బిగ్‌బాస్-3: రాహుల్ కోసం రంగంలోకి దిగిన తల్లి!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ సీజన్లో టైటిల్ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. ప్రస్తుతం టైటిల్ రేసులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్‌లు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మెయిన్ ఫైట్ మాత్రం రాహుల్, శ్రీముఖి మధ్యలోనే ఉంది. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో అనేదానిపై ఇరువురి అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓట్లు గుద్దుడు కార్యక్రమం జోరుగా సాగుతోంది. మరోవైపు ఇరువురి కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగారు. ఇప్పటికే హౌస్‌లోకి వెళ్లొచ్చి ‘బాగా ఆడు రాహుల్.. టైటిల్ మనదే’ అని అభయమిచ్చి వచ్చారు. అయితే తాజాగా.. రాహుల్ తల్లి ఓ ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన బిడ్డకు ఓట్లు వేయాలని ప్రేక్షకులకు నమస్కరించి కోరారు.
రాహుల్‌ను గెలిపించండి!
‘రాహుల్ మంచితనం.. నిజాయితీ, ముక్కుసూటి మాటలను మెచ్చి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. మిగిలిన రెండురోజుల్లోనూ మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించండి’ అని ఆమె కోరారు. కాగా.. తన తల్లి హౌస్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత రాహుల్ చాలా సీరియస్‌గా తీసుకుని షోలో ఆడుతున్నాడు. మరోవైపు ఇతనిపై నెగిటివ్స్ సైతం ఎక్కువయ్యాయ్.. ఎప్పుడెప్పుడో పాత వీడియోలను పట్టుకుని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. ఈ తరుణంలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో..? నెటిజన్లు, బిగ్‌బాస్ ప్రియులు రాహుల్‌ను గెలిపిస్తారో..? శ్రీముఖిని గెలిపిస్తారో..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజలు వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout