ఆదిలోనే ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచిన బిగ్‌బాస్ 4..
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతోందన్న చిన్న న్యూస్ ప్రేక్షకుల దృష్టిని షో వైపునకు మళ్లించింది. అప్పటి నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్స్పై తీవ్ర స్థాయిలో చర్చలు నడిచాయి. హోస్ట్‌పై.. కంటెస్టెంట్లపై రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఈ సారి ఒక కపుల్ కాదు.. రెండు కపుల్స్ పాల్గొనబోతున్నాయని టాక్ నడిచింది. కంటెస్టెంట్ల విషయమై నడిచిన ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు.. సింగర్ సునీత.. యాంకర్ ఝాన్సీ, యాంకర్ రవి, సింగర్ మంగ్లీ, రఘు మాస్టర్, ప్రణవిల జంట.. ఆహా.. ఓహో అంటూ రకరకాల కథనాలు.. ప్రేక్షకులను ఊహల పల్లకిలో ఊరేగించాయి.
సీన్ కట్ చేస్తే.. ఒక్కొక్క కంటెస్టెంట్‌ను పిలుస్తుంటే ప్రేక్షకుల ఫీజులు ఎగిరిపోవడం స్టార్ట్ అయింది. బిగ్‌బాస్ సీజన్ 1, 2లతో పోలిస్తే సీజన్ 3 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి కారణం.. ఫేమస్ సెలబ్రిటీలు ఎవరూ లేకపోవడమేనని టాక్ నడిచింది. ప్రేక్షకులకు అంతంత మాత్రం తెలిసిన వారిని తీసుకున్నారని అందుకే రేటింగ్ దారుణంగా పడిపోయిందని టాక్ నడిచింది. సీజన్ 4లో ఈ తప్పిదాన్ని రిపీట్ కానివ్వబోరని ఫేమస్ సెలబ్రిటీలతోనే షో నడవనుందని టాక్ నడిచింది. కానీ ఈసారి షోలో ఒకరిద్దరు మినహా మిగిలినవన్నీ ప్రేక్షకులకు పెద్దగా తెలియని మొహాలే. దీంతో ఆదిలోనే ప్రేక్షకులను ఈ షో తీవ్ర నిరాశపరిచింది. ఈ షోపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.
బిగ్‌బాస్ సీజన్ 4 హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అంగరంగ వైభవంగా షో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. షో మొత్తాన్ని నాగ్ నడిపించిన తీరు అద్భుతం. 16 మంది కంటెస్టెంట్లు.. వివిధ పెర్ఫార్మెన్స్లు.. ఏవీలతో ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 4లో కంటెస్టెంట్లుగా.. ‘సుడిగాడు’ ఫేమ్.. గుజరాతి భామ మొనాల్ గజ్జర్, డైరెక్టర్ సూర్యకిరణ్, యాంకర్ లాస్య, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో అభిజిత్, యాంకర్ సుజాత, జర్నలిస్ట్ దేవి నాగవల్లి, దేత్తడి హారిక, నటుడు సయ్యద్ సోహైల్, అరియానా గ్లోరీ, కరాటే కల్యాణి, సింగర్ నోయెల్, దివి, గంగవ్వలతో షో ప్రారంభమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com