బిగ్‌బాస్ టైమ్ చేంజ్..
- IndiaGlitz, [Wednesday,December 02 2020]
'నేను టైమ్‌ను నమ్మను టైమింగ్‌ను నమ్ముతాను' అని గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్ డైలాగ్ చెప్పిన డైలాగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే డైలాగ్‌ను నాగార్జున చెప్పబోతున్నాడట. ఇంతకీ నాగార్జున ఆ డైలాగ్‌ను ఎందుకు చెప్పబోతున్నాడా? అనే సందేహం రాకమానదు. అసలు విషయమేమంటే నాగార్జున అక్కినేని హోస్ట్‌గా చేస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తయ్యాయి. మరో మూడు వారాలకు బిగ్‌బాస్ 4 పూర్తవుతుంది. అయితే చివరి స్టేజీలో బిగ్‌బాస్ 4 టైమింగ్‌ను నిర్వాహకులు మార్చేశారట.
వివరాల్లోకెళ్తే.. సాధారణ రోజుల్లో బిగ్‌బాస్ రాత్రి 9.30 గంటలకు వస్తే వారాంతరాలైన శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది. అయితే ఇకపై బిగ్‌బాస్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి పదిగంటలకు.. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. మరి సడెన్‌గా బిగ్‌బాస్ 4ను మార్చడానికి కారణం... షో చివరి దశకు వచ్చేటప్పటికీ ఆసక్తితో ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారు. కాబట్టి టైమ్ మార్చినా పరావాలేదనిపించే నిర్వాహకులు బిగ్‌బాస్ 4 టైమ్‌ను మార్చారట. కొత్త సీరియల్ రావడంతో దాన్ని సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం చేస్తూ, ఆ టైమ్లోవచ్చే వదినమ్మ సీరియల్‌ను రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మార్చేశారట. అదీ అసలు సంగతి