యాక్ట్ చేస్తూ బతకడం రాదు.. కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడ్డ రేవంత్

  • IndiaGlitz, [Friday,September 09 2022]

నిన్నటి ఎపిసోడ్‌లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రాసెస్ ముగిసింది. మొదటి వారం నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్‌, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా, ఆరోహి, అభినయశ్రీ నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్స్ ఈ వారం నామినేట్ అయ్యారు. ఇక ఇవాళ్టీ ఎపిసోడ్‌లోకి వెళితే.. అందరూ తనను టార్గెట్ చేశారని, అందుకే నామినేషన్‌లో తనకే ఎక్కువ ఓట్లు పడ్డాయని రేవంత్ బాగా హర్ట్ అయ్యాడు. తానే తొలి వారం ఎలిమినేట్ అవుతానేమోనని బాధపడుతున్నాడు. ఇది అతని ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. దీంతో ఇంటి సభ్యులపై రేవంత్ ఫ్రస్టేషన్ చూపించాడు. అయితే బాలాదిత్య అతనికి గీతోపదేశం చేసి కూల్ చేసేందుకు ట్రై చేస్తాడు. బిగ్‌బాస్ అన్నాక ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతాడు. దీనిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు. అయితే గీతూ మాత్రం గలాటా చేస్తూ రేవంత్‌పై జోకులేస్తుంది. ఈ అబ్బీ మారేలా కనిపించడం లేదు. ఎంత త్వరగా ఎలిమినేట్ అయితే అంత మంచిదంటూ కామెంట్ చేసింది.

ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే మెరీనా ఆరోహిపై విరుచుకుపడింది. తనను బాడీ షేమింగ్ చేసిందంటూ ఎమోషనలై కంటతడి పెట్టింది. అంతేకాదు తన భర్తపైనా కంటెస్టెంట్స్‌కి కంప్లైంట్ చేస్తుంది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి తనకు చిన్న హగ్ కూడా ఇవ్వలేదని.. నిన్న నా చేయిపట్టుకున్నట్లే పట్టుకుని నిద్రపోయాడంటూ చెబుతుంది. వాకింగ్ చేద్దామని పిలిస్తే... తనను పట్టించుకోకుండా శ్రీసత్యతో వెళ్లిపోయాడని గొడవ చేసింది. కానీ ఒక్కరంటే ఒక్కరూ కూడా రియాక్ట్ కాకపోవడంతో ఇది ప్రాంక్ అని చెప్పి నవ్వుల పాలైంది మెరీనా.

ఈ లోగా.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ని రెండు జట్లుగా విభజించి డిస్నీ హాట్‌స్టార్ అనే గేమ్ ఆడిస్తాడు. ఆరోహి, పింకీ, రేవంత్ , రోహిత్, మెరీనా, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, వాసంతి, షనీలు టీమ్- Aలో మిగిలిన వారు B టీమ్‌లో వుంటారు. ఇందులో సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ క్విజ్‌ ఆడించాడు బిగ్‌బాస్. అయితే ఈ టాస్క్‌లో బీ టీమ్ విజయం సాధించింది. దీంతో రేవంత్ ముఖం మాడిపోతుంది. అతను రెండు మూడు సార్లు బీ టీమ్ తరపున ఆడతానంటూ కంటెస్టెంట్స్‌తో గొడవ పడతాడు. కానీ ఎవ్వరూ వినరు. అదే అతని అలకకు కారణం. రేవంత్ మాటలను సీరియస్‌గా తీసుకున్న ఆరోహి.. తనతో మాట్లాడొద్దని వేలు చూపించి, అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇకపోతే.. కెప్టెన్సీ పోటీదారులకు సెలెక్ట్ చేయాల్సిందిగా మాస్ కేటగిరిలోని సభ్యులను ఆదేశిస్తాడు బిగ్‌బాస్. దీంతో అందరు కలిసి రోహిత్ అండ్ మెరీనా, ఆర్జే సూర్య, బాలాదిత్యలను ఎంపిక చేస్తారు.

ఇదిలావుండగా... అందరూ తననే టార్గెట్ చేస్తుండటం, తానేం మాట్లాడినా మరోలా అర్ధం చేసుకుంటూ వుండటంతో రేవంత్‌లో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లో వుంటుంది. నాకు యాక్ట్ చేస్తూ బతకడం రాదు.. ఇలా అయితే నన్ను పంపించేయండంటూ కెమెరా ముందు చెప్పుకుంటూ వుంటాడు. నేనేంటో చూపిస్తానని అనడంతో ఆదిరెడ్డి జోక్యం చేసుకుంటాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో జరగబోయేది ఊహించిన శ్రీహాన్.. రేవంత్‌ను వెంటనే పక్కకి తీసుకెళ్తాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
 

More News

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూత.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించిన "మహారాజ్ఞి"

బ్రిటన్ రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో క్వీన్ గురువారం రాత్రి

Divyavani : ఈటల రాజేందర్‌తో దివ్యవాణి భేటీ.. త్వరలో బీజేపీలోకి, సౌత్‌లో ఎక్కడైనా రెడీ అంటూ సంకేతాలు

అలనాటి సినీనటి దివ్యవాణి గురువారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈరోజు హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని

ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా: నట్టి కుమార్

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని

ఏం జరిగినా ఇద్దరికీ వర్తిస్తుంది.. ఎలిమినేషన్ కూడా, రోహిత్- మేరీనాలకు షాకిచ్చిన బిగ్‌బాస్

నిన్నటి ఎపిసోడ్‌లో క్లాస్, మాస్, ట్రాష్.. టాస్క్ ముగించిన బిగ్‌బాస్ నామినేషన్లకు తెరదీసిన సంగతి తెలిసిందే.

Delhi Firecracker Ban : సైలెన్స్ ప్లీజ్.. ఢిల్లీలో బాణాసంచా కాల్పులపై ఈ ఏడాది కూడా నిషేధం

భారతీయులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగల్లో దీపావళి ముందు వరుసలో వుంటుంది.