బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ ఎలిమినేషన్.. మానస్‌ని హగ్ చేసుకొని వీడ్కోలు, హౌస్‌మేట్స్ ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో ఆదివారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. అందరూ ఊహించినట్లుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడంతో హౌస్ మేట్స్ షాకయ్యారు. మానస్‌ను విడిచి వెళ్లడంపై పింకీ కంటతడి పెట్టింది. వెళుతూ వెళుతూ మానస్ నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. మరి ఈ రోజు ఎపిసోడ్ వివరాలు.. పింకీ హౌస్ మేట్స్ గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ఆదివారం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు హోస్ట్ నాగార్జున. వచ్చి రాగానే వారితో ఓ గేమ్ ఆడించారు. కొన్ని సినిమాల్లోని క్యారెక్టర్ల ఇచ్చి.. అవి ఎవరికి సూట్ అవుతాయో చెప్పాలని అన్నారు . ప్రియాంక 'మహానటి' అని సన్నీ ఆమెకి బ్యాడ్జ్ ఇచ్చాడు. షణ్ముఖ్‌కి 'రోబో' సినిమాలో వశీకరన్ పాత్ర సూట్ అవుతుందని పక్క వాళ్లను బాగా కంట్రోల్ చేస్తాడని సిరి అతడికి బ్యాడ్జ్ ఇచ్చింది. సిరికి 'నీలాంబరి' క్యారెక్టర్ బ్యాడ్జ్ ఇచ్చాడు షణ్నూ. శ్రీరామ్ 'కట్టప్ప' బ్యాడ్జ్ ని సిరికి ఇచ్చాడు. అనంతరం 'అర్జున్ రెడ్డి' బ్యాడ్జ్‌ను సన్నీకి ఇచ్చింది కాజల్. శ్రీరామ్ రేలంగి మావయ్య అని అతడికి బ్యాడ్జ్ ఇచ్చాడు మానస్. 'అపరిచితుడు' బ్యాడ్జ్ ను మానస్ కి ఇచ్చింది ప్రియాంక. 'భానుమతి' బ్యాడ్జ్ ను కూడా సిరికే ఇచ్చారు. 'పెదరాయుడు' బ్యాడ్జ్ ను షణ్ముఖ్ కి ఇచ్చింది కాజల్. 'చిట్టిబాబు' బ్యాడ్జ్ సన్నీకి ఇచ్చారు హౌస్ మేట్స్. 'ఇస్మార్ట్ శంకర్' బ్యాడ్జ్ మానస్ కి ఇచ్చాడు షణ్ముఖ్. 'సీతయ్య' బ్యాడ్జ్ ను సన్నీకి ఇచ్చింది పింకీ. 'మర్యాద రామన్న' శ్రీరామచంద్ర అని అతడికి బ్యాడ్జ్ ఇచ్చాడు సన్నీ.
తర్వాత నామినేషన్స్‌లో వున్న శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సిరిలను నిలబడమని చెప్పారు నాగార్జున. స్టేజ్ పై నుంచి ఎవరు సేఫ్, ఎవరు అన్ సేఫ్ అనే విషయాన్ని క్యూబ్స్ ద్వారా వెల్లడించారు. ఇందులో మానస్ సేఫ్ అని వచ్చింది. ఆపై ఇంటి సభ్యులతో మరో గేమ్ ఆడించారు నాగార్జున. వారికి కొన్ని సినిమా పాటలు ఇచ్చి, నోట్లో నీళ్లు పోసుకుని ఆ పాట పాడాలని ఆదేశించారు. ఆపై నామినేషన్‌లో ఉన్న కాజల్, ప్రియాంక, సిరిల ముందు కలర్డ్ సాండ్ పెట్టారు. అందులో ఒక బాల్ ఉంటుందని... దాని మీద సేఫ్, అన్ సేఫ్ అని రాసి ఉంటుందని చెప్పారు. ఇందులో కాజల్ సేఫ్ అని వచ్చింది.
