Bigg Boss Telugu 7: నామినేషన్స్ చేయడానికి వణికిన రతిక, బిగ్‌బాస్ వార్నింగ్.. చివరికి శోభా - ప్రియాంకలతో గొడవ

  • IndiaGlitz, [Tuesday,November 14 2023]

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతోంది. గత వారం భోలే షావళి ఎలిమినేట్ కాగా, దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. వీరిలో 9 మంది ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం ఇంట్లో 10 మంది మాత్రమే మిగిలారు. ఇక ఎప్పటిలాగా సోమవారం కావడంతో నామినేషన్స్ షురూ అయ్యాయి. దీనిలో భాగంగా నామినేట్ చేసే వారు తగిన కారణాలు చెప్పిన తర్వాత నామినేట్ చేసిన వారి తలపై బాటిల్ పగులగొట్టాల్సి వుంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి సరిగా ఆడకపోవడంతో పాటు ప్రతి ఆదివారం ఎలిమినేట్ అయిపోతానేమోనని భయపడుతున్న రతికలో ధైర్యం నూరిపోశాడు శివాజీ.

నువ్వు ఏమైనా అనుకో.. కానీ నామినేషన్స్‌లో మాత్రం నసుగుతూ పాయింట్లు చెప్పొద్దు.. నీ టాలెంట్ ఏంటో చూపించు, ఆలోచించుకుని అవతలి వాడు నిన్ను డిఫెండ్ చేసేటప్పుడు , నిన్ను రివర్స్ క్వశ్వన్ చేసే ఛాన్స్ ఇవ్వొద్దు. ఇక్కడ మొదలుపెడితే, గేమ్ ఎండ్ డేట్ వచ్చే వరకు ఆపొద్దు అని శివాజీ సలహాలిచ్చాడు. నామినేషన్స్ చేసేందుకు వచ్చిన రతిక తడబడింది. నాకు కొంచెం టైం కావాలంటూ సైలెంట్‌గా వుండిపోయింది. దీంతో బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఆలస్యం చేస్తే నేరుగా బిగ్‌బాస్ నామినేట్ చేస్తారని హెచ్చరించాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే రతిక.. శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్.. పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి, ప్రియాంక.. రతిక, అశ్విని, గౌతమ్.. అర్జున్, అమర్‌దీప్. అయితే ఈ రోజు పూర్తి నామినేషన్స్ జరగలేదు. మిగిలినవారు మంగళవారం నామినేషన్స్ కొనసాగించనున్నారు.

అంతకుముందు బిగ్‌బాస్ వార్నింగ్‌తో భయపడ్డ రతిక.. వెంటనే శోభాశెట్టి పేరు చెప్పింది. నీ కెప్టెన్సీ తనకు నచ్చలేదని, లాస్ట్ వీక్ నువ్వు చేసిన నామినేషన్‌లో రీజన్ లేదంటూ రతిక చెప్పింది. దీనికి డాక్టర్ మోనిత ఫైర్ అయ్యింది. యావర్‌కు మాత్రమే తన కెప్టెన్సీ నచ్చలేదని.. మిగిలినవారు బావుందన్నరని చెప్పింది. అయితే నువ్వు కెప్టెన్‌గా ఏం చేశావో చెప్పాలని రతిక ప్రశ్నించింది. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదని శోభ ఘాటుగా చెప్పింది. కెప్టెన్ అంటే బ్యాడ్జి పెట్టుకుని తిరగడం కాదని.. బాధ్యతగా వుండాలంటూ రతిక క్లాస్ పీకుతూనే వుంది. ఈ గోల భరించలేక నా కెప్టెన్సీ నీకు నచ్చలేదు.. కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాను ఒప్పుకుంటున్నా అంటూ శోభ ముందుకెళ్లింది.

తన రెండో నామినేషన్‌ కోసం ప్రియాంకను రతిక సెలెక్ట్ చేసుకోవడం కూడా హౌస్‌ను హీటెక్కించింది. రతిక చెప్పిన పాయింట్లు సిల్లీగా వున్నాయంటూ ప్రియాంక వాదించింది. మేం తప్పు చేస్తే నాగ్ సార్ చెబుతారుగా అంటూ పాయింట్లు లాగింది. అలా వాదించుకుంటూ వీరిద్దరూ భోలే టైపులో డ్యాన్సులు కూడా చేశారు. మొత్తానికి ప్రియాంక నెత్తిన బాటిల్ పగులగొట్టి , ఎంతో కష్టపడి తన నామినేషన్స్ పూర్తి చేసింది రతిక. అయితే రతిక అడిగిన ప్రశ్నలే తర్వాత శోభాశెట్టిని ప్రశ్నించాడు అర్జున్. నీకు కెప్టెన్ అవ్వాలనే కసి.. అయ్యాక లేదని, ఒక్క రోజు కూడా కిచెన్‌కి వచ్చి టిఫిన్, భోజనానికి అన్నీ సరుకులు వున్నాయా అని చూడలేదంటూ అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు వీఐపీ రూమ్ దాటి వచ్చావా అంటూ అర్జున్ ప్రశ్నించాడు. అలా సోమవారం నాటి నామినేషన్లు ముగిశాయి. రేపు మరికొందరు నామినేషన్స్ వుండటంతో హౌస్ హీటెక్కిపోయే ఛాన్స్ వుంది.

More News

Hi Nanna Director: నాని 'హాయ్ నాన్న' డైరెక్టర్.. ఫేమస్ యూట్యూబర్ అన్నయ్య అని తెలుసా..?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్ నాన్న'. ఈ చిత్రానికి శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కథ నచ్చితే చాలు కొత్త దర్శకులను పరిచయం చేయడంలో

Drohi Review: మర్డర్ చుట్టూ తిరిగే 'ద్రోహి'.. మూవీ రివ్యూ

అజయ్ (హీరో సందీప్) ఒక వ్యాపారవేత్త. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి రకరకాల వ్యాపారాలు చేస్తే వుంటాడు. ఎంత కష్టపడుతున్నా.. ఎఫర్ట్ పెడుతున్నా బిజినెస్‌లో నష్టపోవడమే కానీ కలిసి రావడం మాత్రం జరగదు.

Anukunnavanni Jaragavu Konni: 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' మూవీ రివ్యూ

కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఓటీటీ కారణంగా ప్రపంచం నలుమూలలా వున్

KCR: వైఎస్ షర్మిల డబ్బు కట్టలు పంపుతున్నారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

Tula Uma: బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు.