ఏం జరిగినా ఇద్దరికీ వర్తిస్తుంది.. ఎలిమినేషన్ కూడా, రోహిత్- మేరీనాలకు షాకిచ్చిన బిగ్‌బాస్
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటి ఎపిసోడ్లో క్లాస్, మాస్, ట్రాష్.. టాస్క్ ముగించిన బిగ్‌బాస్ నామినేషన్లకు తెరదీసిన సంగతి తెలిసిందే. ట్రాష్‌లో వున్న ఆదిత్య, ఇనయా, అభినయశ్రీ నేరుగా నామినేట్ కాగా... ఈరోజు ఎవరు నామినేట్ అవుతారా అనే ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టింది. ఇక ఎపిసోడ్ మొదలవ్వగానే.. యథావిధిగా క్లాస్ టీం మెంబర్స్‌ను నామినేషన్ నుంచి తప్పించగా, మిగిలిన కంటెస్టెంట్లో నామినేషన్ ప్రాసెస్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ట్విస్ట్ ఇచ్చారు బిగ్‌బాస్.. రియల్ లైఫ్ భార్యాభర్తలైన రోహిత్ - మేరీనాలలో ఒకరిని నామినేట్ చేస్తే, ఇద్దరూ నామినేట్ అయినట్లేనని, అలాగే ఒకరు ఎలిమినేట్ అయినా ఇద్దరూ హౌస్‌ను వీడాల్సి వుంటుందని స్పష్టం చేశాడు. గతంలో వరుణ్ - వితికా షేరు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా .. ఎవరి ఆట వారిదే, ఎవరి నామినేషన్ వారిదే. ఎలిమినేషన్ రౌండ్లోనూ విడివిడిగానే బయటకు వెళ్లారు. మరి మేరీనా - రోహిత్‌లకు బిగ్‌బాస్ ఇలాంటి షాకిచ్చాడేంటి చెప్మా అంటూ కంటెస్టెంట్స్, ప్రేక్షకులు తలలు బాదుకుంటున్నారు.
ఇక నామినేషన్ ప్రక్రియలోకి వెళితే.. రేవంత్ ఫైమా, ఆరోహి రావులను... సుదీప రేవంత్‌ని, ఫైమా..రేవంత్, అర్జున్‌లను, వసంతి..రేవంత్ శ్రీ సత్యలను, అర్జున్.. ఫైమా ఆరోహిలన, కీర్తి..రేవంత్, శ్రీహాన్‌లను, ఆరోహి.. రేవంత్, శ్రీ సత్య, రాజ్ శేఖర్.. వసంతి, శ్రీ సత్యలను, సాల్మన్.. శ్రీసత్య, చంటిలను, రోహిత్ జంట.. ఫైమా, చంటిలను, శ్రీహాన్.. రేవంత్, కీర్తిలను, చంటి.. రేవంత్, సుదీపలను, ఆర్జే సూర్య.. రేవంత్, చంటిలను నామినేట్ చేశారు. వీరందరిలోకి అత్యధిక నామినేషన్లతో చంటి, శ్రీసత్య, రేవంత్, ఫైమా, ఇనయా, ఆదిత్య, అభినయశ్రీలు నామినేట్ అయ్యారు. అంతా ముగిసింది అనుకుంటున్న సమయంలో ఎపిసోడ్ చివరిలో బిగ్‌బాస్ షాకిచ్చాడు. ట్రాష్లోని సభ్యులొకరు మాస్ టీమ్ మెంబర్‌తో స్వాప్ అవ్వొచ్చని చెప్పాడు. దీంతో బాలాదిత్యను సేఫ్ చేసి ఆ స్థానంలోకి ఆరోహిని పంపించారు. క్లాస్ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్ నుంచి ఇప్పటికే తప్పించుకున్న సంగతి తెలిసిందే.
మొత్తంగా మొదటి వారం నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా, ఆరోహి, అభినయశ్రీ నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్స్ ఈ వారం నామినేట్ అయ్యారో. మరి వీరిలో తొలి వారమే ఎలిమినేట్ అయ్యే ఆ దురదృష్టవంతురాలు/ దురదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే నాలుగు రోజులు వెయిట్ చేస్తే చాలు. అయితే ఓ లేడీ కంటెస్టెంట్ తొలి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశం వుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సంగతి పక్కనబెడితే.. లేడీ కంటెస్టెంట్స్ మేకప్ లేకుండా కనిపిస్తుండటంతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రధానంగా బుల్లి తెర నటి కీర్తి భట్, టీవీ9 యాంకర్ ఆరోహి రావు, గీతూ రాయల్, నేహా చౌదరి, ఫైమా లుక్స్ పై సెటైర్లు పడుతున్నాయి. వాళ్లకు కొంచెం మేకప్ వేయండయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments