బిగ్‌బాస్4: సస్పెన్స్‌లో పెట్టాల్సింది ఎవరిని? ఏంటీ కట్టప్ప గోల?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ క్యాజువల్‌గానే ఇవాళ కూడా బోర్ కొట్టించింది. నిజానికి.. గత మూడు రోజులతో పోలిస్తే ఇవాళ మరింత బోర్ కొట్టించింది. దివి కంటెస్టెంట్లు అందరి గురించి తను వ్యూని వివరించడంతో షో స్టార్ట్ అయింది. అందరినీ బాగానే అర్థం చేసుకున్నట్టు అనిపించింది. ఇవాళ షో మొత్తం ఇబ్బందికరంగా నడిచింది. అన్ సీన్‌లో పెట్టాల్సిన పనికి మాలిన చెత్తంతా తీసుకొచ్చి చూపించినట్టు అనిపించింది. కట్టప్ప గోల ఇవ్వాళ కూడా స్టార్ట్.. అరియానా, సోహైల్‌లను సీక్రెట్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ వారికి ఓ టాస్క్ అప్పగించారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో పాయింట్లు చాలా వరకూ కోల్పోవడంలో కట్టప్పే కారణమని.. కాబట్టి ఒక్కొక్కరినీ పిలిచి వారి దృష్టిలో కట్టప్ప ఎవరో తెలుసుకోవాలని సూచించారు. కట్టప్ప విషయంలో గంగవ్వ మాత్రం అదరగొట్టేసింది. తాను అఖిల్‌ను కట్టప్ప అని భావిస్తున్నానని చెప్పడమే కాదు.. దానికి కారణాన్ని చక్కగా వివరించింది. అందరికీ కన్విన్సింగ్ రిప్లై ఇచ్చింది.
ఒకవైపు సొహైల్, అరియానాలు కట్టప్ప ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు కొందరు కంటెస్టెంట్లు వారికి ఆన్సర్ చేయొద్దని చర్చ మొదలు పెట్టారు. కొందరు కట్టప్ప ఎవరో చెప్పేందుకు నిరాకరించారు. నాలుగు రోజులుగా కట్టప్ప పేరు చెప్పి బిగ్‌బాస్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడేమో అనిపించింది. కట్టప్ప అంటూ కొండంత రాగం తీస్తున్న బిగ్‌బాస్.. చివరకు ఏం చేస్తారనేది.. అదైనా ఆసక్తికరంగా ఉంటుందా.. లేదంటే అట్టర్ ఫ్లాపేనా తెలియాల్సి ఉంది. కరాటే కల్యాణిపై అంతలోనే నవ్వుతావు.. అంతలోనే ఏడుస్తావు అంటూ గంగవ్వ వేసిన పంచ్ బాగుంది. స్టార్టింగ్ రోజున నోయెల్ బిగ్‌బాస్‌పై పాడి వినిపించిన ర్యాప్‌ను నేడు మళ్లీ పాడి కాస్త హుషారు తెప్పించే ప్రయత్నం చేశాడు. లగ్జరీ బడ్జెట్ కోసం మరో టాస్క్‌ని బిగ్‌బాస్ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకూ ఇచ్చిన టాస్కుల్లా ఇది కూడా అట్టర్ ఫ్లాప్. మజా వచ్చే అంశమేదీ కనిపించలేదు.
మొత్తమ్మీద ఇవాళ షోనంతా కట్టప్ప చుట్టే నడిపించాడు బిగ్‌బాస్. మూడు రోజులుగా డైలీ సీరియల్ కంటే దారుణంగా ఒకే అంశంతో నడిపిస్తున్నాడు. ఇంత లాగ్ అవసరమా? కంటెంట్ లేకపోతే ఇలా నడిపిస్తారా? అసలు ఈ షో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికా లేదంటే సస్పెన్స్‌లో ముంచేయడానికా? అనేది అర్థం కావడం లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. పోనీ కట్టప్ప అంటూ కొండంత రాగం తీస్తున్న బిగ్‌బాస్.. చివరికి ఏ అర్థం పర్థం లేని పాటో పాడేయడు కదా అని అనిపిస్తోంది. అలా చేశాడో.. ఇప్పటికే వస్తున్న ట్రోల్స్, మీమ్స్ కంటే మరికొన్ని రెట్ల ట్రోల్స్, మీమ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కట్టప్ప విషయమేంటే ప్రేక్షకుడికి చెప్పాలి కదా.. అదేమీ లేదు. అసలు ఈ బిగ్‌బాస్.. నిజానికి ఎవరిని సస్పెన్స్‌లో పెట్టాలి? ప్రేక్షకులనా లేదంటే కంటెస్టెంట్‌లనా? కంటెస్టెంట్లతో గేమ్ ఆడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాల్సింది పోయి.. ప్రేక్షకుడితోనే గేమ్ ఆడితే ఎలా? నిజానికి ఇప్పటి వరకైతే కట్టప్ప అనే వారెవరూ కనిపించలేదు. చివరికి అలాంటిదేమీ లేదని బిగ్‌బాస్ చెబితే అది ఎవరిని వెర్రిపప్పలను చేస్తున్నట్టు? ప్రేక్షకుడినా? సమాధానం దొరకని ప్రశ్నలెన్నో.. ఇక చివరిగా ఒకమాట.. రేపు కూడా షో మొత్తం కట్టప్ప చుట్టే తిరగబోతోందని ప్రోమోని బట్టి తెలుస్తోంది. బిగ్‌బాస్ ఇలాగే ప్రేక్షకుడిని ఇబ్బంది పెడితే రేపు షో నిర్వాహకులు తమ షో రేటింగ్‌ను చూసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందేమో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments