అన్స్టాపబుల్ చిత్రం ప్రారంభం !!!
- IndiaGlitz, [Tuesday,May 31 2022]
అన్స్టాపబుల్ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్) A2B ఇండియా ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రంజిత్ రావ్.బి నిర్మాతగా షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా అద్భుతమైన హాస్య ప్రధాన చిత్రాన్ని నిర్మించనున్నారు.
రచయితగా తనదైన కామెడీ శైలిలో సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించి బుర్రకథ లాంటి డిఫరెంట్ చిత్రంతో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు 100% ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీతో ఈ అన్స్టాపబుల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
బిగ్ బాస్ బాద్షా, మచ్ఛా అని ప్రేక్షకులు అందరూ ప్రేమగా పిలిచే విజే.సన్నీ ఈ చిత్రానికి కథానాయకుడిగా, ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్విచే సప్తగిరి జిలానీ రామ్ దాస్ గా మరిన్ని అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ పాత్రల్లో పోసాని కృష్ణమురళి, పృద్వి, మణిచెందన, షకలక శంకర్, విరాన్ ముత్తమ్ శెట్టి, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి, ఇతర ముఖ్య పాత్రలలో వకీల్ సాబ్ ఫేమ్ లిరీష, డీజే టిల్లు ఫేమ్ మురళి గౌడ్, ఐమాక్స్ వెంకట్, సురేష్ కొండేటి, విక్రమ్ ఆదిత్య, రోని మరియు గబ్బర్ సింగ్ బ్యాచ్ నటించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది, ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్, నటుడు బిత్తిరి సత్తి తదితరులు పాల్గొన్నారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ హీరో వి.జె సన్నీ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో
చిత్ర హీరో సన్నీ మాట్లాడుతూ.. దర్శకుడు డైమండ్ రత్నబాబుకు సినిమా అంటే పిచ్చి.తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను.బిగ్ బాస్ వటారువత నటుడుగా నేను ప్రూవ్ చేసుకోవా లని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను 100% కష్టపడి పని చేస్తాను.రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది.ఈ సినిమాకు త్రిమూర్తులు వంటి నిర్మాతల తో పాటు మంచి టీం దొరికారు. సీనియర్ నటులతో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే దిల్ రాజు, హరీష్ శంకర్ ల బ్లెస్సింగ్ తో మరో సినిమా చేస్తున్నాను అని అన్నారు.
చిత్ర దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ...అన్స్టాపబుల్ అనే టైటిల్ బాలయ్య బాబుది.ఇప్పుడు తన టైటిల్ తో వస్తున్న మాకు బాలయ్య బాబు ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను.. నిర్మాతలు బాగుండాలి అని కోరుకునే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రారంభించడం జరిగింది.ఆయన బర్త్ డే సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఈ సినిమా ప్రారంభమోత్సవాన్ని అంకితం చేస్తున్నాము. ఈ సినిమా కొరకు మేము 200 మంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడం జరిగింది.సీనియర్ నటీనటులు, టెక్నీషియన్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము. నిర్మాతలు ఎంతో ఫ్యాసినెట్ ఉన్నవారు.ఈ సినిమా కోసం ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ చేసి జూన్,జులై నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొని దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.
చిత్ర సహా నిర్మాత రఫీ మాట్లాడుతూ.. రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు మంచి హీరో కావాలను కున్నప్పుడు సన్నీ ని సెలెక్ట్ చేసుకొన్నాము. అలాగే సీనియర్ ఆర్టిస్టులు కూడా మా సినిమాకు బాగా సెట్టయ్యారు.ఇలా సీనియర్ నటీనటులు, టెక్నీషియన్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఏంటర్ టైన్ చేస్తుంది అన్నారు.
నటి ఆక్షా ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నేను చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.ఇందులో ఫుల్ కామెడీ ఉంటుంది.సీనియర్స్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఫన్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆన్ స్థాపబుల్ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో నేను అన్ని పాటలు రాయడం జరిగింది. బీమ్స్ సంగీత దర్శకత్వం లో నేను చేస్తున్న ఈ సినిమాకు మంచి పాటలు ఇస్తానని డైమండ్ రత్న బాబు కు గోల్డ్ బాబులకు ప్రామిస్ చేస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు బీమ్స్ మాట్లాడుతూ.. ఇందులో ప్రేక్షకులకు నచ్చే పాటలు ఇస్తున్నాము.శ్యామ్ అన్న మంచి పాటలు అందిస్తున్నాడు.అలాగే కాశర్ల శ్యామ్ అన్నతో నా ప్రయాణం ప్రాణముంతవరకు కోనసాగుతోంది అన్నారు.
నిర్మాత రంజన్ రావ్.బి మాట్లాడుతూ... ఇక నుండి ఈ బ్యానర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసేలా మంచి సినిమాలు తీసుకువస్తామని ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు నిర్మించే ఈ సినిమా కథ కూడా చాలా బాగుంది.ఫుల్ ఔట్ ఔట్ కామెడీ మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు.
విలన్ గా నటిస్తున్న విక్రమాదిత్య మాట్లాడుతూ.. ఇప్పటి వరకు యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు విలన్ గా చేశాను. ఇప్పుడు ఫుల్ కామెడీ సినిమాలో విలన్ గా నటిస్తున్నందుకు చాలా ఎగ్సైటింగ్ గా సంతోషంగా ఉంది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కామెడీ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
నటీనటులు: వి.జె సన్నీ, సప్తగిరి,ఆక్షా ఖాన్, పృద్వీ, పోసాని కృష్ణ మురళి, షకలక శంకర్,చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, సురేష్ కొండేటి, విక్రమాదిత్య, బిత్తరి సత్తి,మణి చందన,లిరీష, విరాన్ ముత్తం శెట్టి, మురళీ గౌడ్,రోణి,కావ్యా రెడ్డి,గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు