బిగ్‌బాస్ 5 తెలుగు: టాస్క్ నుంచి తప్పుకున్న జెస్సీ.. వెదవల్ని చేస్తున్నాడన్న షణ్ముఖ్, సిరికి హగ్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు 53వ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా హౌస్‌మేట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకున్నాయి. జెస్సీ విషయంగా మరోసారి సిరి, షణ్ముఖ్‌ల మధ్య మాటలు నడిచాయి. తాము అతని కోసం నిలబడితే మనల్ని వెదవల్ని చేస్తున్నాడని షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేశాడు. ఎలిమినేట్ అయిన హమీదా టాపిక్ రావడంతో సిరి అలిగింది. మరి కెప్టెన్సీ టాస్క్‌కి ఎవరెవరు అర్హత సాధించారు..? సిరిని షణ్ముఖ్ ఎలా ఓదార్చాడో తెలియాలంటే ఈరోజు బిగ్‌బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే.
కెప్టెన్సీ కోసం పోటీపడే వారిగా షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ నిన్నటి ఎపిసోడ్‌లో గెలిచిన సంగతి తెలిసిందే. మిగిలిన వారు ఇంటిలోకి వెళ్లే అర్హత లేక బయటే పడుకున్నారు. వీరిలో కెప్టెన్ సన్నీ సైతం బయటే పడుకోవడంతో నిద్ర పట్టలేదని, మార్నింగ్ మానస్‌తో బాడీ మసాజ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత నాల్గో రౌండ్ కెప్టెన్సీ పోటీదారుల కోసం జెస్సీ తన అనారోగ్యం కారణంగా తప్పుకున్నాడు. జెస్సీ విషయంలో షణ్ముఖ్, సిరిల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. జెస్సీ కోసం తాము నిలబడితే, అతనేమో దాన్ని వాడుకోకుండా తమని వెదవలని చేస్తున్నాడని షణ్ముఖ్.. సిరి వద్ద వాపోయాడు. ఇదే విషయాన్ని జెస్సీ దగ్గరా చర్చించారు. ఇక నాల్గో రౌండ్‌లో యానీ మాస్టర్, ప్రియాంక పోటీ పడ్డారు. ఇందులో భాగంగా వైట్ బోర్డ్‌పై వీరిద్దరు తమకి కేటాయించిన రంగులను పెయింటింగ్‌గా వేయాల్సి ఉంటుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో యానీ మాస్టర్ విజయం సాధించి.. హౌజ్‌లోకి వెళ్లే అవకాశంతో పాటు కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచారు.
ఇది పూర్తయిన తర్వాత బెడ్స్‌పై పడుకున్న సిరి.. షణ్ముఖ్‌తో మనం తర్వాత ఓ వీడియో చేద్దాం రా అంటుంది. అందుకు షణ్ముఖ్.. అప్పుడు హమీద, ఇప్పుడు నువ్వు నన్ను వీడియోలు చేసేందుకు మాత్రమే వాడుకుంటున్నారని అనడంతో సిరికి పట్టరాణి కోపం వచ్చింది. అటువైపు తిరిగి అలిగింది. దీన్ని గమనించిన షణ్ముఖ్.. అలిగావా అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశాడు. తనకు ఆ అవసరం లేదంటూ సిరి సైతం బుంగమూతి పెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కిచెన్‌లో సరదా సన్నివేశాలు జరిగాయి. చివరికి తనకు సారీ చెప్పాలంటుంది సిరి.. అందుకు షణ్ముఖ్.. ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. తాను సారీ ఇలానే చెబుతానని చెప్పాడు.
అయినప్పటికీ వదల్లేదు సిరి. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో సిరికి సారీ చెప్పాడు షణ్ముఖ్. రెండు సార్లు సారీ చెప్పడంతో కరిగిపోయిన సిరి.. షణ్ముఖ్‌ని గట్టిగా వాటేసుకుంది. ఇక బిగ్‌బాస్ ‘‘ కారులో షికారు ’’ అనే ఛాలెంజ్‌ను ఇచ్చారు. దీనిలో భాగంగా టాయ్‌కార్‌ను నడిపించుకుంటూ పూల కుండీలను తీసుకొని వారి బాక్స్‌లలో చేర్చాలి. ఈ టాస్క్‌లో సన్నీ- కాజల్ పాల్గొనగా.. సన్నీ గెలిచాడు. అయితే కాజల్ లైట్ తీసుకొని గేమ్ ఆడిందని రవి-సిరి-షణ్ముఖ్ డిస్కస్ చేసుకున్నారు. కావాలని ఫ్రెండ్షిప్ గేమ్ ఆడిందని షణ్ముఖ్ కామెంట్ చేశాడు.
ఇక కెప్టెన్సీ పోటీదారులు కాలేకపోయిన వారికి బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చారు. అదేంటంటే.. ‘‘ బంతిలో ఉంది భాగ్యం ’’. ఈ గేమ్‌లో బజర్ మోగినప్పుడు సర్కిల్‌లో ఉన్న బంతి సాధించిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు. ఈ గేమ్‌లో వరుసగా బంతి సాధించిన మానస్.. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, పింకీలను ఎలిమినేట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. మొత్తం మీద ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో లాక్‌డౌన్ కూడా ఎత్తేస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments