కట్టప్పా.. నోయెల్‌ది ఏం గేమప్పా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ రోజు బిగ్‌బాస్‌లో పల్ప్ ఫ్యాక్టరీ టాస్క్ నేడు కూడా కంటిన్యూ అయింది. ఈ టాస్క్‌లో నోయెల్ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. తొలి ఫిజికల్ టాస్క్‌ను నోయెల్ ఫన్నీ ఫన్నీగా నడిపించేశాడు. లాస్య కూడా స్మార్ట్ గేమ్ ఆడి నోయెల్‌ను బురిడీ కొట్టించేసింది. గంగవ్వ కూడా ఫుల్ యాక్టివ్‌గా కనిపించింది. టాస్క్ సందర్భంగా అంతా సందడి వాతావరణమే కనిపించింది. అయితే మెహబూబ్ మాత్రం ఎందుకో హైలైట్ అయ్యేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. ఈ వీక్‌లో మెహబూబ్ పెర్ఫార్మెన్స్‌ని అయితే చూసే ఛాన్స్ ప్రేక్షకులకు కలగలేదు. అమ్మ రాజశేఖర్.. అఖిల్‌ని కామెంట్ చేసి అందరినీ తెగ నవ్వించేశారు.
ఈ పల్ప్ ఫ్యాక్టరీ టాస్క్‌ను ఏ ఒక్కరూ సరిగా పూర్తి చేయలేదని బిగ్‌బాస్ 2000 పాయింట్లు మాత్రమే ఇచ్చారు. ఆ తరువాత అఖిల్.. అమ్మ రాజశేఖర్ తనపై వేసిన జోక్స్ విషయమై చాలా హర్ట్ అయినట్టు కనిపించింది. తన బాధనంతా మొనాల్‌కు చెప్పుకున్నాడు.. అఖిల్ బాధ నిజమేననిపించింది. షోలో మనకైతే చూపించలేదు కానీ అఖిల్ చెప్పిందాన్ని బట్టి అమ్మ రాజశేఖర్ చాలా సార్లు టీజ్ చేసినట్టు అర్థమవుతోంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. మార్నింగ్ అంతా కలిసి డ్యాన్స్ ఇరగదీసేశారు. ఆ వయసులోనూ గంగవ్వ యాక్టవ్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేసి రాక్ చేసేసింది. ఇంతకీ గంగవ్వ తన ఏజ్‌ను రివీల్ చేసిందండోయ్.. గంగవ్వ వయసు 62 ఏళ్లట.
నాకు నలుగురు మనవలు, ముగ్గురు మనవరాళ్లని తన ఫ్యామిలీ విషయాలన్నీ గంగవ్వ అరియానాకు పంచ్‌లతో చెప్పేసింది. ఏది ఏమైనా గంగవ్వ గంగవ్వే.. మళ్లీ మొనాల్ హిందీని అందుకుంది.. ఇక బిగ్‌బాస్ చూడాలంటే హిందీ టు తెలుగు డిక్షనరీయో.. లేదంటే 30 రోజుల్లో హిందీ ఎలా? అనే బుక్ కొనుక్కోవడమో చెయ్యాల్సి వస్తుందేమో. మొనాల్, అమ్మ రాజశేఖర్‌ల మధ్య చిన్న క్లాష్. హిందీ, అరవ సినిమాలు కలగలిపి చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇక ఏమైందో ఏమోకానీ సడెన్‌గా కరాటే కల్యాణి ఇవాళ నేను ఫాస్టింగ్ అని వెళ్లిపోయింది. తనను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారని కరాటే కల్యాణి ఫీల్ అయినట్టు తర్వాత తెలిసింది. తనకు వంట చేసే అబ్బాయిలే ఇష్టమంటూ దివి అమ్మ రాజేశేఖర్‌కు చెప్పింది. ఆ తరువాత కాస్త ఫన్ జెనరేట్ చేసేందుకు అమ్మ రాజశేఖర్ ట్రై చేశారు. వర్కవుట్ అయ్యిందో లేదో ప్రేక్షకులే డిసైడ్ చేసుకోవాలి.
ఎమోషనల్‌లో అమ్మ రాజశేఖర్ ఆయిల్‌లో టీపొడి వేసేశారు. ఆ తర్వాత నోయెల్ ర్యాప్‌తో కంటెస్టెంట్‌ల గురించి చెప్తూ హుషారు తెప్పించాడు. ఇప్పుడే అనుకున్నాం కదా.. మెహబూబ్ ఇప్పటి వరకూ హైలైట్ అవలేదని.. ఈ రోజు చిల్ చేసేశారు. అందరిపై పంచ్‌లేసిన నోయెల్‌నే చిల్ చేసేశాడు. ఆ తరువాత మొనాల్, అభిజిత్‌ల మధ్య ఓ చిన్న ఫన్నీ గేమ.. పెద్దగా ఆకట్టుకోలేదనుకోండి. అఖిల్, మొనాల్‌ల మధ్య చిన్నన డిస్కషన్. ఫన్ ఏంటంటే.. వాళ్లేం మాట్లాడుకుంటున్నారని మొనాల్‌ని అఖిల్ అడగటం. హిందీ భామ తెలుగు అర్థం చేసుకుని చెబుతుందనేనా? ఏమో అఖిల్‌కే తెలియాలి. మళ్లీ కట్టప్ప అదేనండి మన బిగ్‌బాస్ నిద్ర లేచాడు. పాడిందే పాటరా.. పాచిపళ్ల దాసరా అని.. కట్టప్ప ఎవరో చెప్పాలని బిగ్‌బాస్ అడిగాడు.
