Bigg Boss: సేఫ్ జోన్లోకి ముగ్గురు.. నామినేషన్స్‌ని తప్పించుకునేది ఎవరో..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తొలి రెండు రోజుల్లోనే గొడవలు మొదలైనట్లుగా కనిపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. ఇక సాధారణంగా బిగ్‌బాస్ షోలో తొలిరోజునే నామినేషన్స్ జరుగుతాయి. గడిచిన ఐదు సీజన్లుగా ఇదే ఆనవాయితీని కొనసాగించారు నిర్వాహకులు. కానీ ఈసారి మాత్రం వెరైటీగా ప్రయత్నించారు. 21 మంది కంటెస్టెంట్ల సత్తా, టాలెంట్ తెలుసుకోవాలని భావించిన బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా కంటెస్టెంట్లను క్లాస్, మాస్, ట్రాష్ అనే మూడు జట్లుగా విడగొట్టాడు. అయితే బిగ్‌బాస్ ఒక బంపరాఫర్ ఇచ్చాడు. ట్రాష్ నుంచి ఒకరు క్లాస్ సభ్యుడితో స్వాప్ చేసుకోవచ్చని తెలిపాడు. దీంతో గీతూ క్లాస్‌లోకి, బాలాదిత్య ట్రష్లోకి వెళ్లారు.
ఇదే సమయంలో ఇనయాను కావాలని టార్గెట్ చేసుకుని ఆమెతో ఇంటి పనులు చేయించుకుంది గీతూ. కానీ ఏం చేయలేక ఏడుస్తూ పనులు చేస్తూనే , ఆమెతో వాదనకు దిగింది. తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కుల్లో రేవంత్, నేహా గెలిచి మాస్ టీమ్‌లోకి.. బాలాదిత్య, అభినయ ట్రాష్ టీమ్‌లోకి స్వాప్ అయ్యారు. ఆపై కాసేపటికే క్లాస్, మాస్, ట్రాష్ టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
ఇంతలో నామినేషన్స్‌ని అనౌన్స్ చేశాడు బిగ్‌బాస్. నేహా, ఆదిరెడ్డి, గీతూలు విశేషాధికారాలున్న క్లాస్ టీమ్‌లో వున్న కారణంగా వీరు ముగ్గురూ నామినేషన్స్‌లో లేరని చెప్పాడు. ఇదొక్కటే కాదు.. రాబోయే ఎపిసోడ్స్‌లలో వీరు కెప్టెన్సీ కంటెండర్స్‌గా బరిలోకి దిగే అవకాశాలు కూడా మెండుగా వున్నాయి. ఎలిమేషన్ నుంచి తప్పించుకున్నందుకు వీరు ముగ్గురు సంబరపడిపోయారు. ఒక చోట చేరి ముచ్చట్లు పెట్టుకున్నారు. అయితే ట్రాష్ జట్టులో వున్న బాలాదిత్య, అభినయశ్రీ, ఇనయాలు మాత్రం నామినేషన్స్‌లోకి వచ్చారు.
ఇక సహజంగా భార్యాభర్తల మధ్య చోటు చేసుకునే చిలిపి తగాదాలు, అలగడం, బ్రతిమలాడటం వంటి వాటికి జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పట్లో భార్యాభర్తలైన వరుణ్ సందేశ్- వితికా షేరుల జంట బాగా క్లిక్ అయ్యింది. అదే ఎక్స్‌పీరియన్స్‌ని మళ్లీ అందించేందుకు నిజజీవితంలో భార్యాభర్తలైన మేరీనా- రోహిత్‌లను రంగంలోకి దింపారు బిగ్‌బాస్ నిర్వాహకులు.. ఇవాళ్టీ ఎపిసోడ్లో వీరిద్దరి గిల్లికజ్జాలు హైలైట్‌గా నిలించాయి.
టాస్కులు, ఎలిమినేషన్స్ గురించి మేరినా.. తన భర్త రోహిత్‌తో ఏదో చెప్పాలని యత్నిస్తూ వుంటుంది. అద్దంలో తన బాడీని, అందాన్ని చూసుకుంటూ రోహిత్ అది వింటూ వుంటాడు. కానీ తాను అంత సీరియస్‌గా చెబుతూ వుంటే.. ఏదో మొక్కుబడిగా వింటూ వుండటాన్ని మేరినా తట్టుకోలేక విసుక్కుంటుంది. దానిని అర్ధం చేసుకుని వెంటనే రోహిత్ ఆమె వైపు తిరిగి ప్రతి దానికి ఓవర్ చేయకు అని గద్దిస్తాడు. దీనికి అలిగిన మేరినా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరి వీరిద్దరి గొడవ ఏమవుతుంది... నామినేషన్స్‌లోకి ఇంకెంత మంది వస్తారో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments