బోరింగ్ టాస్క్.. విసుగు తెప్పించిన షో..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్. ‘పల్లెకు పోదాం చలో చలో’. ఈ టాస్క్ ప్రకారం కంటెస్టెంట్లంతా గ్రామస్తులుగా మారిపోయారు. టాస్క్ అనౌన్స్ చేయడమే ఆలస్యం సొహైల్ రంగంలోకి దిగిపోయాడు. సొహైల్‌కి అవినాష్ కూడా యాడ్ అయ్యాడు. ఇక సొహైల్, మెహబూబ్‌లు ఇద్దరూ నిద్ర పోతుంటే బిగ్‌బాస్ సొహైల్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. మీ నిద్ర పూర్తైందా? అని సొహైల్‌ను బిగ్‌బాస్ అడగడం ఫన్నీగా అనిపించింది. ఇక సొహైల్ కేరెక్టర్ గ్రామ పెద్ద. ఊళ్లోని మంట మండుతూ ఉండేలా చూడాలి. ఇక లాస్య, అరియానా తల్లీకూతుళ్లు. లాస్య గ్రామపెద్ద భార్య. సామాజిక కార్యకర్త కూడా. ఇక రాజశేఖర్ గ్రామపెద్దకు ఊరిలో జరిగే విషయాలన్నీ చెప్పడమే కాకుండా గ్రామపెద్ద భార్యను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తూ ఉంటారు. ఇక అఖిల్ బాధ్యత కలిగిన యువకుడు. గ్రామపెద్దను ప్రశ్నిస్తూ ఉండాలి. అభి, మోనాల్‌లు వంట సిద్ధం చేసే సభ్యులు. వంట సిద్ధం చేసి బియ్యాన్ని , పాన్‌ను తీసుకోవాలి. ఇక హారికకు బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. హారిక మూడు హత్యలు చేయాల్సి ఉంటుంది. రాజశేఖర్‌పై కాఫీ చల్లడం, అవినాష్ కోపంతో అరిచేలా చేయడం, మూడో వ్యక్తిని ఎవరిని హత్య చేయాలనుకుంటే వారి పేరును విండోపై లిప్‌స్టిక్‌తో రాయాలి.
మెహబూబ్ రౌడీ, అవినాష్ పాన్ షాప్ యజమాని. అరియానాను ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరి పాత్రను వారు బాగానే పోషించారు. టాస్క్ మధ్యలో సడెన్‌గా అఖిల్ వెళ్లిపోయి దూరంగా కూర్చొన్నాడు. వెంటనే సొహైల్ వెళ్లి విషయమేంటో తెలుసుకోవడానికి ట్రై చేశాడు. కానీ అఖిల్ మాత్రం స్పందించలేదు. ఎన్ని విధాలుగా అడిగినా అఖిల్ స్పందించలేదు. తరువాత అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఈ టాస్క్ గత సీజన్లో చూసిందే కానీ అప్పుడున్న ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు కనిపించలేదు. చాలా బోరింగ్‌గా అనిపించింది. సీక్రెట్ టాస్క్‌లో బాగంగా హారిక.. అమ్మ రాజశేఖర్‌పై కాఫీ పోసింది. అందరికీ హెల్ప్ చెయ్యాలని హారికకు అమ్మ, అభి సూచించారు. ఇక బిగ్‌బాస్ ఒక హత్య జరిగిందని.. ఇద్దరు గ్రామస్తులు మంట ఆరకుండా చూసుకుంటూ ఉండాలని.. మరో హత్య జరగకుండా చూసుకోవాలని బిగ్‌బాస్ సూచించారు. అభి, అఖిల్‌ల మధ్య మళ్లీ చిన్న గొడవ. తన ఫుడ్ తనకు కావాలని అఖిల్ కానీ అభి ఇల్లు లాక్ చేశాడు. దీంతో అఖిల్.. ఇల్లు లాక్ చేయకుండా చూడాలని బిగ్‌బాస్‌ను కోరాడు.
ఇక మెహబూబ్ వెళ్లి నీటితో మంటను అర్పేందుకు యత్నిస్తుండగా.. మెహబూబ్ అడ్డుకున్నాడు. తరువాత మెహబూబ్ కట్టెలను లాక్కుపోతుంటే సొహైల్ అడ్డుకున్నాడు. అఖిల్ వెళ్లి కట్టెలను లాక్కొచ్చాడు. ఈ నేపథ్యంలో సొహైల్, మెహబూబ్‌ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఇక రేపటి ప్రోమోను బట్టి అమ్మ రాజశేఖర్ మరోసారి యాటిట్యూడ్ చూపించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ షో అయితే చాలా చాలా బోరింగ్‌గా.. విసుగు తెప్పించేలా షో సాగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com