బిగ్‌బాస్-3 విన్నర్ ఎవరో అప్పుడే తెలిసిపోయిందోచ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి షో ప్రారంభమై పట్టుమని పది గంటలు కూడా గడవలేదు.. అప్పుడే విన్నర్ ఎవరు..? అదిగో ఫలానా కంటెస్టెంటే విన్నర్..? అని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చేస్తున్నాయ్. ఇలా పుకార్లు పుట్టడానికి కూడా కారణాలున్నాయట. హౌస్‌లోకి పక్కా ప్లాన్‌తో అడుగుపెట్టడమే కారణమట. ఇప్పటి వరకూ మొదటి సీజన్‌లో శివ బాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్ విన్నర్‌గా నిలిచిన ఈ ఇద్దరూ కూడా పవన్ వీరాభిమానులే.. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులు.
మొదటి, రెండు సీజన్లలో పవన్ అభిమానులు మాత్రమే విన్నర్ అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్‌తో పాటు జనసేన కార్యకర్తలు సపోర్టు చేయడంతో అలవోకగా గెలిచిపోయారు. అయితే ఈ సీజన్లో కూడా పవన్ వీరాభిమానే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఆ వీరాభిమాని ఎవరో కాదండోయ్.. అటు బుల్లి తెరపై.. ఇటు వెండి తెరపై తన అందచెందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన శ్రీముఖి.
శ్రీముఖి గురించి ప్రత్యేకించి మరీ చెప్పడానికి ఏమీ లేదు. పటాస్ షో ప్రియులకు అయితే ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమెకు ఫాలోవర్స్, ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. కాస్త అటు ఇటు సెలబ్రిటీకి దగ్గరదగ్గరగానే ఉంటారు. అయితే శ్రీముఖి ఫ్యాన్స్.. పవన్ ఫ్యాన్స్ ఇద్దరూ కలిస్తే తన గెలుపు పక్కా అని శ్రీముఖి ధీమా వ్యక్తం చేస్తోందట. అంతేకాదు ఇందుకు ముందుగానే‘ శ్రీముఖి ఆర్మీ’ని కూడా తయారు చేసిందని వార్తలు గుప్పుమంటున్నాయ్. అయితే ముచ్చటగా మూడోసారి పవన్ అభిమానే బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తారా లేకుంటే..? వేరెవరైనా విన్నర్ అవుతారో తెలియాలంటే షో పూర్తయ్యే 100 రోజులు పూర్తవ్వల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com