Bigg Boss Telugu 7: ప్రశాంత్, గౌతమ్ మధ్య 'పంచె' పెట్టిన చిచ్చు.. అశ్విని షాకింగ్ డెసిషన్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఆదివారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు దక్కించుకోకపోవడంతో ఈ వారం ఎలిమినేషన్ లేదని ఆయన వివరించారు. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్‌కు తెరదీశారు. నామినేట్ చేయాలనుకుటున్న వారు.. కంటెస్టెంట్స్ ఫోటో వున్న చికెన్ ముక్కను సింహం నోట్లో పెడితే వారు నామినేట్ అయినట్లు అని బిగ్‌బాస్ తెలిపారు. అలా అమర్‌దీప్.. ప్రిన్స్ యావర్, రతిక, గౌతమ్.. ప్రశాంత్, శివాజీ, రతిక.. అమర్‌దీప్, ప్రశాంత్, అర్జున్.. ప్రిన్స్ యావర్, శివాజీ, ప్రశాంత్.. గౌతమ్, రతిక, అశ్విని.. సెల్ఫ్ నామినేషన్ అయ్యింది.
సోమవారం అంటేనే గొడవలు, కొట్లాటలు కాబట్టి షరా మామూలుగానే అవి కంటిన్యూ అయ్యాయి. నామినేట్ చేయడానికి వచ్చిన అమర్.. ప్రిన్స్ యావర్‌ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పట్టి ఆడావ్.. అది తప్పు కదా అని అని రీజన్ చెప్పాడు. తాను కావాలని చేయలేదని, అది అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అర్జున్ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో చేసిన తప్పులను చెబుతూ యావర్‌ని నామినేట్ చేశాడు.
తర్వాత గౌతమ్, ప్రశాంత్ మధ్య గొడవ జరిగింది. బాల్స్‌ని బ్యాలెన్స్ చేసే టాస్క్‌లో సంచాలక్‌గా ఫెయిలయ్యావని రీజన్ చెప్పాడు. దీనికి మన రైతుబిడ్డ ధీటుగా బదులిచ్చారు. పంచె ఊసిపోకుండా చూస్కో అంటూ కామెంట్ చేశాడు. నా పంచె గురించి కామెంట్ చేయడానికి నువ్వెవరు.. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దంటూ గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. పంచె మన తెలుగు సంస్కృతిలో భాగమని.. దానిని కించపరచడం సరికాదని గౌతమ్ సున్నితంగా మందలించాడు. తన తప్పు తెలుసుకున్న పల్లవి ప్రశాంత్.. తాను తప్పు ఉద్దేశంతో అనలేదని, పంచె ఊడిపోకుండా కాపాడుకోవాలని మాత్రమే చెప్పానని వివరించాడు.
మరోవైపు.. అమర్‌దీప్ తనను నామినేట్ చేసినందుకు , రతిక కూడా అతనిని రివర్స్ నామినేట్ చేసింది. ఆమె చెప్పిన రీజన్స్ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా సైలెంట్‌గా నిలబడ్డాడు అమర్‌దీప్. తర్వాత అందరితో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడొద్దు అని రివర్స్ అయ్యాడు. ఇక అశ్విని శ్రీ విచిత్రమైన నిర్ణయం తీసుకుని షాకిచ్చింది. సిల్లీ కారణాలతో తాను ఎవరినీ నామినేట్ చేయలేనని తేల్చిచెప్పడంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకున్నాడు. నామినేట్ చేయడానికి ఏ పేరూ దొరక్కపోతే సెల్ఫ్ నామినేట్ అవుతారని చెప్పాడు. దీనికి ఓకే చెప్పిన అశ్విని తలూపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments