బిగ్‌బాస్ 5 తెలుగు : సెకండ్ ఫైనలిస్ట్‌గా సన్నీ... బిగ్‌బాస్ హౌస్‌లో హిట్ ఎవరు, ఫ్లాప్ ఎవరు..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకుంది. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి... ఈ సీజన్ మొత్తంగా వున్న రిగ్రెట్స్ ఏంటో తెలియజేశారు. ఈ మొత్తం జర్నీలో ఎవరు ఎమవ్వాలని భావించారో ఒక్కొక్కరి నుంచి కూపీ లాగి వివరాలు రాబట్టారు. మరి కంటెస్టెంట్స్ తన మనసులో మాటలను ఏం చెప్పారో .. ఎవరికి హిట్ , ఎవరికి ఫ్లాప్ ఇచ్చారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
నిన్నటి టాస్క్‌లో దాపరికం లేకుండా ఆన్సర్స్ చేసిన ఒక వ్యక్తిని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకోమని బిగ్ బాస్ చెప్పిన సమయంలో శ్రీరామ్ తన పేరు చెప్పలేని సన్నీ ఫీల్ అయ్యాడు. దీనిపై వీరిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ వెంటనే కాజల్-శ్రీరామ్‌ల మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. 'ఏడుస్తూ.. సింపతీ కోసం గేమ్ ఆడతావని' కాజల్ ని అన్నాడు శ్రీరామ్. 'అలా ఆడేది నువ్వు.. లోన్ రేంజర్ అని చెప్పుకుంటూ.. గ్రూప్స్ మారుస్తూ.. సింపతీ కోసం నువ్ ట్రై చేస్తున్నావని' కాజల్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. ఆ తరువాత బిగ్‌బాస్ బైక్ టాస్క్ఇచ్చారు. ఇందులో మానస్, షణ్ముఖ్, సన్నీ పాల్గొన్నారు. దీనికి కాజల్ సంచాలక్‌గా వ్యవహరించింది.
సన్నీకి సూచనలిస్తూ అతనిని విజేతగా అనౌన్స్ చేయడం తప్పని సిరి వాదించింది. కాజల్ వరస్ట్ సంచాలక్ అంటూ వాదించింది. దీనికి కాజల్ కూడా యాక్సెప్ట్ చేసింది. అయితే ఈ సమయంలో సన్నీ ఆమెకు అండగా నిలబడ్డాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాక కూడా ఇన్ని మాటలు అనడం ఎందుకని సన్నీ అనగా.. 'నేను అంటాను బరా బర్ అంటాను' అని సిరి తేల్చి చెప్పింది.
ఆ తరువాత స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. హౌస్‌మేట్స్‌తో కాసేపు మాట్లాడి.. 'వీల్ ఆఫ్ ది వీక్స్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్‌కి బిగ్‌బాస్ 5 ఇంటిలో తమ జర్నీలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎవరేం చేస్తారు..? ఏం చేయకుండా ఉంటారనే..? ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని తెలిపాడు. అలాగే సంతోషపెట్టిన క్షణాలు , బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌గా ఫీలైన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటాయని అవి పంచుకోవాలని నాగ్ చెప్పారు.
ముందుగా కాజల్ తనకు 9వ వారం రిగ్రెట్ ఉందని చెప్పింది. జైలు నామినేషన్ సందర్భంగా సన్నీ, మానస్‌లను సేవ్ చేయాల్సింది. కానీ చేయలేదనే బాధగా ఉందని తెలిపింది. షణ్ముఖ్ తనకు 11వ వారంలో రిగ్రెట్ ఉందన్నాడు. ఆ వారంలో సిరితో జరిగిన వివాదానికి సంబంధించిన విషయంలో తనే బాధ్యుడిని అని, అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పాడు. సన్నీ తనకి 12వ వారంలో రిగ్రెట్ ఉందన్నారు. ఆ వారంలో ఐస్‌కి సంబంధించి టాస్క్ లో తాను అలా చేయకుండా ఉండాల్సింది. నా వల్ల అలా జరిగిందని బాధపడ్డట్టు తెలిపారు. మానస్ నాల్గో వారం రిగ్రెట్ ఉందని, ఆ వారం సన్నీకి సపోర్ట్ గా లేకపోయాననే బాధ ఉందన్నారు.
