రోజాకు ఛాలెంజ్‌ విసిరిన బిగ్‌బాస్‌ 2 ఫేమ్‌

  • IndiaGlitz, [Tuesday,November 26 2019]

రోజా ముఖం మీద తన మనసులో మాటలను చెప్పేస్తుంటారు. కొందరు ఈమెను ఫైర్‌ బ్రాండ్‌ అని అంటే.. కొందరు ఈమెను కాంట్రీవర్సీ పర్సన్‌గా చూస్తున్నారు. రోజాతో మనకెందుకులే? అని అనుకునేవారు కూడా ఉన్నారు. అలాంటి బిగ్‌బాస్‌ 2 ఫేమ్‌ భానుశ్రీ ఏకంగా రోజాకు ఛాలెంజ్‌ విసిరింది. ఇంతకు భాను శ్రీ విసిరిన ఛాలెంజ్‌ ఏంటో తెలుసా? రోజాను గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటమని. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ, రాజకీయ, క్రీడా, బుల్లితెర నటీనటులు పాలు పంచుకుంటున్నారు. మొక్కలు నాటి ఇతరులకు ఛాలెంజ్‌ విసురుతున్నారు.

అందులో భాగంగా సింగర్‌ రోల్‌ రైడర్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కంటెస్టెంట్‌ భానుశ్రీ మూడు మొక్కలను నాటారు. తర్వాత ఆమె కొందరికీ గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉండటం గమనార్హం. రోజాతో పాటు ఆర్టిస్ట్‌ ప్రియా, చమ్మక్‌ చంద్ర, గెటప్‌ శీను, అవినాష్‌లకు కూడా ఛాలెంజ్‌ విసిరారు. మరి భాను శ్రీ విసిరిన ఛాలెంజ్‌కు ఎమ్మెల్యే రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

‘రూలర్‌' ప్రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మాతగా రూపొందుత్నో చిత్రం ‘రూలర్‌'.

మహా’ ట్విస్ట్.. సీఎం ఫడ్నవిస్, అజిత్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ రాజీనామా చేయగా..

కన్నడ చిత్రంలో కాజల్‌

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ మంచి బ్రేక్‌ కోసం వేచి చూస్తుంది. తెలుగులో ఆమె నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అ!’

మహేష్ బాబు భారీ కట్ అవుట్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

అశ్వత్థామా.. ఛీ మనిషివేనా నువ్వు!?: ఆర్టీసీ కార్మికులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రివర్స్ అయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కార్మికులు ఫైర్ అవుతున్నారు.