బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌కు మిడిల్ ఫింగర్ చూపించిన లోబో.. రవిని రెచ్చగొట్టిన కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
నామినేషన్ల తర్వాతి రోజు బిగ్‌బాస్ 5 హౌస్ హీటెక్కిపోయింది. నిన్న చోటు చేసుకున్న ఘటనలతో పాటు కొత్త వివాదాలతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. షణ్నూ, సిరి, జెస్సీ వేరే గ్రూప్‌గా విడిపోయి సీక్రెట్ గేమ్ ప్లాన్‌లు చేసుకోవడం.. రవి, కాజల్ మధ్య గొడవలు , సింహాసనం కోసం ఇద్దరు రాజులు తలపడటం వంటి విషయాలతో ఈ రోజు బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించింది.
నిన్న మధ్యలోనే ఆగిపోయిన డిస్కషన్ ఈరోజు శ్రీరామ్-షణ్ముఖ్‌ల మధ్య కంటిన్యూ అయింది. ముందుగా శ్రీరామ్ 'నువ్ విన్నావా అసలు నేనేం చెప్పానో' అని అనగా.. 'తను నా ఫ్రెండ్.. నేను స్టాండ్ తీసుకుంటా' అని ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్. ఇక్కడ అందరూ అందరికీ ఫ్రెండ్సే అని శ్రీరామ్ అనగా.. 'కానీ నా రూల్ బుక్ లో విన్నరే మాట్లాడాలని లేదు' అని షణ్ముఖ్ యాటిట్యూడ్ చూపించాడు. 'నీ రూల్ లో పెట్టుకో.. పనికొస్తది.. 26 ఏళ్లకు ఏం అవసరం లేదని అనుకోకు.. నేను ఇంతే నా రూల్స్ ఇంతే అని అనకు..' అంటూ శ్రీరామ్ గట్టిగా చెప్పగా.. షణ్ముఖ్ ఏదో వెక్కిరించినట్లుగా నవ్వాడు.
ఇంతలో సిరి కూడా శ్రీరామ్‌పై తన ప్రతాపం చూపించింది. . 'పార్టిసిపేషన్ లేదని ఎందుకు అంటున్నావ్ అని' శ్రీరామ్‌ని ప్రశ్నించింది. దానికి శ్రీరామ్ బదులిస్తూ 'మెచ్యూరిటీకి మించి మాట్లాడకు..' అంటూ కామెంట్ చేశాడు. సరిగ్గా అప్పుడే యానీ మాస్టర్ వచ్చి.. 'పని మొత్తం నేనే చేస్తున్నానని చెప్పడం కరెక్ట్ కాదని' సిరితో అనగా.. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే.. 'నువ్ మాట్లాడితే మజాక్.. నేను మాట్లాడితే రజాక్..' అంటూ యానీ కాస్తంత కోపంగానే అంది. దీంతో సిరి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది.
ఆ తరువాత ఈరోజు డిన్నర్ కి ఏం చేస్తున్నారని రవి, లోబోలను అడిగింది కాజల్. వాళ్లు ఏదో లిస్ట్ చెప్తుండగా.. ''నిన్న గొడవ జరిగింది దేనికి అంటే.. రవి, ఇంకా లోబో వాష్ రూమ్‌లో నుంచి లేచి, డిన్నర్‌లోకి రావడానికి'' అని సరదాగా ఆటపట్టించింది కాజల్. అది కాస్తా రవికి రెచ్చగొట్టినట్లుగా అనిపించింది. ఇదే సమయంలో లోబో పరోక్షంగా కాజల్ కి మిడిల్ ఫింగర్ చూపించాడు.
అదే విషయాన్ని కాజల్ హౌస్ మేట్స్‌కి చెబుతుండగా.. 'నాకు అలా ఎవరైనా చూపిస్తే కట్ చేసి పారేస్తా' అంటూ ప్రియాంక వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో సరిగ్గా అదే సమయంలో రవి, లోబో అక్కడికి వచ్చారు. 'నేను సరదాగా అన్నాను' అని కాజల్ చెప్పగా.. 'నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు.. నా నోట్లో నుంచి తప్పుడు మాటలు వస్తాయేమో అని కంట్రోల్ చేసుకుంటున్నా..' అంటూ రవి కోపపడ్డాడు. ఈ క్రమంలో కాజల్, రవి గొడవకు దిగారు. 'నాకు లోబో మిడిల్ ఫింగర్ చూపించడం నీకు ప్రాబ్లెమ్ కాదు కదా' అని రవిని ప్రశ్నించింది కాజల్. ఇది కాస్తా శృతిమించేలా వుండటంతో శ్రీరామ్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండగా.. 'ఇంటికి పెద్దాయన ఈ మ్యాటర్ సెటిల్ చేస్తున్నాడు' అంటూ జెస్సీ దగ్గర సెటైర్ వేసి తనలో తాను నవ్వుకున్నాడు షణ్ముఖ్.
తర్వాత బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే పేరుతో కెప్టెన్సీ పోటీదారులకు గేమ్ షురూ చేశారు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా ఇంటి సభ్యులు ప్రజలుగా వ్యవహరిస్తారు. ఇద్దరు రాకుమారులు వారి దగ్గరున్న ధనాన్ని టాస్క్‌లతో పాటు సేవలు చేయించుకోవడానికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. టాస్క్ పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మంది సపోర్ట్ లభిస్తే వాళ్లు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడేందుకే ఎలిజబుల్ అవుతారు
దీంతో రవి, సన్నీ సపోర్ట్ కోసం హౌస్‌మేట్స్ వెంట పడ్డారు. ఈ క్రమంలో యాంకర్ రవికి విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ మాస్టర్ మద్ధతుగా నిలవగా.. సన్నీకి మానస్, లోబో, ప్రియాంక సింగ్, ప్రియ, సిరి, షణ్ముఖ్, జెస్సీ సపోర్ట్ చేశారు. అయితే ఉన్నట్లుండి సిరి.. రవి గ్యాంగ్‌లో చేరిపోవడంతో అంతా షాకయ్యారు. అటు ఖజానాలో నుంచి ఒక్క పైసా దొంగిలించేది లేదని విశ్వ తేల్చి చెప్పేశాడు. కానీ జెస్సీ, సిరి, షణ్ముఖ్, కాజల్ మాత్రం దొంగతనమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఖజానాలో నుంచి నాణాలు మిస్సవుతున్నట్లు గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చేతగానోళ్లు చేసే చిల్లర పనులంటూ కామెంట్ చేశాడు.
ఆ వెంటనే బిగ్‌బాస్ ఇచ్చిన 'మట్టిలో మహాయుద్ధం' అనే కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్; సన్నీ వైపు నుంచి మానస్, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments