బిగ్‌బాస్-3 ఫేమ్ ‘రోహిణి’ని కమిట్మెంట్ అడిగారట

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్- 3 ఫేమ్ రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా పలు టీవీ చానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చిన రోహిణి తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర ఘటనలు, క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్, బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన పలు విషయాలను పంచుకుంది. తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని చెప్పుకొచ్చింది.

రెండు సార్లు..!

బీటెక్ చదివిన నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. సినిమాల మీద ఉన్న ఆసక్తితో అవకాశాలు వస్తాయన్న ఆశతో పలు సీరియల్స్ ఆఫీసులకు వెళ్లాను. అయితే ఓ ఆఫీసులో ఓ వ్యక్తి నన్ను కమిట్‌మెంట్‌‌ అడిగాడు. నేను ఇచ్చిన సమాధానంతో ఆ ఎపిసోడ్ అక్కడితే అయిపోయింది. అంతేకాదు మరోసారి మరో టీవీ సీరియల్ ఆడిషన్స్ కోసం వెళితే అక్కడ కూడా నాకు ఇదే ప్రశ్న ఎదురైంది. నో చెప్పి వచ్చేశాను అని రోహిణి చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. తెలుగులో పలు టీవీ సీరియల్స్‌లో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ రోహిణి బాగా పాపులర్ అయ్యింది. అంతేకాదు జబర్దస్త్‌కు వెళ్లి అక్కడ కామెడీ పండించిన విషయం విదితమే.