Bigg Boss Telugu 7: 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' రైతుబిడ్డదే.. బిగ్‌బాస్ హౌస్‌లో దారుణహత్య, రంగంలోకి పోలీసులు

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ రచ్చ నడుస్తోంది. గత వారం ప్రిన్స్ యావర్ దానిని చేజిక్కించుకున్నప్పటికీ .. గేమ్ రూల్స్ ప్రకారం ఆడలేదంటూ నాగార్జున ఆధారాలు బయటపెట్టారు. దీంతో తనకు క్యారెక్టరే ముఖ్యమంటూ పాస్‌ను తిరిగి ఇచ్చేశాడు. దాంతో పాస్‌ను స్టోర్ రూంలో పెట్టించారు నాగ్. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించుకోవడానికి వీలు లేకపోవడంతో గత వారం ఎలిమినేషన్ కూడా వాయిదాపడింది. కానీ నెక్ట్స్ వీక్ డబుల్ ఎలిమినేషన్ వుంటుందని నాగార్జున షాకిచ్చారు.

సోమవారం ఆరుగురి నామినేషన్స్ పూర్తయ్యాయి. అమర్‌దీప్.. ప్రిన్స్ యావర్, రతిక, గౌతమ్.. ప్రశాంత్, శివాజీ, రతిక.. అమర్‌దీప్, ప్రశాంత్, అర్జున్.. ప్రిన్స్ యావర్, శివాజీ, ప్రశాంత్.. గౌతమ్, రతిక, అశ్విని.. సెల్ఫ్ నామినేషన్ అయ్యింది. మిగిలిన నలుగురు ఇవాళ నామినేషన్స్ పూర్తి చేశారు. శివాజీ.. గౌతమ్, అశ్వినీ, ప్రిన్స్ యావర్ .. అమర్‌దీప్, అర్జున్, శోభాశెట్టి.. శివాజీ, అర్జున్, ప్రియాంకా .. ప్రిన్స్ యావర్, శివాజీలను నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం శివాజీ, అర్జున్, రతిక, గౌతమ్, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, అశ్వినీలు నామినేషన్‌లో వున్నారు.

నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగిన తర్వాత ఇంటి సభ్యులంతా రెండు గ్రూపులుగా విడిపోయి శివాజీ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఇందులో ప్రియాంక ప్రవర్తనపై శివాజీ కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా నిలిచింది. తనను ప్రియాంక నామినేట్ చేయడం అస్సలు తట్టుకోలేకపోయినట్లుగా శివాజీ ప్రవర్తన వుంది. గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు ఓ క్యారెక్టర్ వుండాలని కామెంట్ చేశాడు . తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్‌కు సంబంధించి టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదే ‘‘బ్యాలెన్స్ ది కట్లరీ ’’ . టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులంతా ఒక చేతిలో బ్యాలెన్స్ స్టాండ్‌ను పట్టుకుని సమయానుసారం బిగ్‌బాస్ చెప్పిన వస్తువులను ఒకదానిపై ఒకటి బ్యాలెన్స్ చేయాల్సి వుంటుంది. చివరి వరకు ఎవరైతే అన్ని వస్తువులను బ్యాలెన్స్ చేస్తారో వారే విజేత. ఈ గేమ్‌లో ప్రశాంత్ కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. తాను విజేతగా నిలవడంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు.

తన గ్రూప్ సభ్యుడు విజయం సాధించడంతో శివాజీ ఎక్కువ సంబరపడ్డాడు. తన నమ్మకం నిలబడింది అంటూ ప్రశాంత్‌ను కొనియాడాడు. అన్నీ ఉన్న ఆకు ఎప్పుడూ అనిగిమనిగి వుంటుంది.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటూ హౌస్‌మేట్స్‌ను ఉద్దేశించి సామెతను చెప్పాడు. ఇంతలో యావర్ వచ్చి.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను శివాజీ కోసం ఉపయోగించాలని , తన కోసం ఎప్పుడూ వాడొద్దని ప్రశాంత్‌ను కోరాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ యాక్టివిటీ రూమ్‌కు పిలిచాడు బిగ్‌బాస్. కానీ అర్జున్, అమర్‌దీప్‌లకు నో ఎంట్రీ అన్నాడు. మిగిలిన వారికి మిసెస్ బిగ్‌బాస్ లంచ్ ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేస్తుండగా బయటి నుంచి ఒక అరుపు వినిపించింది. లోపల ఒక హత్య జరిగిందని , చనిపోయింది మిసెస్ బిగ్‌బాస్ అని బిగ్‌బాస్ చెప్పాడు. ఆమె వద్ద విలువైన వస్తువులు వున్నాయని.. అవి కూడా మిస్ అయినట్లుగా చెప్పాడు. కంటెస్టెంట్స్‌కు ఏం జరిగిందో తెలియక అయోమయంలో వుండగా.. అమర్‌దీప్, అర్జున్‌లు పోలీస్ గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చి ఇంకో షాకిచ్చారు.