బిగ్‌బాస్ 5 తెలుగు: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జెస్సీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ జస్వంత్ అనూహ్య పరిణామాల మధ్య హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యం వెంటాడటంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకుని కాజల్‌ను సేవ్ చేశాడు. వారం రోజుల పాటు సీక్రెట్ రూంలోనే ఉన్న జెస్సీ కోలుకొని రీఎంట్రీ ఇస్తాడని భావించినా వర్టిగో వ్యాధి బాగా ఇబ్బంది పెట్టడంతో బిగ్‌బాస్ షో మధ్యలోంచి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది.
ఎలిమినేట్ అయిన అనంతరం జశ్వంత్ హైదరాబాద్ కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. విజయవాడకు చెందిన జశ్వంత్ మోడల్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ బిగ్‌బాస్ 8వ కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నాడు. టాస్క్ సందర్భంగా మరో కంటెస్టెంట్ చేయి జశ్వంత్ మెడపై బలంగా తగలడంతో నొప్పి ఎక్కువ కావడంతో షో నుంచి వైదొలిగాడు.
కాగా పది వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో వున్నందుకు గాను జెస్సీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్న దానిపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జెస్సీకి వారానికి రూ. 1.5 లక్షల చొప్పున పది వారాలకు గాను మొత్తం రూ. 10 -15 లక్షల వరకు అందినట్లు అంచనా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com