బిగ్‌బాస్‌4... కండీష‌న్స్ అప్లై

  • IndiaGlitz, [Wednesday,July 22 2020]

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. ఎప్ప‌టి నుండో నాలుగో సీజ‌న్ స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా..రీసెంట్‌గా బిగ్‌బాస్ సీజ‌న్ 4కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. నిజానికి క‌రోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే జూన్‌లోనే బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆల‌స్యంగా ప్రారంభం అవుతుంద‌ట‌. ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఆగ‌స్టులో బిగ్‌బాస్ ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌.

బిగ్‌బాస్‌ సీజ‌న్ 3కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అక్కినేని నాగార్జున, సీజ‌న్ 4లోనూ వ్యాఖ్యాత‌గా వ‌హ‌రించున్నార‌ని టాక్‌. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న ప‌రిస్థితుల్లో బిగ్‌బాస్ కొన్ని కండీష‌న్స్‌తో నిర్వ‌హిస్తున్నారని టాక్‌. సీజ‌న్‌ను ఎక్కువ రోజులు పొడిగించ‌కుండా 50-60 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అలాగే నాగార్జున కూడా ఓ స్పెష‌ల్ రూమ్‌లో నుండే హోస్ట్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నిర్వాహ‌కులు త‌క్కువ రోజుల్లోనే సీజ‌న్ 4ను ప్లాన్ చేసినా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే కంటెస్టెంట్స్‌పై ఓ క్లారిటీ రానుంది.

More News

వ‌చ్చే ఏడాది కూడా ‘ఆర్ఆర్ఆర్‌’ లేన‌ట్లేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

నితిన్ నిశ్చితార్థ వేడుక

యువ క‌థానాయ‌కుడు నితిన్ ఈ నెల 26న త‌న నిచ్చెలి షాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు. బుధ‌వారం నితిన్ నిశ్చితార్థ వేడుక హైద‌రాబాద్‌లోని నితిన్ ఇంట్లో జ‌రిగింది.

ఛాలెజింగ్ వ‌ర్క్స్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డతాను - సంగీత ద‌ర్శ‌కుడు ఛైత‌న్య భ‌ర‌ధ్వాజ్

ఆరె ఎక్స్ 100 సినిమా ఎంత హిట్ అయిందో దానికి మించిన విజ‌యాన్ని సాధించాయి ఆ చిత్రంలో పాట‌లు..!

కరోనాతో ప్రముఖ ఫార్మాకి కంపెనీకి చెందిన తండ్రీకొడుకుల మృతి

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ ఫార్మా పరిశ్రమ ఓనర్‌తో పాటు ఆయన కుమారుడు కరోనా కారణంగా మరణించారు.

బ్రేకింగ్: అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

ఏపీలో వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు.