‘బిగ్‌బాస్-4’కి షాక్.. కంటెస్టెంట్‌కి కరోనా!

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

బిగ్‌బాస్ షో ప్రారంభం అవుతుందంటేనే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.. బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతోందన్న వార్తే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ని పెంచేసింది. ఈ షో నిర్వాహకులు ఒక్కో అప్‌డేట్‌ను విడుదల చేస్తుంటే ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునే.. సీజన్ 4కి కూడా హోస్ట్‌గా వ్యవహరించడం.. ఆయన అప్‌డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో పెంచిన క్రేజ్‌ను మరింత పెంచేయడం చకచకా జరిగిపోతున్నాయి.

ఇక షో విషయానికి వస్తే నాగ్ పుట్టినరోజైన ఆగస్ట్ 29నో లేదంటే 30నో ప్రారంభం కానుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో నిర్వాహకులకు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లకు ఇప్పటికే షో నిర్వాహకులు కరోనా పరీక్ష చేయించి.. ఓ స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచినట్టు సమాచారం. 14 రోజుల అనంతరం మరోసారి పరీక్ష నిర్వహించి వారిని నెగిటివ్ వస్తే అందరినీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు.

మొదటిసారి కంటెస్టెంట్‌లందరికీ పరీక్ష నిర్వహించినప్పుడు నెగిటివ్ రావడంతో ఇక ఇబ్బంది లేదని నిర్వాహకులు భావించినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా కంటెస్టెంట్‌లలోని ఒక సింగర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ప్రస్తుతం షో నిర్వాహకులు సదరు కరోనా పాజిటివ్ వచ్చిన సింగర్‌కి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి షో ప్రారంభం నాటికి ఆ సింగర్‌కి కరోనా నెగిటివ్ అని వస్తుందా? లేదా? అనే అంశం నిర్వాహకులను కలవరపెడుతోందని సమాచారం. ఆ సింగర్‌కి నెగిటివ్ వస్తే ఏం లేదు.. ఒకవేళ పాజిటివ్ వస్తే నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాలి.

More News

'క‌‌ల‌ర్ ఫొటో' నుంచి ఆగ‌స్ట్ 27న రానున్న మొద‌టి పాట

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా

ప‌వ‌న్ స‌ర‌స‌న బ‌న్నీ హీరోయిన్‌...?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే సినిమా ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’.

మ‌ళ్లీ క్రేజీ కాంబో !!

కొన్ని కాంబినేష‌న్స్ పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి బాగా ఉంటుంది. అలా ఆస‌క్తి రేపిన కాంబినేష‌న్స్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ ఒక‌టి.

మళ్లీ టాక్స్‌లో వ‌రుణ్ తేజ్ మూవీ!!

యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌,  'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలోనూ

ఆలియా త‌ప్పుకోలేదు... అయితే!!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో