Bigg Boss Telugu 7: కొడతావా కొట్టు అమర్‌ మీదకెళ్లిన యావర్, రెండో రోజూ రచ్చే.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

  • IndiaGlitz, [Wednesday,November 15 2023]

దీపావళి సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత జరిగిన సోమవారం నామినేషన్స్ ప్రక్రియ షురూ అయ్యింది. రతిక.. శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్.. పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి, ప్రియాంక.. రతిక, అశ్విని, గౌతమ్.. అర్జున్, అమర్‌దీప్‌లను నామినేట్ చేశారు. అయితే సోమవారం పూర్తిగా ఈ ప్రక్రియ జరగకపోవడంతో మంగళవారానికి షిఫ్ట్ అయ్యింది. అంతేకాదు.. నిన్నటి రచ్చ ఇవాళ మరింత పెరిగి పెద్దదయ్యింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ప్రశాంత్.. అర్జున్, రతిక, అశ్విని.. ప్రియాంక, అమర్‌దీప్, ప్రిన్స్ యావర్.. శోభాశెట్టి, అమర్‌దీప్, శోభాశెట్టి.. ప్రిన్స్ యావర్, అశ్విని, అమర్‌దీప్.. గౌతమ్, ప్రిన్స్ యావర్, శివాజీ.. గౌతమ్, ప్రియాంకలను నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం అమర్‌దీప్, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, రతిక, అశ్విని శ్రీ, ప్రిన్స్ యావర్, గౌతమ్‌లు నామినేషన్స్‌లో నిలిచారు.

ఇవాళ్టీ ఎపిసోడ్‌లో ప్రశాంత్ - అర్జున్, శోభాశెట్టి - పల్లవి ప్రశాంత్, అశ్విని - ప్రియాంక మధ్య వాగ్వాదం జరిగింది. లేని టాపిక్ మధ్యలో ఎందుకు దూరుతున్నావంటూ ప్రియాంకపై అశ్విని అరవడం మొదలుపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడమే తనకు సంతోషమని.. కప్ గెలిస్తే ఇంకా హ్యాపీ అని కానీ కప్ కోసమే వచ్చాననే మాటలు తాను చెప్పబోనని అశ్విని వ్యాఖ్యానించింది. తన బాడీలో పార్ట్స్ అన్ని సరిగ్గానే వున్నాయని..అందుకే ఏ ఎమోషన్ వస్తే, ఆ ఎమోషన్‌ను చూపిస్తానని అశ్విని ఘాటుగా బదులిచ్చింది.

తర్వాత ప్రిన్స్ యావర్, అమర్‌దీప్‌లు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. తొలుత శోభాశెట్టిని నామినేట్ చేసిన యావర్.. అమర్‌దీప్‌ను సెకండ్ నామినేషన్స్‌లో వేశాడు. బొమ్మల టాస్క్‌లో అమర్‌దీప్ ఆట నచ్చలేదని రీజన్ చెప్పాడు. దీనికి అమర్ .. హౌస్‌మేట్స్‌ను న్యాయం చెప్పాలని కోరాడు. యావర్ ఏమాత్రం తగ్గకుండా పాత విషయాలను తవ్వడం మొదలుపెట్టడంతో అమర్‌దీప్‌కు కోపం వచ్చింది. నీకో పాయింట్ లేదు.. నీకెప్పుడూ నామినేషన్స్‌కి నేనే కావాలి అంటూ వాగ్వాదానికి దిగాడు. అమర్‌ మీదకు యావర్ దూసుకెళ్లడంతో శివాజీ కలగజేసుకుని వారిని ఆపాడు.

ఇకపోతే.. ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సీజన్‌లోనూ టాప్ 10 కంటెస్టెంట్స్ ఎవరో తమలో తామే నిర్ణయించుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే టాప్ ప్లేస్‌లో నిలబడేందుకు కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి శివాజీని టాప్ 1లో నిలబెట్టి.. యావర్ సెకండ్ ప్లేస్‌లో, పల్లవి ప్రశాంత్‌ మూడు, ప్రియాంక నాలుగు, శోభాశెట్టిలో ఐదులో నిలబడ్డారు. అమర్‌దీప్ 6, గౌతమ్ 7, అర్జున్ 8, అశ్విని 9, రతిక 10లో నిలబడ్డారు. బిగ్‌బాస్ గత సీజన్‌లలో టాప్ 5లో నిలబడిన వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే అవకాశం వుంటుంది. ఇందుకోసం కంటెస్టెంట్స్ అంతా రెడీ అవుతుండగా బిగ్‌బాస్ షాకిచ్చాడు. 6 నుంచి 10 స్థానాల్లో నిలబడిన వారు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడేందుకు సిద్ధమవ్వాలని సూచించాడు. అనంతరం వీరికి పజిల్ గేమ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో అర్జున్ గెలిచినట్లుగా తెలుస్తోంది.

More News

Telangana Elections 2023: రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన ముఖ్య నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేటితో కీలక ఘట్టం ముగియనుంది. ఎందుకంటే నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే ఆఖరి రోజు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి.

Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. యానిమల్ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'యానిమల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

Nadendla Manohar: జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగింది: నాదెండ్ల

జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

YS Jagan: సీఎం జగన్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల

కొందరు నాయకులు ప్రజలకు మంచి జరిగే పనులు మొదలుపెట్టారంటే.. పూర్తిచేసే దాకా విశ్రమించరు. అలాంటి పట్టువదలని నాయకుడిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.

AP CID: టీడీపీ బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని సీఐడీ నోటీసులు

ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని తెలియజేస్తూ సీఐడీ కానిస్టేబుల్ ఒకరు కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు నోటీసులు ఇచ్చారు.