అనంతరం లూడో గేమ్ ఆడించారు నాగ్. ఇందులో సన్నీకి పనిష్మెంట్ రావడంతో 'ఎపిసోడ్ అయ్యేవరకు లిప్స్టిక్ అండ్ ఐలైనర్ వేసుకొని ఉండాలని' నాగార్జున ఆదేశించారు. దీంతో కాజల్, ప్రియాంక.. సన్నీకి మేకప్ వేశారు. ఆ తరువాత మానస్‌కి కూడా పనిష్మెంట్ కింద పిల్లోతో రొమాన్స్ చేయాలని చెప్పాడు. కానీ చేయలేకపోయాడు. దీనికి పింకీని పంపించమంటావా ప్రశ్నించారు నాగ్ ... దీంతో షాకైన మానస్ వద్దు, దిండే నయమని చెప్పినప్పటికీ హౌస్‌మేట్స్ అంతా పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్ చేయించారు.
ఇక నామినేషన్‌లో చివరికి మిగిలిన సిరి, ప్రియాంకల ముందు చిన్న కొండలు పెట్టారు. గ్లాస్‌తో సొల్యూషన్ ఇచ్చి ఆ కొండలపై పోయమన్నారు. అందులో సిరికి గ్రీన్ కలర్ రావడంతో ఆమె సేఫ్ అవ్వగా.. ప్రియాంక ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్‌కి వెళ్లిన ప్రియాంకను ఇంటి సభ్యుల గురించి నుంచి తన అభిప్రాయాలు పంచుకుంది ప్రియాంక.
మొదట సిరి గురించి చెబుతూ, తనది వైజాగ్ అని తెలిసి ఫ్రెండ్స్ అయిపోయామని, ఒరేయ్ పింకీ, ఒరేయ్ సిరి అని పిలుచుకున్నట్టు చెప్పింది. ఇప్పుడు తనకు ఓ చెల్లి ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది. శ్రీరామ్ గురించి చెబుతూ, హౌజ్‌లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని తెలిపింది. హౌజ్‌లోకి వచ్చినప్పుడు షణ్ముఖ్ తనకు తమ్ముడిలాంటి వాడని అనుకున్నానని, తర్వాత ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి అన్నయ్య అని పిలుస్తున్నట్లు వెల్లడించింది. సన్నీ గురించి చెబుతూ, అన్నయ్య లాంటి ఫీలింగ్ కలిగిందని, ఇప్పటికీ అలానే ఉందని, తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాడని చెప్పింది. కాజల్ గురించి చెబుతూ.. ఇంటిలోకి వచ్చిన కొత్తలో ఆమెని చూసి చాలా అల్లరి చేస్తుందనుకున్నానని, ఇప్పటికీ అలాగే వుందని, అదే నాకు ఇష్టమని పింకీ తెలిపింది.
మానస్ గురించి చెబుతూ.. హౌజ్‌లోకి వచ్చినప్పుడు సిల్కీ హెయిర్‌తో బాగున్నాడనిపించిందని గుర్తుచేసుకుంది. మాట్లాడాలని ప్రయత్నిస్తే.. పట్టించుకోకుండా వెళ్లిపోయాడని, ఎంత పొగరో అని అనుకున్నానని తెలిపింది. కానీ పోను పోను మంచి బాండింగ్ ఏర్పడిందని తెలిపింది ప్రియాంక. మానస్‌ని విన్నర్‌గా చూడాలనుకుంటున్నట్టు ఆకాంక్షించింది. తన కోసం పాట పాడమనగా.. 'ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో..' అంటూ పాటందుకున్నాడు. అనంతరం శ్రీరామచంద్ర కూడా.. ‘‘ ప్రియా ప్రియా.. చంపొద్దే’’ అంటూ పాట పాడాడు. తర్వాత ప్రియాంక అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని నిష్క్రమించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments