణ్‌ని. రతిక.. ప్రియాంక, దామినిని నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్‌లో నిలిచారు.

హౌస్‌లో చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది రతిక. తన సీక్రెట్ టాస్క్ స్కెచ్‌తో కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టే పనిలో నిమగ్నమైంది. తొలుత శోభాశెట్టి దగ్గరకు వెళ్లి ఓ సీక్రెట్ టాస్క్ వుంది చేస్తావా అని అడిగింది రతిక. దీనికి శోభ కూడా ఓకే చెప్పింది. ముందు టాస్క్ ఏంటో చెప్పు అని అడిగింది. బ్రేక్ అయిన హార్ట్‌ను చూపించి.. అమర్‌దీప్, ప్రియాంక మధ్య గొడవ పెట్టాలని చెప్పింది. వాళ్లు గొడవపడితే నువ్వు టాస్క్ గెలుస్తావ్, నామినేషన్ నుంచి సేవ్ అవుతావ్, వాళ్లు గొడవపడకపోతే నువ్వు నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్తావ్ అని శోభను భయపెడుతుంది. ఇదంతా సావధానంగా విన్న డాక్టర్ మోనితకు ఎక్కడో తేడా కొట్టింది. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ ఎవ్వరికీ చెప్పకూడదు కదా అని అనుమానిస్తూ వెళ్లిపోయింది శోభా.

డాక్టర్ మోనిత వద్ద వర్కవుట్ కాకపోవడంతో అమర్‌దీప్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్‌లతో మాట్లాడి చూసింది రతిక. కానీ అక్కడ ఆమె ఎత్తులు విఫలమయ్యాయి. చివరికి రతికి చేతికి టేస్టీ తేజ చిక్కాడు. ఇద్దరి మధ్య గొడవ పెడితే.. సీక్రెట్ టాస్క్ గెలిచినట్లేనని, నెక్ట్స్ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతావని నమ్మించింది. నేను ఎవరి మధ్య గొడవ పెట్టాలని తేజ అడగగా.. గెస్ చేయమంటుంది. గౌతమ్ కృష్ణ, యావర్ అని చెప్పగా.. అవును కరక్టే అని చెప్పి వారిద్దరి మధ్య గొడవ పెట్టమని చెబుతుంది. రతిక చెప్పినట్లుగానే యావర్, గౌతమ్ కృష్ణల మధ్య గొడవ పెట్టేందుకు తేజ ప్రయత్నించాడు. కానీ పుల్లలు పెట్టినందుకు తేజను అమర్‌దీప్ నామినేట్ చేశాడు.

ప్రతి సీజన్‌లో నవ్వులు పూయించడానికి ఓ కంటెస్టెంట్ వుంటాడు. దీనికి తగ్గట్టుగానే ఈ సీజన్‌లో టేస్టీ తేజ కమెడియన్ అవతారం ఎత్తాడు. ముఖ్యంగా హీరో శివాజీతో సంభాషణ నవ్వులు పూయించింది. శివాజీని పెద్దాయనా అని పిలవడంతో ఎవడ్రా పెద్దాయన అంటూ గద్దించాడు. దీనికి తేజ నవ్వుతూనే సరే చిన్నాయనా అని పిలవనా అని ప్రశ్నించాడు. అందరి ముందు జోకర్‌గా నిలిచినా .. టేస్టీ తేజ జనాల దృష్టిలో బాగా పడుతున్నాడు.

More News

Bigg Boss 7 Telugu : ఆ క్యారెక్టర్లు ఎలా వేశారు.. షకీలాను కెలికిన టేస్టీ తేజ, ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 7 సీజన్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్‌లో ఇంట్లో అడుగుపెట్టారు.

Heavy Rainfall:హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన.. విద్యాసంస్థలకు సెలవు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Chandrababu Naidu:‘‘కోడ్’’తో కోట్లు కొల్లగొట్టి.. స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లను మించిన బాబు గారి ఎత్తులు

హాలీవుడ్‌తో టూ బాలీవుడ్‌లలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో ‘‘కోడ్’’ భాష చుట్టూ తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి.

Rashmika Mandanna:అసిస్టెంట్ పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ నేషనల్ క్రష్ ఇమేజ్ తో తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న.

Sasivadane:'శశివదనే' నుంచి లిరికల్ సాంగ్ 'డీజే పిల్లా' రిలీజ్

"నా దిల్లే నీ వల్లే టూరింగు టాకీసులా మారెనే