BiggBoss6:మిడ్‌వీక్ ఎలిమినేట్ అయ్యేది శ్రీసత్యేనా... సోషల్ మీడియాలో డిస్కషన్, సస్పెన్స్ కంటిన్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 (BiggBoss6)తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు వున్నందున.. ఫైనల్‌కు ఐదుగురు వ్యక్తులు మాత్రమే వెళ్లాల్సి వున్నందున ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేస్తామని హోస్ట్ నాగార్జున గత ఆదివారం ప్రకటించారు. అయితే బిగ్‌బాస్ తుది విజేత ఎవరో తేల్చే చివరివారం ఓటింగ్స్‌కు లైన్స్ ఓపెన్ అయ్యాని ముందే నాగ్ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్స్‌ను లెక్కిస్తాని చెప్పారు. కానీ బుధవారం అర్ధరాత్రి వరకు పోలైన ఓట్లను బట్టి శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఏకాభిప్రాయంతో కీర్తిని (Keerthi) ఎలిమినేట్ చేయాలన్న కంటెస్టెంట్స్:
దీనికి శుక్రవారం రిలీజ్ చేసిన ప్రోమో మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆ ప్రోమోలో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోందని, ఇంటి సభ్యులంతా తమ తమ బ్యాగులు సర్దుకుని రెడీగా వుండాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అనంతరం టాప్ 5లో వుండటానికి ఎవరు అనర్హులో చెప్పాలని ఛాలెంజ్ విసురుతాడు. దీనికి రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్యలు అభిప్రాయం చెబుతారు. ఈ సందర్భంగా రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్యలు కీర్తి పేరు చెప్పడంతో ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకుంటారు. అయితే ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం.. అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే కీర్తికి బదులుగా మరొకరు హౌస్‌ను వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వ్యక్తి శ్రీసత్యేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
డేంజర్ జోన్‌లో కీర్తి , శ్రీసత్య:
ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం డేంజర్ జోన్‌లో వుంది శ్రీసత్య, కీర్తిలే. అయితే మొన్నటి సర్‌ప్రైజ్ సందర్భంగా కీర్తి గురించి బిగ్‌బాస్ చెప్పిన మాటలు, జీవితంలో ఆమె ఎలా ఫైట్ చేసింది కళ్లకు కట్టినట్లుగా వివరించడంతో ఆమెకు ఓట్లు బాగా పడినట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీసత్యపై ఇప్పటికే వ్యతిరేకత బాగా వున్న సంగతి తెలిసిందే. ఇనయాను ఎలిమినేట్ అయిన రోజునే చాలా మంది శ్రీసత్యను టార్గెట్ చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సత్యని ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 18 (ఆదివారం) బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే జరగనుంది. శ్రీసత్య కనుక ఎలిమినేట్ అయితే.. ఫైనల్‌కి ఒక అమ్మాయి (కీర్తి) , నలుగురు అబ్బాయిలు (రోహిత్, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి) ఉంటారు. మరి మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments