‘బిగ్‌బాస్-4’కి షాక్.. కంటెస్టెంట్‌కి కరోనా!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ షో ప్రారంభం అవుతుందంటేనే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.. బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతోందన్న వార్తే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ని పెంచేసింది. ఈ షో నిర్వాహకులు ఒక్కో అప్డేట్ను విడుదల చేస్తుంటే ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునే.. సీజన్ 4కి కూడా హోస్ట్‌గా వ్యవహరించడం.. ఆయన అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో పెంచిన క్రేజ్‌ను మరింత పెంచేయడం చకచకా జరిగిపోతున్నాయి.
ఇక షో విషయానికి వస్తే నాగ్ పుట్టినరోజైన ఆగస్ట్ 29నో లేదంటే 30నో ప్రారంభం కానుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో నిర్వాహకులకు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లకు ఇప్పటికే షో నిర్వాహకులు కరోనా పరీక్ష చేయించి.. ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉంచినట్టు సమాచారం. 14 రోజుల అనంతరం మరోసారి పరీక్ష నిర్వహించి వారిని నెగిటివ్ వస్తే అందరినీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు.
మొదటిసారి కంటెస్టెంట్లందరికీ పరీక్ష నిర్వహించినప్పుడు నెగిటివ్ రావడంతో ఇక ఇబ్బంది లేదని నిర్వాహకులు భావించినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా కంటెస్టెంట్లలోని ఒక సింగర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ప్రస్తుతం షో నిర్వాహకులు సదరు కరోనా పాజిటివ్ వచ్చిన సింగర్‌కి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి షో ప్రారంభం నాటికి ఆ సింగర్‌కి కరోనా నెగిటివ్ అని వస్తుందా? లేదా? అనే అంశం నిర్వాహకులను కలవరపెడుతోందని సమాచారం. ఆ సింగర్‌కి నెగిటివ్ వస్తే ఏం లేదు.. ఒకవేళ పాజిటివ్ వస్తే నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments