మెహబూబ్ రాక్.. సుజాత ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇవ్వాళ షోలో మార్నింగ్ మస్తీ.. ఫ్యాషన్ షో జరిగింది... అవినాష్ అద్దంలా మారడం మినహా పెద్దగా చెప్పుకోదగిన అంశాలేమీ లేవు. మంచి జోష్ ఉన్న సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. మార్నింగ్ మస్తీలో భాగంగా మెహబూబ్ రాక్ చేశాడు. లాస్యతో కలిసి చపాతీ స్టెప్ వేయించిన మెహబూబ్.. అవినాష్ కాలికి దెబ్బ తగలడంతో కాలు మీద ప్రెజర్ పడకుండా చాలా జాగ్రత్తగా డ్యాన్స్ చేయించాడు. గంగవ్వను కూడా ఆమె వయసుకు తగ్గట్టు ఆమెతో డ్యాన్స్ చేయించాడు. ఇలా ప్రతి ఒక్కరితో ఒక్కో కాన్సెప్ట్ తీసుకుని డ్యాన్స్ చేయించి మెహబూబ్ ఇరగదీశాడు. ఇక అవినాష్.. రేలంగి మామయ్య కేరెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేశాడు. తరువాత ప్రోమోలో చూపించిన సీన్.. అఖిల్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. ప్రోమోలో ఏదో అయిపోతున్నట్టుగా చూపించారు. కానీ అక్కడ జరిగిందేమీ లేదు. జస్ట్ లగ్జరీ బడ్జెట్‌ను ఎంపిక చేసుకోవడమే. అఖిల్ రేషన్ మేనేజర్ అయినందున లగ్జరీ బడ్జెట్‌ను ఎంపిక చేసుకోవాలని అఖిల్‌కు బిగ్‌బాస్ చెప్పారు. ఉన్న వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఎంచుకుని లగ్జరీ బడ్జెట్ ఐటెమ్స్‌ను అఖిల్ తీసుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్న కుమార్ సాయి నిద్ర పోవడం ఫన్నీగా అనిపించింది. అది ధ్యానమంటూ కుమార్ సాయి కవర్ చేస్తే.. కుక్క గ్రహించలేదంటూ అవినాష్ కామెడీ చేశాడు.
ఇక చందనా బ్రదర్స్ వారి ఫ్యాషన్ షో ప్రారంభమైంది. ముందుగా అబ్బాయిల ఫ్యాషన్ షో స్టార్ట్ అయింది. ఆ తరువాత అమ్మాయిలది ఒకరి తరువాత ఒకరు ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. గర్ల్స్ సైడ్ నుంచి గంగవ్వకు ఇచ్చారు. మరీ టూ మచ్ అనిపించింది. జెన్యూనిటీ లోపించినట్టుగా అనిపించింది. మగవాళ్ల నుంచి అవినాష్‌కు ఇచ్చారు. ఫ్యాషన్ షోలో భాగంగా అవినాష్, గంగవ్వలు విజేతలవడంతో ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున గిఫ్ట్ మనీ లభించింది. విజేతగా గెలుపొందిన అవినాష్ అద్దంగా మారాలని బిగ్‌బాస్ సూచించారు. ఆడవాళ్లంతా అద్దంలో చూసుకుంటుంటే అద్దం ఎలా ఫీలవుతుందో అవినాష్ ఫన్నీగా చెప్పాలి. అందరికీ అవినాష్ పంచ్‌లిస్తుంటే.. అవినాష్‌కి దివి పంచ్ ఇచ్చింది. గంగవ్వ వెళ్లి అవినాష్ కేరెక్టర్‌ని తీసేసుకుంది. మొత్తమ్మీద అద్దం టాస్క్ చాలా ఫన్నీగా సాగిపోయింది.
అమ్మ రాజశేఖర్.. అరియానా ఎలా నడిచిందో చూపించారు. హారిక ఎలా నడిచిందో చూపించబోయి కాలు నొప్పి ఉండటంతో అవినాష్ వెళ్లి కూర్చున్నాడు. అమ్మ రాజశేఖర్ చూపించారు. సుజాత ర్యాంప్ వాక్‌ను అవినాష్.. లాస్యది అమ్మ రాజశేఖర్ చేసి చూపించారు. మధ్యలో సుజాత ఫైర్ అయ్యింది. ఆ తరువాత సుజాతకు లాస్యకు మధ్య వివాదం నడిచింది. సుజాత నోయెల్ పేరు చెప్పగా.. ఆ పేరును తీసుకోలేదని బాధను కోపం రూపంలో సుజాత వ్యక్తం చేసింది. ఇక్కడో విషయం చెప్పాలి. ఈ మధ్య ఎందుకో గానీ నోయెల్ బాగా డల్ అయ్యాడు. అసలు కెమెరా ముందు ఫోకస్ అయిన దాఖలాలైతే ఈ మధ్య కాలంలో పెద్దగా లేవు. సుజాత ఫైర్ అయిన విషయాన్ని అవినాష్, సొహైల్, లాస్యలకు మోనాల్ చెప్పడంతో అవినాష్ బాగా ఫీలయ్యాడు. అందరూ హర్ట్ అయ్యే టాస్క్ ఇవ్వొద్దని బిగ్‌బాస్‌ను అవినాష్ కోరాడు. అయితే అరియానా వారించింది. వాళ్లెవరో హర్ట్ అయ్యారని.. అలాంటి టాస్క్‌లు ఇవ్వొద్దని నువ్వెలా చెబుతావని ప్రశ్నించింది. మొత్తానికి పెద్దగా ఆకట్టుకునే అంశాలేవీ లేకుండానే షో ముగిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments