బిగ్‌బాస్ 5 తెలుగు: సిరిని వెనకనుంచి వాటేసుకున్న షన్నూ.. ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా అంటూ సన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ జర్నీలు పూర్తవ్వగా... ఫైనల్‌లో ఎలాగైనా గెలవాలని ఎవరి ప్లాన్లు వారు వేసుకుంటున్నారు. ఇక మరో రెండు రోజుల్లో సీజన్ ముగుస్తున్నా సిరి మాత్రం సన్నీ అంటే అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరిగి.. విషయం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈ రోజు సరదా టాస్క్‌లతో కంటెస్టెంట్స్ ప్రేక్షకులను అలరించారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
ఎపిసోడ్ మొదలవ్వగానే ‘‘గాజువాక పిల్లా.. నేను గాజులోడిని కాదా’’ అంటూ సిరిని చూస్తూ సాంగ్ అందుకున్నా షన్నూ. నిన్నటి మెమొరబుల్ ఫోటోల గురించి మాట్లాడుకుంటూ.. ‘‘నువ్వు నాకు పడిపోయావ్. అందుకే.. నా ఫొటోలు దాచుకున్నావ్’’ అని అన్నాడు షన్నూ. సిరి అదేమీ లేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే నువ్వు గెలిస్తే నాకు కూడా సంతోషమే అని వ్యాఖ్యానించాడు. సిరి కూడా అదే మాట అంది. ఇక ఈరోజేందుకో శ్రీరామ్, మానస్‌లు చాలా డల్‌గా కనిపించారు.
అనంతరం బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు ఈ సీజన్‌లో ప్రేక్షకులు మెచ్చిన టాస్కులను ఆడించడంతో పాటు గిఫ్ట్‌లు కూడా ఇస్తానని వెల్లడించాడు. తొలుత సైకిల్ పంపు సాయంతో బెలూన్లు పగలగొట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సన్నీ 10 బెలూన్లు పగలగొట్టి థమ్స్ అప్ గెలుచుకున్నాడు. అయితే, సన్నీ మోసం చేసి గెలిచాడంటూ షన్ను గొడవకు దిగాడు. థమ్స్ అప్ ఇద్దరం పంచుకుందామని షన్ను గొడవకు తెరదించేందుకు ప్రయత్నించినా.. తాను గెలిచి సాధిస్తానని సన్నీ బదులిచ్చాడు.
అనంతరం స్విమ్మింగ్ పూల్‌లో టీషర్ట్ టాస్క్‌ని మళ్లీ చేయమన్నాడు బిగ్‌బాస్. దీనికి సన్నీ సంచాలకుడిగా ఉండగా.. మానస్, షణ్ముఖ్ తలపడ్డారు. టీషర్ట్‌లు సరిగ్గా ధరించి స్విమ్మింగ్ పూల్‌లో అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు వెళ్లడమే టాస్క్. ఇందులో గెలిచింది సంచాలకే అని సంచాలకుడిగా ఉన్న సన్నీ చెప్పడంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత సౌండ్‌లను బట్టి ఆ వాయిస్ దేనిదో గుర్తుపట్టి పలకపై రాసే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో శ్రీరామ్ విజేతగా నిలిచాడు
తర్వాత సన్నీ, మానస్, శ్రీరామ్ బిగ్‌బాస్ హౌస్ గోడలు ఎక్కేందుకు ట్రై చేశారు. దీంతో బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్ చివరి రోజుల్లో ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరించారు. ఫైనల్‌కి వెళ్లే దశలో ఇలాంటి పనులు చేయొద్దని గట్టిగా చెప్పాడు బిగ్‌బాస్. అంతేకాదు గార్డెన్ ఏరియాని క్లీన్ చేయాల్సిందిగా ఆ ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చాడు. అనంతరం కాన్‌సన్‌ట్రేషన్‌కి సంబంధించిన గేమ్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇంటిసభ్యులందరూ 13 నిమిషాలు లెక్కించాలి. హౌస్‌మేట్స్ అంతా సీరియస్‌గా ఆడుతున్న సమయంలో బిగ్‌బాస్ వారిని డిస్టర్బ్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించాడు. ఈ గేమ్‌లో షణ్ను, శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ కలిసి తిన్నారు.
తర్వాతి టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా ఊపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను పాల్గొనగా సన్నీ గెలిచాడు. అయితే ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని ఆటపట్టించాడు. ఆ మాటకు చిర్రెత్తుకొచ్చిన సిరి.. నువ్వే ఓడిపోయావ్, షణ్ను ఒక్కడే కరెక్ట్‌గా ఆడాడంటూ కామెంట్ చేశాడు. నేనేదో సరదాగా అన్నానని సన్నీ చెప్పే ప్రయత్నం చేసినా సిరి పట్టించుకోలేదు. ఓడిపోయావ్ అనడం జోకా అంటూ అలిగి కూర్చుంది. ‘‘నాపై జోకులు వేయొద్దు’’ అని వార్నింగ్ ఇచ్చింది.
అంతేకాదు నన్ను ఇమిటేట్ చేయకంటూ వేలు చూపించింది. దీనికి సన్నీ ఫైరయ్యాడు.. ‘‘నాకు వేలు చూపించొద్దు’’ అని హెచ్చరించాడు. ‘‘ఏమనుకుంటున్నావ్ సన్నీ నువ్వు? నువ్వు హీరోవా?’’ అని మండిపడింది. దీంతో సిరి, షన్నులది ఓవర్ యాక్షన్ బ్యాచ్ అని, వెళ్లే ముందు నన్ను బ్యాడ్ చేస్తే వారికి ఏమొస్తుందరా అంటూ సన్నీ.. మానస్ వద్ద వాపోయాడు. ఇదిలా ఉండగా.. సిరి, షన్నుల రిలేషన్ మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. బాత్రూమ్ వద్ద షన్ను ఆమెను వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు. సిరి వద్దని వారించినా వదల్లేదు. అయితే దీన్ని ‘అన్ సీన్’లో చూపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments