యాక్ట్ చేస్తూ బతకడం రాదు.. కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడ్డ రేవంత్
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటి ఎపిసోడ్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రాసెస్ ముగిసింది. మొదటి వారం నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా, ఆరోహి, అభినయశ్రీ నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్స్ ఈ వారం నామినేట్ అయ్యారు. ఇక ఇవాళ్టీ ఎపిసోడ్‌లోకి వెళితే.. అందరూ తనను టార్గెట్ చేశారని, అందుకే నామినేషన్లో తనకే ఎక్కువ ఓట్లు పడ్డాయని రేవంత్ బాగా హర్ట్ అయ్యాడు. తానే తొలి వారం ఎలిమినేట్ అవుతానేమోనని బాధపడుతున్నాడు. ఇది అతని ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. దీంతో ఇంటి సభ్యులపై రేవంత్ ఫ్రస్టేషన్ చూపించాడు. అయితే బాలాదిత్య అతనికి గీతోపదేశం చేసి కూల్ చేసేందుకు ట్రై చేస్తాడు. బిగ్‌బాస్ అన్నాక ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతాడు. దీనిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు. అయితే గీతూ మాత్రం గలాటా చేస్తూ రేవంత్‌పై జోకులేస్తుంది. ఈ అబ్బీ మారేలా కనిపించడం లేదు. ఎంత త్వరగా ఎలిమినేట్ అయితే అంత మంచిదంటూ కామెంట్ చేసింది.
ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే మెరీనా ఆరోహిపై విరుచుకుపడింది. తనను బాడీ షేమింగ్ చేసిందంటూ ఎమోషనలై కంటతడి పెట్టింది. అంతేకాదు తన భర్తపైనా కంటెస్టెంట్స్‌కి కంప్లైంట్ చేస్తుంది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి తనకు చిన్న హగ్ కూడా ఇవ్వలేదని.. నిన్న నా చేయిపట్టుకున్నట్లే పట్టుకుని నిద్రపోయాడంటూ చెబుతుంది. వాకింగ్ చేద్దామని పిలిస్తే... తనను పట్టించుకోకుండా శ్రీసత్యతో వెళ్లిపోయాడని గొడవ చేసింది. కానీ ఒక్కరంటే ఒక్కరూ కూడా రియాక్ట్ కాకపోవడంతో ఇది ప్రాంక్ అని చెప్పి నవ్వుల పాలైంది మెరీనా.
ఈ లోగా.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ని రెండు జట్లుగా విభజించి డిస్నీ హాట్‌స్టార్ అనే గేమ్ ఆడిస్తాడు. ఆరోహి, పింకీ, రేవంత్ , రోహిత్, మెరీనా, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, వాసంతి, షనీలు టీమ్- Aలో మిగిలిన వారు B టీమ్‌లో వుంటారు. ఇందులో సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ క్విజ్ ఆడించాడు బిగ్‌బాస్. అయితే ఈ టాస్క్‌లో బీ టీమ్ విజయం సాధించింది. దీంతో రేవంత్ ముఖం మాడిపోతుంది. అతను రెండు మూడు సార్లు బీ టీమ్ తరపున ఆడతానంటూ కంటెస్టెంట్స్‌తో గొడవ పడతాడు. కానీ ఎవ్వరూ వినరు. అదే అతని అలకకు కారణం. రేవంత్ మాటలను సీరియస్‌గా తీసుకున్న ఆరోహి.. తనతో మాట్లాడొద్దని వేలు చూపించి, అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇకపోతే.. కెప్టెన్సీ పోటీదారులకు సెలెక్ట్ చేయాల్సిందిగా మాస్ కేటగిరిలోని సభ్యులను ఆదేశిస్తాడు బిగ్‌బాస్. దీంతో అందరు కలిసి రోహిత్ అండ్ మెరీనా, ఆర్జే సూర్య, బాలాదిత్యలను ఎంపిక చేస్తారు.
ఇదిలావుండగా... అందరూ తననే టార్గెట్ చేస్తుండటం, తానేం మాట్లాడినా మరోలా అర్ధం చేసుకుంటూ వుండటంతో రేవంత్‌లో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లో వుంటుంది. నాకు యాక్ట్ చేస్తూ బతకడం రాదు.. ఇలా అయితే నన్ను పంపించేయండంటూ కెమెరా ముందు చెప్పుకుంటూ వుంటాడు. నేనేంటో చూపిస్తానని అనడంతో ఆదిరెడ్డి జోక్యం చేసుకుంటాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో జరగబోయేది ఊహించిన శ్రీహాన్.. రేవంత్‌ను వెంటనే పక్కకి తీసుకెళ్తాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments