హృదయాలు గెలుచుకున్న బిగ్ బాస్ విజేత అభిజిత్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ లో హీరో అభిజిత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తన నడవడిక, కూల్ నెస్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. తాజాగా అభిజిత్ రియల్ లైఫ్ లో కూడా విజేత అనిపించుకున్నాడు. ఈసారి అతడు గెలుచుకుంది హృదయాల్ని. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సెలెబ్రిటీలు ఎవరికి వారు తమకు తోచినవిధంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరికొందరు ఈ పరిస్థితుల్లో ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. సిద్దిపేటలో నిత్యావసరాలు కూడా లేక మూడు నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న సంగతి అభిజిత్ చెవిన పడింది.
వెంటనే స్పందించిన అభిజిత్ ఆ కుటుంబాలని ఆదుకున్నాడు. ' మూడు పేద కుటుంబాలు నిత్యావసర సరుకులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారని నాకు తెలిసిన వ్యక్తి ద్వారా తెలుసుకున్నాను. వారి గురించి తెలుసుకుని సాయం చేయాలని యువకుల్ని పంపాను' అని అభిజిత్ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు.
అభిజిత్ చేసిన ఈ సాయం అందరి హృదయాలు గెలుచుకునేవిధంగా ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో హీరోగా పరిచయమైన అభిజిత్ పలు చిత్రాల్లో నటించాడు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com