BiggBoss: కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ షాక్.. ప్రైజ్‌మనీలో కోత, చివరికి ఎంత మిగిలిందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగు విజయవంతంగా పదకొండో వారంలోకి ప్రవేశించింది. ఆర్జే సూర్య, గలాటా గీతూ, వాసంతి, బాలాదిత్యల ఎలిమినేషన్ తర్వాత గేమ్ మంచి రసకందాయంలో పడింది. కంటెస్టెంట్స్ అంతా తిక్క వేషాలు వేయకుండా ఆటలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఆడుతున్నారు. అయితే సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కాస్త చప్పగా సాగినట్లుగా అనిపించింది. శ్రీసత్య, కీర్తి... ఇనయా, రాజ్‌ల గొడవ మినహా చెప్పుకోదగ్గ మెరుపులు కనిపించలేదు. తనకు ఆదివారం ఇగో అనే ట్యాగ్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన శ్రీసత్య.. కీర్తిని నామినేట్ చేసింది.
ఇకపోతే.. మంగళవారం కంటెస్టెంట్స్‌కి షాకిచ్చారు బిగ్‌బాస్. ఆల్రెడీ టైటిల్ విజేతకు రూ.50 లక్షల గిఫ్ట్ ఇస్తామని నాగార్జున అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రైజ్‌మనీలో కోత పెట్టాడు బిగ్‌బాస్. ఫైమా తప్ప మిగిలిన తొమ్మిది మంది ఈ వారం నామినేషన్స్‌లో వున్న సంగతి తెలిసిందే. అయితే వీరంతా నామినేషన్స్ నుంచి సేవ్ కావడానికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి మెలిక పెట్టాడు. కంటెస్టెంట్స్‌కి చెక్కులు ఇచ్చి.. బిగ్‌బాస్ టైటిల్ విజేత పొందే రూ.50 లక్షల్లో నామినేట్ అయిన సభ్యులు ఒక్కొక్కరు కొంత మొత్తం రాస్తూ పోవాలి. ఎవరైతే ఎక్కువ మొత్తం రాస్తారో వారు సేవ్ అవుతారు. కానీ ఈ మొత్తాన్ని బహుమతి మొత్తం అయిన యాభై లక్షల్లో తగ్గిస్తారు. అలాగే సేవ్ అయిన వ్యక్తి తాము ఎంత రాశామో ఇతర ఇంటి సభ్యులకు చెప్పకూడదు. చెక్‌లపై నగదు రాసిన తర్వాత వాటిని డ్రాప్ బాక్స్‌లో వేయాలి. అలాగే నగదు మొత్తం కూడా లక్ష నుంచి రూ.5 లక్షల మధ్యే రాయాలని కండీషన్ పెట్టాడు.
అయితే శ్రీసత్య యాటిట్యూడ్ కారణంగా ఆమెకు శిక్ష విధించారు బిగ్‌బాస్. చెక్‌పై రాసిన అమౌంట్ గురించి లీక్ చేయొద్దని చెప్పినప్పటికీ.. తాను ఎంత రాసిందో తన మిత్రులకు చెప్పేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీసత్య.. ఈ టాస్క్ నుంచి ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఈ దెబ్బతో మిగిలిన వారు అలర్ట్ అయ్యారు. అయితే ఒకే అమౌంట్ రాస్తే దానిని లెక్కలోకి తీసుకోమని ముందే చెప్పాడు బిగ్‌బాస్. శ్రీసత్యను డిస్ క్వాలిఫై చేయగా.. కీర్తి ,రేవంత్, ఇనయా, మెరీనాలు ఒకే మొత్తం రాయడంతో వారిని లెక్కలోకి తీసుకోలేదు. ఫైనల్‌గా రోహిత్, రాజ్‌లు మిగలగా.. రాజ్ అందరికంటే ఎక్కువ మొత్తం రాయడంతో ఇమ్యూనిటీ పొంది సేవ్ అయినట్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్.
ఎవరు ఎంత ఎమౌంట్ రాశారంటే..
శ్రీసత్య : 4,99,999
కీర్తి : 4,99,999
రేవంత్ : 4,99,999
రోహిత్ : రూ.2,51,001
రాజ్ : రూ.4,99,700
మెరీనా : రూ.4,99,998
ఇనయా : 4,99,998
రాజ్ రాసిన మొత్తం రూ.4,99,700ను కట్ చేయగా ప్రైజ్‌మనీలో రూ.45,00,300 మిగిలింది. ఇది చాలదన్నట్లు మళ్లీ ఇంకో టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిర్ణీత సమయంలో క్రికెట్ పిచ్‌పై వంద పరుగులు చేయాలని ఆదేశించాడు. రేవంత్, రోహిత్‌లు వికెట్ల మధ్య పరుగులు తీసి 82 రన్స్ మాత్రమే చేయగలిగారు. దీంతో మరో లక్ష కట్ చేశారు బిగ్‌బాస్. ఈ కోతతో ప్రైజ్ మనీ రూ.44,00,300కు చేరింది. తర్వాత బిగ్‌బాస్ విన్నర్ అయితే ఆ డబ్బుతో ఏం చేస్తారో చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించగా.. ఫైమా, ఆదిరెడ్డిలు ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. శ్రీసత్య అమ్మకు ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పింది. కీర్తి తాను అనాథను కాబట్టి అనాథాశ్రమాలు కట్టిస్తానని చెప్పారు. మిగిలిన వారు ఏం చెప్పారన్నది తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com