శ్రీరామ్.. తనకు 4వ వారం రిగ్రెట్ ఉందని చెప్పాడు. తాను కెప్టెన్ అయ్యానని, ఆ వీక్ మిర్చి ఇచ్చాను, అది నా లైఫ్‌నే మార్చింది. ఎవరి వంట వారు చేసుకోవాలని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పింది. సిరి చెబుతూ, తనకు 11 వ వారం రిగ్రెట్ ఉందని చెప్పింది. షణ్ముఖ్‌తో జరిగిన ఇష్యూలో బాత్‌రూమ్‌లో తల బాదుకోవడం బాధగా అనిపించిందని తను అలా చేయకుండా ఉండాల్సిందని వెల్లడించింది. మానస్ చెబుతూ.. '4వ వారంలో కెప్టెన్సీ కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డామని... అప్పుడు సన్నీ, నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి ఛాన్స్ ఇచ్చానని చెప్పాడు. ఎక్కువ కత్తిపోట్లు సన్నీకే పడ్డాయని... ఆరోజు నేనే పోటీకి వెళ్లుంటే వాడు అలాంటి స్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వుండేది కాదని మానస్ అన్నాడు.
అనంతరం నాగ్ మరో గేమ్ ఆడించాడు. ఇప్పటి వరకు షో జరిగిన అన్ని వారాలను పరిగణనలోకి తీసుకుని ఎవరు హిట్ స్టార్? ఎవరు ఫ్లాప్ స్టార్? చెప్పాలన్నాడు. తొలుత శ్రీరామ్.. సన్నీకి హిట్, కాజల్‌కి ఫ్లాప్ ఇచ్చాడు. సన్నీ .. మానస్ హిట్, సిరికి ఫ్లాప్ ఇచ్చాడు. సిరి.. షణ్ముఖ్‌కి హిట్ , సన్నీకి ఫ్లాప్ ఇచ్చాడు. మానస్.. సన్నీకి హిట్, షణ్ముఖ్‌కి ఫ్లాప్ ఇచ్చాడు. షణ్ముఖ్.. సిరికి హిట్, కాజల్‌కి ఫ్లాప్ ఇచ్చాడు. అయితే ఎక్కువ ఓట్లతో సన్నీ హిట్ అయ్యాడు.
అనంతరం గార్డెన్ ఏరియాలో హౌస్‌మేట్స్‌ని కూర్చోమని చెప్పిన నాగార్జున.. శ్రీరామ్‌కి బెలూన్స్ ఇచ్చి దానికి ఒక ఎన్విలాప్ ఉందని.. అందులో ఫైనలిస్ట్ నేమ్ ఉంటుందని చెప్పగా.. 'నెక్స్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5 ఈజ్.. సన్నీ' అని అనౌన్స్ చేశాడు శ్రీరామ్.
ఆ తర్వాత 'హౌస్ లో ఆరుగురు ఉన్నారు.. నేను ఆరు నిమిషాల టైం ఇస్తున్నాను.. హౌస్ లో మీ పొజిషన్ ఏంటో మాకు తెలియాలి అని నాగ్ అన్నారు. కాజల్, సిరి తప్ప మిగతా మేల్ కంటెస్టెంట్స్ అంతా మొదటి స్థానం తమదే అని చెప్పారు. దీంతో జోక్యం చేసుకున్న నాగ్ .. అమ్మాయిలిద్దరూ సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. ఈ వెంటనే సిరి రియాక్ట్ అయ్యింది. వెళ్లి ఫస్ట్ ర్యాంక్‌పై నిలబడింది. శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్, సన్నీ, మానస్ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com