అటు సీక్రెట్ టాస్క్.. ఇటు బీబీ గ్రాండ్ హోటల్

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

నామినేషన్స్ అనంతరం జరిగిన సీన్స్‌తో షో స్టార్ట్ అయింది. ఏడుపులు.. ఓదార్పులు నామినేషన్ తరువాత కూడా కొనసాగాయి. లాస్య ఏడుస్తుంటే గంగవ్వ ఓదార్చింది. నిన్న దివి నామినేషన్స్‌లో భాగంగా నువ్వు చేసిన పప్పు తినడం వల్లే హౌస్‌లో అందరికీ మోషన్స్ అని చెప్పిన దానికి లాస్య ఓ రేంజ్‌లో హర్ట్ అయింది. తరువాత మోనాల్ ఏడుస్తుంటే లాస్య ఓదార్చింది. ఇంతలో అభి వచ్చి మోనాల్‌ను ఓదార్చే బాధ్యతను తీసుకున్నాడు. నేను నీ గురించి మాట్లాడలేదు అని చెప్పి ఓదార్చేందుకు యత్నించాడు. నామినేషన్స్ నా గురించి కాదు.. మీకేమైనా ఇష్యూ ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పింది. ఇక అమ్మ రాజశేఖర్‌ను నోయెల్ నామినేట్ చేసిన దానికి బాగా ఫీలయ్యారు. సొహైల్ వచ్చి ఓదార్చాడు. మోనాల్, అఖిల్‌ల మధ్య చర్చ. అభి నువ్వు ఐ లైక్ యూ అని చెప్పిన విషయాన్ని మరో అమ్మాయికి చెప్పడం తనకు నచ్చలేదని అందుకే నీ మాట తీశానని వివరించి కూల్ చేశాడు. ఆ తరువాత అమ్మ రాజశేఖర్, నోయెల్‌ల మధ్య చర్చ. తను నామినేషన్‌లో చేసిందానికి వివరణ ఇచ్చాడు. కానీ అమ్మ రాజశేఖర్.. నోయెల్ చెప్పిందాన్ని అస్సలు వినిపించుకోలేదు. నేనేమీ చిన్న పిల్లవాడిని కాదని.. సినిమా డైలాగ్స్ వద్దని.. ఫ్రాంక్‌గా ఉండమని నోయెల్‌కి క్లియర్‌గా అమ్మ రాజశేఖర్ చెప్పారు. అమ్మ రాజశేఖర్‌ను బయటకు పంపించాలని ప్లాన్ చేశావన్నారు.

నోటంకి నోటంకి సాంగ్‌తో నెక్ట్స్ డే స్టార్ట్ అయింది. నా గురించి మాట్లాడటానికి నీకు అన్ని రైట్స్ ఉన్నాయని మోనాల్ తనకు చెప్పిందని.. అందుకే మాట్లాడానని.. ఇకపై తన కోసం మాట్లాడనని అవినాష్‌కి అఖిల్ చెప్పాడు. మోనాల్ మాట్లాడుతుంటే నాకు ఓపిక లేదు.. తర్వాత మాట్లాడతానని అఖిల్ చెప్పాడు. దీంతో మోనాల్ వెళ్లి పడుకుంది. తరువాత మోనాల్ దగ్గరకు వెళ్లి అభి కూర్చొని ఇక మనిద్దరం వేరొకరి గురించి మాట్లాడుకోవద్దని చేతిపై వేలితో రాసి మోనాల్‌తో సైన్ చేయించాడు. తరువాత బిగ్‌బాస్ అవినాష్‌ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్‌లో కెప్టెన్సీ పోటీ టాస్క్. ‘బీబీ గ్రాండ్ హోటల్ టాస్క్’. బిగ్‌బాస్ అవినాష్‌కి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్‌లో అవినాష్ హోటల్ స్టాఫ్‌లో ఒకరైనప్పటికీ.. అతిథుల వైపు నుంచి ఆడాలి. అతిథులకు చేసే మర్యాదలను చెడగొట్టి హోటల్ స్టాఫ్ విజయవంతం కాకుండా చూడాలి. హోటల్ టీం చేసే సర్వీసుల్లో పదింటిని పాడు చేయాలి. ఇది సీక్రెట్ టాస్క్. దీని గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పదింటినీ పూర్తి చేస్తే కెప్టెన్సీకి అవినాష్ నేరుగా పోటీదారుడవుతాడు.

టాస్క్ ప్రారంభమైంది. ప్రిన్సెస్ వచ్చిందని హారికను పట్టించుకోకుండా మేనేజర్‌గా ఉన్న అవినాష్ వెళ్లి పోవడంతో బయట కూర్చొని నేను లోపలికి రానని కూర్చొంది. అవినాష్ వచ్చి నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఇక అవినాష్ నా చెయ్యి పట్టుకున్నాడని అరియానా గొడవ. బాగుందని పట్టుకున్నానని అవినాష్.. బాగుంటే పట్టుకోకూడదని నోయెల్ ఫన్నీ ఫన్నీగా కాన్వర్సేషన్ కొనసాగింది. స్పూన్‌తో బకెట్ నింపాలని అరియానా.. అవినాష్‌కి చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. ఒకవైపు లోపల గొడవ జరుగుతుంటే.. బయట అమ్మ రాజశేఖర్, మోనాల్ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చెయ్యడం నవ్వు తెప్పించింది. అరియానాను అవినాష్ చిల్లరగా బిహేవ్ చేయొద్దని చెప్పడంతో గొడవకు దిగింది. టిప్పు గురించి అమ్మ రాజశేఖర్ కొట్లాడటం చాలా ఫన్నీగా అనిపించింది. నిన్న ఎంత రచ్చ జరిగిందో.. ఇవాళ అంత కూల్ కూల్‌గా సాగిపోయింది. సీక్రెట్ టాస్క్‌లో చేయాల్సిన పనులనైతే ఇప్పటి వరకూ అవినాష్ చేసినట్టు కనిపించలేదు. ఇక రేపటి ప్రోమో చూస్తుంటే గరంగరంగా ఉండేలా కనిపిస్తోంది.

More News

అదే సీన్ రిపీట్ చేస్తున్న నాగ్‌...!

కింగ్ నాగార్జున‌.. ఒక‌వైపు సినిమాలు, మ‌రో వైపు బిగ్‌బాస్ షోతో బిజీ బిజీగా ఉంటున్నాడు. స్టార్ హీరోస్‌లో ముందుగా షూటింగ్‌ను స్టార్ట్ చేసింది కూడా నాగార్జునే.

‘వకీల్‌సాబ్’ అప్పుడేనా?

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

బాల‌య్య కూడా రెడీ అన్నాడా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

జనసేనానిని కలిసిన సుదీప్.. ఆసక్తికర విషయం ఏంటంటే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.

వైద్యుల మాట వినకుండానే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చికిత్స పొందుతున్న వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.