ముందుగా అఖిల్ వచ్చి తన పెయింటింగ్‌ని లాస్య స్పాయిల్ చేసింది కాబట్టి తనే కట్టప్ప అని చెప్పి ముద్ర వేశాడు. అఖిల్ బిగ్‌బాస్ చెప్పిన లాజిక్‌ని బాగానే పట్టేశాడు. మెహబూబ్ కూడా లాస్యకే స్టాంప్ గుద్దాడు. సొహైల్ మాత్రం అఖిల్‌కు మద్ర వేశాడు. లాస్య.. సూర్యకిరణ్‌కి ముద్ర వేసింది. దేత్తడి హారిక కూడా సూర్యకిరణ్‌కి ముద్ర వేసింది. మొనాల్ మాత్రం అమ్మ రాజశేఖర్‌కి ముద్ర వేసింది. నిన్నటి వరకూ అఖిల్ పేరు చెప్పిన గంగవ్వ ఇవాళ ఫ్లేటు ఫిరాయించి.. అమ్మ రాజశేఖర్‌కి ముద్ర వేసింది. అరియానా మాత్రం నోయల్‌కి ముద్ర వేసింది. తొడగొట్టు నాన్నా అంటూ నోయెల్ అరిచాడు. మరి అలా ఫ్రస్టేషన్‌ని తీర్చుకున్నాడో ఏమో తెలియలేదు. ఆ తర్వాత వచ్చిన దేవిక కూడా నోయల్‌కే ముద్ర వేసింది. దివి కూడా నోయెల్‌కే ముద్ర వేసింది. అమ్మ రాజశేఖర్ కూడా నోయెల్‌కే ముద్ర వేశాడు.
నెక్ట్స్ నోయెల్ వచ్చి మనందరం ఒకటేనని కాబట్టి ఇండివిడ్యువల్ డెసిషన్ తీసుకోలేనని.. కాబట్టి కట్టప్ప అని ఎవరినీ నొప్పించలేనని తనకు తానే కట్టప్ప అని ముద్ర వేసుకుంటానని నోయెల్ చెప్పాడు. కట్టప్ప.. నోయెల్‌ది ఏం గేమప్పా.. మొదటి నుంచి డిఫరెంట్ వేలోనే వెళుతున్నాడు. మొత్తానికి షోలో బాగా హైలైట్ అయ్యేందుకు యత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. కట్టప్ప అంత నమ్మకస్తుడు లేడంటూనే మీపై ముద్ర వేస్తే మీ ఇంట్లో వాళ్లు బాధపడతారు అనడం ఎంత వరకూ కరెక్ట్? తనపై ముద్ర పడితే తన తండ్రిని తొడగొట్టమని.. వేరే వాళ్లపై ముద్ర పడితే వాళ్ల పేరెంట్స్ బాధ పడతారనడం.. లాంటివి చూస్తుంటే నోయెల్ సమయానుకూలంగా మాట్లాడుతున్నాడని క్లియర్‌గా అర్థమవుతోంది.
నోయెల్‌కు కంటెస్టెంట్లంతా మూకుమ్మడిగా అభ్యంతరం చెప్పారు. నా డెసిషన్ నేను తీసుకుంటా అని చెబుతూ అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అయితే అఖిల్ మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఫీలవరు అని చెప్పాడు. సింపతి గేమ్ ప్లే చేస్తున్నావని కంటెస్టెంట్లు నోయెల్‌ను ఆరోపించారు. అమ్మ రాజేశేఖర్‌కు ముద్ర పడితే ఆయన ఫీల్ అయ్యారని.. అలా తాను ఎవ్వరినీ బాధ పెట్టలేనని చెప్పి తనకు తానే ముద్ర వేసుకున్నాడు. ఇంతలో బిగ్‌బాస్ కలుగజేసుకుని అలా ఎవరికి వారు ముద్ర వేసుకోవడానికి లేదని చెప్పడంతో అమ్మ రాజశేఖర్ ముద్ర పడితే బాధ పడ్డారని చెప్పిన నోయెలే తిరిగి అమ్మ రాజశేఖర్‌కి ముద్ర వేయడం ఆశ్చర్యం అనిపించింది. ఆ తరువాత సూర్యకిరణ్ కూడా నోయల్‌కే ముద్ర వేశారు. ఆ తర్వాత కరాటే కల్యాణి వచ్చి సూర్యకిరణ్‌కు ముద్ర వేసింది. సుజాత మాత్రం లాస్యకు ముద్ర వేసింది. అభిజిత్ కూడా లాస్యకే ముద్ర వేశాడు. అప్పుడు లాస్య ఫేస్ చూడాలి.. కాస్త ఫీలయినట్టు అనిపించింది. ఈ సందర్భంగా నోయెల్.. సొహైల్‌ల మధ్య చిన్న వాగ్యుద్ధం.. అయితే అది సెకన్లలోనే ముగిసిపోయింది.
ఇక బిగ్‌బాస్ చావు కబురు చల్లగా చెప్పేశారు. కట్టప్ప ఎవరో మీకు చెప్పమని చెప్పడంతో ఇంకెన్ని రోజులండి బాబు అంటూ లాస్య తన అసహనాన్ని నేరుగానే వెలిబుచ్చింది. కంటెస్టెంట్లకే అలా అనిపిస్తే ప్రేక్షకులకు ఎలా అనిపించాలి? ఆ తరువాత అమ్మ రాజశేఖర్.. లాస్యను కామెంట్ చేస్తూ నవ్వించారు. అయితే అమ్మ రాజశేఖర్ తెలుగును అర్థం చేసుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments